రాత్రికి వయసెంత ? అనడిగితే
పగటికన్నా ఒక పూట తక్కువ అనే లౌఖ్యం నీకుందా......
అందుకే నేను మనిషిని సార్....
అంగారక గ్రహంలో ఏముందన్న తపనే తప్ప
పొరుగువాడి అంతరంగంతో నాకసలు పనే లేదు..
భూకంపాలకి, సునామీలకి స్కేళ్ళున్నాయ్ నా దగ్గర ,
పేదవాడి ఆకలికి మీటర్ లేదు..
చచ్చాక ఏమౌతానన్న భయమే గాని
సరిగ్గా బతకడం ఇంకా నేర్చుకోలేదు
లంచమా??
నాకు దొరకలేదన్న బాధే గానీ
దాంతో నాకేం సమస్య లేదు - మనిషిని సార్ నేను..
అత్యాచారమా ??
నాకు ఛాన్స్ దొరకలేదన్న ఏడుపే గాని
ఇదేం నిజం రోదన కాదు - మగాణ్ణి సార్ నేను
ఇన్ని నీతి కబుర్లు రాస్తానా..??!!
ఒక్కటీ నేను చెయ్యలేను..
ఎందుకంటే .....ప్రతిసారీ అడగొద్దు మరి నన్ను
దేవుడున్నాడా అంటావా??
అది మాత్రం అడక్కండి సార్ మా మనుషులూరుకోరు...
కావాలంటే మనిషిని చంపేసుకోండి మేం అడగం...
చెట్లకి, పుట్లకి , అప్పుడెప్పుడో చచ్చిన ఎలక్కి వయసు కనుక్కునే పనిలో నేనుంటే...
పురిట్లో సచ్చిన బిడ్డ కోసం ఈ గోలేంటయ్యా
demonstrations , నిరసనలు , సత్యాగ్రహాలు, నిరాహార దీక్షలు, చారిటీలు ఇవన్నీ నిజమనుకునేరు.....
అంతా డ్రామా సార్...
ఎందుకంటే after all నేను మనిషిని సార్....
-మోహన్ తలారి

No comments:
Post a Comment