Monday 3 November 2014

కవి సంగమం # 18 #

## ఏక్ లైక్ ప్లీజ్ ##



మిత్రమా  ... అదిగో చూడు 
update చేసి అరగంటయింది 
అప్పుడే ఒక వంద సార్లు చూసుకుంది పాపం
profile picture లోని ఆమె సహజ !!! మందహాసం వాడిపోక ముందే 
ఒక్క లైక్  కొట్టు 
ఏడు  సముద్రాల అవతల A.C గదిలో కూర్చుని 
ఎండలో కార్మికుడి దేహంపై జారిన చెమట బొట్ల  మీద రాసిన కవిత 
అలా ఇంట్లో కూర్చుంటే idea రాక benz లో ఊరంతా తిరుగుతూ 
రోడ్డు పక్కన బిచ్చగాళ్ళ దారిద్ర్యం పై రాసిన కవిత 
దారిలో ఆకలనుకొని subway కెళ్ళి 
meatball marinara తింటూ 
గంజి మీద, దాని సుగుణాల మీద రాసిన కవిత 
what should be covered must be covered 
అని అందరి మగాళ్ళాలాగే నోరు పారేసుకున్నందుకు 
భర్తకి అప్పుడెప్పుడో విడాకులిచ్చి 
ఇదిగో ఈనాడు అన్యోన్య దాంపత్యం గూర్చి అల్లిన కవిత 
" కధ చెప్పు మమ్మీ " అన్న కొడుకుని కసురుకుని 
రాబోయే లైక్స్ , కామెంట్స్ తలుచుకుని మురిసిపోతూ 
బాల్యం మీద , పసితనం మీద రాసిన కవిత 
అదిగో కళ్ళు కాయలు చేసుకొని monitor కేసి చూస్తూ 
బోలెడన్ని ధన్యవాదాలతో ఎదురు చూస్తోంది 
ఏం? స్వానుభవంతోనే కవిత్వం రాయాలా 
స్వప్నించి కూడా రాయొచ్చు 
పోయేదేముంది నీకు ..please ఒక్క like కొట్టు 
అదిగో మళ్ళీ "నువ్వు స్త్రీ ద్వేషివి" అన్నట్టు చూడకు 
మనలోనూ ఉన్నారు కవి సామ్రాట్టులు , అభినవ సవ్యసాచులు 
"crazy about getting identified" people
ఇంకోసారి వాళ్ళ గురించి కూడా  మాట్లాడుకుందాం 


_ మోహన్ తలారి 

No comments:

Post a Comment