Friday 7 November 2014

కవి సంగమం #20#

 # కొనసాగిపోతా #

తను మెచ్చింది రాస్తేనే మడిసికి నచ్చుతుందని
తము నమ్మేది అంటేనే జనం వింటారని 
తెలిసినా కూడా 
చేతికొచ్చింది రాసుకోకుండా
నోటికొచ్చింది పాడుకోకుండా ఉండలేను.
మనిషి నుండి పొందే మెప్పు కోసం కాక
మనసు నుండి పొంగే తృప్తి కోసం రాసుకొనేదే కవిత్వం అని
జనం నుండి పొందే ఆదరణ కోసం కాక
గళం నుండి పొంగే �అనుభూతుల స్వేచ్చా గానమే సుస్వరమనీ 
నమ్మేవాళ్ళందరూ అర్ధం చేసుకుంటారన్న నమ్మకంతో
వ్రాసుకుంటూ.....పాడుకుంటూ.....

06-11-2014

No comments:

Post a Comment