Monday, 7 May 2012

తలారి మోహన్ గాడి తొలి ప్రేమ


  కధ మొదలుపెట్టడానికి ముందు నేనొక వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పాలి....అతనే MARK JUKERBERG...ఎవరీ వ్యక్తి అనుకోకండి...ప్రస్తుతానికి ప్రపంచాన్ని కుదిపేస్తున్న The best social networking site FACEBOOK వ్యవస్థాపకుడు.....అసలీ కధకి, అతనికి సంబంధం ఏమిటంటే...మొన్న రాత్రి, ఎప్పటిలాగే నిద్ర రాక నెట్ ముందు కూర్చున్నా...ఏం చెయ్యాలో పాలుపోక FACEBOOK ఓపెన్ చేశా... చిన్నప్పటి friendsని వెతుకుదామని...ఒక్కొక్కళ్ళ పేర్లు గుర్తు చేసుకోవడం మొదలెట్టాను...నేను మగాణ్ణి కాబట్టి, అందునా మోహన్ గాణ్ణి కాబట్టి ముందు అమ్మాయిల పేర్లు గుర్తు చేసుకోవడం మొదలెట్టాను...ఒకటవ తరగతి నుంచి మొదలెట్టాను. ఆలోచించగా ఆలోచించగా...ఒక పేరు దగ్గర ఆగాను.... పేరు సుధా పావని...వెంటనే టైపు చేసాను search లో ..20 మంది profiles ఓపెన్ అయ్యాయి... కొంతమంది పూలు, కొంతమంది కుక్క పిల్లలు, కొంతమంది heroines ఫొటోస్ పెట్టారు ప్రొఫైల్ పిక్స్ ..కాని ముగ్గురు అమ్మాయిలు మాత్రం వాళ్ళ పిక్స్ పెట్టారు..అందులో ఒక అమ్మాయిని చూస్తే నా ఫ్రెండ్ లాగా అనిపించింది...వెంటనే msg చేసాను...పొద్దున్నే తను reply చేసింది....నేను వెతుకుతున్నది తననే...13 years తర్వాత మళ్ళీ తనని చూసిన ఆనందం మాటల్లో చెప్పలేను...దీనంతటికీ కారణం MARK...అందుకే once again thanks to him...
కధలోకి వెళ్తే....అది 1997..మా నాన్నగారు government employee కావడం వల్ల transfers అవుతూ ఉండేవారు...నేను అప్పుడే నా 5th క్లాసు complete చేసి primary school certificate అందుకున్నా...నేను 5th వరకు రాజవరం లో చదివా...తర్వాత నాన్న గారికి బుట్టాయగూడెం అని ఒక అడవికి transfer అయ్యింది...అక్కడ నన్ను ZPPH school(జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల) లో జాయిన్ చేసారు...మొదటి రోజు school కి వెళ్లి 6th class కి దారెక్కడ అనడిగాను...watch man ఒక పెద్ద గది వైపు చూపించాడు. దానికి రెండు గుమ్మాలున్నాయి.. మొదటి గుమ్మం దగ్గరకి వెళ్లి may i come in sir అనడిగా...సార్ చదువుకుంటున్న న్యూస్ పేపరు లో నుంచి తలెత్తకుండా రెండవ గుమ్మం నుంచి లోపలకి రమ్మని సైగ చేశాడు....నేను అలాగే చేసాను..లోపలికెళ్ళి చూసేసరికి స్కూల్ పిల్లలు అందరూ ఒకే చోట కూర్చున్నారు....దాదాపు 250 మంది....నేనొక చోట చిన్న ఖాళీ దొరికితే అందులో కూర్చున్నా...క్లాసు పిన్ డ్రాప్ సైలెన్స్ ..ఒక 20 నిమిషాల తర్వాత బెల్ అయిపోయింది.సారు బయటికెళ్ళిపోయారు . నేనింక ఉండబట్టలేక పక్కనున్నవాడిని " ఇదేంట్రా స్కూల్ పిల్లలంతా ఒకే చోట కూర్చున్నారు" అనడిగా.
వాడు నా వంక జాలిగా చూసి " పిచ్చివాడా ఇది గవర్నమెంటు స్కూల్.. వీళ్ళందరూ 6th క్లాసే" అన్నాడు...వాడే గుత్తుల శ్రీకాంత్ .. తరువాత నెమ్మదిగా ఆడిటోరియం కి అలవాటు పడిపోయాం ...నాకింకా గుర్తు నా రోల్ నంబరు 126..
అంతా బాగానే ఉంది గాని ఒక్కటే ప్రాబ్లం .హై స్కూల్ కి వచ్చేసినా ఇంకా లవర్ లేకపోవడం .. లోపు శ్రీకాంత్ గాడికి నాకు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు .వాళ్ళే mustafa, G.K(గజ్జి కుక్క అలియాస్ గోపాల కృష్ణ వాడి అన్న పేరు B.K(బొచ్చుకుక్క అలియాస్ బాల కృష్ణ )).. లవర్ విషయం discuss చేయడానికి ఒక రోజు మేం నలుగురం గ్రౌండ్ లో మీటింగ్ పెట్టుకున్నాం ..ఏది ఏమైనా ఒక వారంలో ఎవరో ఒకర్ని పడేయ్యాలని నిశ్చయించుకున్నాం . అయితే అసలు సమస్య అక్కడే మొదలయ్యింది ..మా స్కూల్ కి వచ్చే వాళ్ళందరూ అడవి బిడ్డలు .బుట్టాయగూడెం చుట్టు పక్కల ఉన్న ముప్పిన వారి గూడెం, దొరమామిడి, కొయ్యలగూడెం, మర్లగూడెం లాంటి అరివీర భయంకరమైన కుగ్రామాల నుంచి వచ్చేవారు ...వాళ్ళల్లో అందమైన వాళ్ళని వెతకడం అంటే బాలకృష్ణ సినిమాల్లో హిట్స్ కోసం వెతికినట్టే ..ఉండడానికి 100 మంది ఉన్నా పనికొచ్చే మొహం ఒక్కటుండేది కాదు...ఒకమ్మాయి పేరు ముకుంద ..అసలు దానికి ముక్కుందా? అని పేరు పెట్టుంటే కరెక్టుగా ఉండేది ..ఎవడో సుత్తితో కొట్టినట్టు లోపలికుండేది. ఇంకొకత్తి అక్కమ్మ ..దానికేకంగా మూతి,ముక్కు కలిసిపోయి ఉండేవి ..అందరూ ఇదే టైపు...చివరికి అందరినీ వడకట్టగా లీలావతి మిగిలింది ..నలుగురం కలిసి తననే లవ్ చేద్దామని డిసైడ్ అయ్యాం ..లవ్ లెటర్ బాధ్యత నా మీద పడింది ...రాత్రంతా కూర్చుని లవ్ లెటర్ రాసాను.
ప్రియమైన లీలావతికి,
మోహన్ రాయునది.
నిన్ను నేను చాలా దారుణంగా ప్రేమిస్తున్నాను...
కావాలంటే నా నోటు బుక్సు చూడు ప్రతీ బుక్కులోనూ నీ పేరు కింద నా పేరు రాసాను. నువ్వొప్పుకోకపోతే బ్లేడుతో కోసుకొని చచ్చిపోతాను...

మా వాళ్ళకి లెటర్ తెగ నచ్చేసింది ..పేర్లు మార్చి same letter కాపీ కొట్టేసారు ..నలుగురం కలిసి డ్రిల్ period లో మా ప్రేమ లేఖలు దాని బాగ్లో పెట్టేశాం ..నలుగురం రాత్రంతా నిద్రపోలేదు ..లీలావతితో డ్రీం సాంగ్స్ ...రాత్రి లేటుగా పడుకుని, లేటుగా లేవడం వల్ల స్కూలుకి లేటుగా వెళ్లాం ..వెళ్లేసరికి మా క్లాసు బయట రాక్షసుడు (డ్రిల్లు మాస్టర్ మధుసూధన రావు)ఒక skipping rope, రెండు కర్రలు పట్టుకుని నుంచుని ఉన్నాడు ..పక్కనే లీలావతి ఉంది .మాకు సీన్ అర్థమయ్యిపోయింది ..వెళ్ళగానే మమ్మల్ని ఒక question అడిగాడు .."కుక్కల్ని కొట్టినట్టు కొట్టడం అంటే ఏమిటో తెలుసా ?"" అని.. తెలియదు సార్ అన్నాం ..అయితే చూడండి అని ఆగకుండా, గంట కొట్టాడు ...ఇంక ఒంటి మీద ఎక్కడా గ్యాప్ లేదని వాడికి నమ్మకం కుదిరాక వదిలేసాడు ..పైగా రోజంతా ఎండలో మోకాళ్ళు వేయించాడు ..పక్కనే నుంచున్న లీలావతి నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని నవ్వుతుంటే నాకు దాన వీర శూర కర్ణలో పాంచాలీ పంచబద్రుక dialogue గుర్తొచ్చింది..ఇంక సంవత్సరానికి ప్రేమ విషయం పక్కన పెట్టాం..
ఇంతలోనే మేము సీనియర్స్ అయిపోయాం.. 7th క్లాసు లో మమ్మల్ని నాలుగు sections గా డివైడ్ చేసారు... నేను, G.K, శ్రీకాంత్, B section...ముస్తఫా గాడు మాత్రం వెరే section కి వెళిపోయాడు... 7th కి వచ్చాక ఒక కొత్త విషయం అర్ధమయ్యింది..నలుగురు కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేయకూడదని.. అందుకని వేరు వేరుగా ట్రై చేసుకుందామని డిసైడ్ అయ్యం..కానీ ఏం చేస్తాం..క్లాసు నిండా చప్పిడి ముక్కులు, కొబ్బరి బొండాలు, వాళ్లతో పాటు సూర్పణఖ లీలావతి....ఒక పక్క చూస్తే వయసు మీద పడిపోతుంది.. పక్క పిల్ల దొరకట్లేదు...

ఇలా నిర్లిప్తంగా, నీరసంగా మా జీవితాలు సాగుతుండగా...ఒక రోజు ఉదయం మా తెలుగు క్లాసు జరుగుతుంది.. madam పద్యం పాడుతున్నారు..

పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ
అన్నలదమ్ముల కనుగై దుర్గకు
పూజకు పువ్వులు కోసేది...అని

ఇంతలో May I come in mam...అని ఒక స్వీట్ వాయిస్ వినపడింది...అసంకల్పిత ప్రతీకార చర్యకి ఉదాహరణగా మా తలలన్నీ అటువైపు తిరిగాయ్..Door దగ్గర చూస్తే స్కూల్ uniform లో ఉన్న దేవకన్య..ఎవరమ్మా అని అడిగారు madam...నేను మనసులోనే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనుకున్నాను...ఆమె నా పేరు సుధా పావని madam new joining అని చెప్పింది...లోపలికొచ్చి కూర్చుంది...madam lesson continue చేసారు..నేనప్పట్టికి కన్నులు రెప్పలార్పి 3 నిమిషాలయ్యింది.. కానీ తను మాత్రం సెకనుకు నాలుగు సార్లు రెప్పలార్పుతుంది..ఎంత బావుందో... మిగలిన చెత్త మొహాల మధ్య కూర్చుంటే గంజాయి వనం మధ్యలో మొలిచిన గంధపు మొక్కలా ఉంది..ఇంకేముంది మోహన్ గాడు ఫ్లాట్..క్లాసులు జరుగుతూనే ఉండేవి..నేను తనని చూస్తూనే ఉండేవాణ్ణి...silent గా కూర్చునేది...నేను క్లాసు లీడర్...సార్ ఎవరన్నా అల్లరి చేస్తే నన్నే కొట్టమనేవారు..నేను అమ్మాయిల్ని మాత్రమే కొట్టేవాణ్ణి..లీలావతినైతే చెప్పక్కర్లేదు.. కానీ సుధని ఒక్కసారి కూడా కొట్టలేదు..అసలు తను రోజుకి నాలుగు మాటలు కన్నా ఎక్కువ మాట్లాడేది కాదు..evining ఇద్దరం tution కూడా ఒక చోటే.. అక్కడ కూడా అదే పరిస్థితి...tution అయ్యాక cycles నడిపించుకుంటూ ఇంటికెల్లేవాళ్ళం అమ్మయిలందరూ ముందు, వెనక మేము...

ఒక రోజు నేను క్లాసులో ఒకణ్ణే కూర్చుని ఏదో రాసుకుంటుండగా వెనక నుంచి వచ్చింది సుధ...మోహన్ అని పిలిచింది...వెంటనే తిరిగేస్తే cheap గా అనుకుంటుందని slow motion లో రాసుకుంటూనే వెనక్కి తిరిగి ఎవరు అన్నాను? నాకు maths notes కావాలి మోహన్ అని అడిగింది...ఖర్మ ఛి ఛి తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లెక్కలు...అది తప్ప ఇంకేదడిగినా నా దగ్గర ఉంది...అదొక్కటే రాసేవాణ్ణి కాదు...కానీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు..అందుకే నా notes GK గాడు తీసుకున్నాడు,రేపొద్దున్న ఇస్తాను అని చెప్పాను..ఇంటికెళ్ళి ఒక కొత్త notes పెట్టి రాత్రి 2 వరకు కుర్చుని GK గాడి maths notes మొత్తం కాపీ చేసేసాను...పడుకునే ముందు ఒక డ్రీం సాంగ్, సుధ పప్పు(అదే brahmin), నేను christian, మళ్ళీ ఇంకొక సీతాకొకచిలక సినిమా...మాటే మంత్రం song...అలా డ్రీం లోకి జారుకుని నిద్రపోయా...పొద్దున్నే స్కూల్ కి వెళ్లి తనెప్పుడు నోట్స్ అడుగుతుందా అని చేత్తో పట్టుకుని కూర్చున్నా..కాని అడగలేదు...ఈవినింగ్ అయిపోయింది..ఇంటికి వెళిపోతుంటే ఇంక ఆగలేక నేనే వెళ్లి "సుధా నోట్స్ కావలన్నావ్ కదా అని అడిగాను..దానికి తను అయ్యో చెప్పడం మరిచిపోయా మోహన్...నిన్న నిన్ను maths notes అడుగుతుంటే లీలావతి చూసిందంట..రాత్రి మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిందని చెప్పింది...ఒసేయ్ లీలావతి............................అని నేను గట్టిగా అరిచాను ఎవరికీ వినపడకుండా...ఇంటికెళితే మా అమ్మ అప్పుడే ఫ్రెష్ గా శీలావతి చేపల పులుసు పెట్టింది...దాన్ని లీలావతి గా ఊహించుకుని కసిగా నమిలి మింగేసాను.. 7th పబ్లిక్ కాబట్ట్టి తరువాత రోజుల్లో అందరం చదువులో పడిపోయాం...ఇంతలో summer holidays..నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయాను...కానీ అక్కడ కూడా సుధ ఆలోచనలే...ఇంక 8th కి వెళ్ళిన వెంటనే propose చేసేద్దామని డిసైడ్ అయిపోయాను...ఆనందంగా గంతులేసుకుంటూ ఊరికి తిరిగొస్తే...గజ్జి కుక్క గాడు ఒక భయంకరమైన న్యూస్ పట్టుకుని నా దగ్గరికొచ్చాడు...పావని వాళ్ళు transfer అయిపోయారురా అని.. తరువాత మళ్ళీ తన జాడ లేదు.. తనని మర్చిపోవడానికి నాకు 3 సంవత్సరాలు పట్టింది..10th లో నువ్వు నాకు నచ్చావ్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇంకో అమ్మాయి గురించి ఆలోచించలేదు...నేనా సినిమాలో పింకీని లవ్ చేసాననుకుంటున్నారా...no way..I loved ఆర్తి..

ఇదిగో 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే సుధా పావనితో మాట్లాడడం..ఎంత పెద్దదైపోయిందో...పెళ్ళయి 4 years అయ్యిందట..ఇద్దరు పిల్లలు..తనతో మాట్లాడాక ఎంత హ్యాపీగా అనిపించిందో...తనే కాదు వయసు ఫ్రెండ్స్ ఎవరు కనపడినా అంతే హాపీగా అనిపిస్తుందిప్పుడు...ఆఖరికి లీలావతి కనిపించినా..

అవి golden days...కల్మషం లేని స్నేహాలు, పంచుకున్న రేగొడియాలు, జీళ్ళు...కలిసి తిన్న దెబ్బలు..ప్రతీది ఒక మధుర జ్ఞాపకం... materialistic world లో machines లా బతుకుతున్న మనకి స్నేహితులే ఒక గొప్ప relaxation ....

8 comments:

  1. ela cheppalo emo artham kavadam ledu ee katha chaduvuthoo chala sarlu navvu kunna .. chevilo gurthukosthunnayi song ala veltha undi nakkooda naa school mates appati gnapakalu anni gurthokochhayi ...

    ReplyDelete
  2. chala bagundi mohan garu. ee story chaduvuthunnathasepu nenu na school days ni chala rojulu kadu kadu chala samvathsarala tharuvatha gurthu chesukunnanu.
    Thank you sooooooo much.

    ReplyDelete