Friday 7 November 2014

కవి సంగమం #21#

 Dont worry..I am alright #

My dear believer..
ఎందుకు నా పై జాలిపడుతున్నావ్
వద్దు సమయం వృధా చేసుకోకు 
నీకంతగా జాలి పడాలని ఉంటే come on
నాతో రా...

ముప్పది మూడు కోట్ల మంది దేవతల నుండి శాంతి , సమాధానం దొరకకో 
బాధలు , వెతలు తీరకో ..మతి చలించో ఏమో మరి 
రేయింబవలు బ్రదర్ జాన్ గారికి అమాయకంగా 
సేవలు చేస్తుందే పెద్దిరెడ్డి గారి భార్య 
ఆవిడ మీద పడు 
ఆమెకి తెలుసో , లేదో ఆయనవి already 
నాలుగు నీలిచిత్రాలున్నాయని చెప్పు 

మదురై మీనాక్షమ్మని దర్శించుకుందామని వెళ్లి 
ఆమెని ఖాళీగా వదిలేసి 
వినాయకుడి దర్శనానికి అగచాట్లు పడుతుందే సావిత్రమ్మ 
ఆవిడ మీద పడు 
స్త్రీనే కాదు స్త్రీ దేవతల్నీ తక్కువగా చూసేది 
ఎక్కువ శాతం స్త్రీయే అని చెప్పు 

మనిషి mars మీదికి వెళ్ళే ప్రయత్నం చేసున్న ఈరోజుల్లో కూడా 
చేసిన పాపాలు పోతాయని ..
పంతుళ్ళు తిని లేచిన విస్తళ్ళ మీద పందుల్లా దొర్లుతున్నారు 
చూడు కర్ణాటకలో కొందరు దళితులు 
వాళ్ళ మీద పడు 
వంద మంది అంబేద్కర్ లు పుట్టినా మిమ్మల్ని మార్చలేరని చెప్పు 

20 లక్షలు అప్పు ఎలా తీరుతుందో మార్గం చెప్పమని 
ఇంకో యాభై వేలు అప్పు చేసి జ్యోతిష్యుడికిచ్చాడు చూడు 
మండపేట గణపతి గారు ఆయన మీద పడు 
శాస్త్రాలు అప్పులు తీర్చవని చెప్పు 

నలభయ్యవ సారి మాల ధరించి 
నలభై రోజులు ఎంతో నిష్టతో పూజలు చేసి 
ఉంచుకున్న దాన్ని కూడా మాతా అని సంబోధించి 
కొండ దిగిన వెంటనే quarter తాగి lodge?? కి వెళ్ళాడు చూడు 
గురుస్వామి కొండలరావు ...ఆయన మీద పడు 
నిజం చెప్పు దేవుడుంటే నిన్నేం చేసేవాడు ? అనడుగు 

నన్నిలా వదిలెయ్
నమ్మనంత మాత్రాన నన్నేదో మానసిక వ్యాదిగ్రస్తుడికి మల్లె చూడకు
నమ్మిన ఒకే ఒక్క కారణానికి నీకు నువ్వు దివ్యత్వం ఆపాదించుకోకు 
ఊహించుకు బ్రతకడం , ఊహా చిత్రాలకు మొక్కడం నా వల్ల కాదు 

My dear friend నా మీద జాలి పడకు 
I am perfectly alright….

07-11-2014

1 comment: