Wednesday 13 February 2013

unknyownya దాంపత్యం

                      సాధారణంగా ప్రతీ ఒక్కరికీ గవర్నమెంట్ ఉద్యోగాల పట్ల ఒక అభిప్రాయం ఉంటుంది..అదేమిటంటే కావలసినంత ఖాళీ సమయం ఉంటుందని...ఆ అభిప్రాయం కొంతవరకు నిజమే గాని, ఆ సమయాన్ని మనం దేని కోసం ఉపయోగించుకోలేమన్నది అసలు వాస్తవం("పైసా పని లేదు, క్షణం తీరిక లేదు అంటే అర్ధం అదే")..ఉదాహరణ నేనే..FCI లో ఉద్యోగం రాక ముందు దాదాపు రోజుకి 5 గంటలు internet ముందు గడిపే వాణ్ణి ..కాని ఇప్పుడు అయిదు రోజులకొకసారి అయిదు నిముషాలు గడపడానికి కూడా సమయం దొరకట్లేదు..చాలా రోజుల తర్వాత ఒక మంచి concept దొరికి మళ్ళీ రాస్తున్నాను..
                         ఇప్పుడు నేను రాస్తున్న కదా పాలకొల్లులోని ముచ్చెర్ల  వారి వీధిలోని( సీతాకోక చిలక సినిమా హీరోయిన్ ముచ్చెర్ల అరుణ గుర్తుందిగా..ఆమె పుట్టింది ఆ వీధిలోనే) ఇద్దరు దంపతులది..నా మనసు దోచుకుంది..అసలు కధలోకి వెళ్ళే ముందు ఎలాగూ  ప్రస్తావన వచ్చింది కాబట్టి పాలకొల్లు గురించి కొన్ని bullet points.

  • పాలకొల్లు గోపురం రోడ్డు లో గాని, రైల్వే స్టేషన్ రోడ్డు లో గాని bike drive చెయ్యగలిగితే India లో ఎక్కడైనా easy గా drive చేసెయ్యొచ్చు. ఇక car drive చెయ్యగలిగితే FORMULA-1 race లో participate చేసెయ్యొచ్చు..
  • పాలకొల్లు మారుతీ టాకీస్ పక్కన ఉన్న హోటల్ లో ఉదయం గాని, సాయంత్రం గాని వెళ్ళిన అరగంట లోపు రొట్టె ముక్క సంపాదించగలిగితే మీరు కెవ్వు కేక అని అర్ధం..ఎవరిదైనా పెద్ద వాళ్ళ recommendation  ఉంటే కొంచెం త్వరగా దొరుకుతుంది .
  • పాలకొల్లు లో ఇళ్లకన్నా  హోటల్స్, స్వీట్ షాప్స్, బజ్జీ బళ్ళు ఎక్కువ..సగం జనాభా సాయంత్రం భోజనం చెయ్యకుండా కేవలం బజ్జీలు, టిఫిన్లు తిని పడుకుంటారన్నది, ఈ మధ్యే సర్వేలో తేలిన ఒక పచ్చి నిజం..(మొగుళ్ళు ఇంటికి మల్లె పూలు పట్టుకెళ్లక పోయినా ఆడవాళ్ళు ఊరుకుంటారేమో గాని, ఇవి తీసుకెళ్ళకపోతే మాత్రం ఆ రోజు వాడు అయిపోయినట్టే)
  • నేను christian అయిన ఒకే ఒక్క కారణం చేత నాకు నలుగురు అద్దెకు ఇల్లు ఇవ్వమన్నారు..చివరికి నేను Christians ఇంట్లోనే అద్దెకు దిగాల్సి వచ్చింది..(అప్పట్లో నేను బ్రాహ్మల పిల్ల-పీటర్ పాల్ వ్రాసినప్పుడు చాలా మంది, నేను చచ్చిపోతున్న caste system ని కష్టపడి బ్రతికించేస్తున్నానని indirect గా satires విసిరారు..వాళ్ళు ఒక్కసారి పాలకొల్లు రావాలని నా మనవి.)
  • ఇది బహుశా మీరు నమ్మకపోవచ్చు..పాలకొల్లులో ఆనంద సాయి స్వీట్ హోం అని ఒక స్వీట్ షాప్ ఉంటుంది...దాని construction కి అయిన ఖర్చు దాదాపు 2 కోట్లు..పైగా పాలకోల్లులోనే వాడికి ఇంకో 5 branches ఉన్నాయ్...
  • పొట్టిక్కలు, dancing baby, గ్లాస్ ఇడ్లీ, చిట్టప్పడాలు మొదలయినవి పాలకొల్లులో మాత్రమే దొరికే కొన్ని తిండి పదార్ధాలు..
  • పాలకొల్లు గోపురం చాలా చారిత్రాత్మకమైనది..అది పూర్తిగా మునిగిపోయిన రోజు సృష్టి అంతమయిపోతుంది అంటారు..
  • ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణ రావు గారు పుట్టింది పాలకోల్లులోనే...ఆయన స్వంత అన్నయ్య ఇక్కడొక xerox shop నడుపుకుంటారు...తమ్ముడు ఒక చిన్న మెడికల్ షాప్ ఓనర్...

                       ఇప్పుడు మన కధలోకి వచ్చేద్దాం,..నేనిప్పుడు వ్రాస్తున్నది ప్రపంచం అసూయపడే ఇద్దరు దంపతుల కధ..పేర్లు పార్వతి, సుబ్రహ్మణ్యం..వాళ్ళకి పెళ్లి అయ్యి 17 సంవత్సరాలయ్యింది..పదవ తరగతి చదువుతున్న 15 సంవత్సరాల పాప కూడా ఉంది...ఆమె పేరు ప్రేమ జ్యోతి..నేను ఏదో యండమూరి నవల లో చదివాను.......

      "స్త్రీకి ప్రేమ బాల్యంలో తండ్రి మీద ఎక్కువ ఉంటుంది..తర్వాత నెమ్మదిగా తల్లి మీదకి, యుక్త వయసులో మనసుకు నచ్చిన కొంతమంది అబ్బాయిల మీదికి, పెళ్లి తర్వాత భర్త మీదికి, పిల్లకు పుట్టాక వాళ్ళ మీదకి వెళ్లి అక్కడ స్థిరపడిపోతుంది..(10% మందికి మాత్రమే  పిల్లల మీద నుంచి వేరే మగాళ్ళ మీదికి వెళుతుంది)..."

      " అదే మగాడికి అయితే మొదట తల్లి మీద, తర్వాత కాస్త అందంగా కనపడే ప్రతీ అమ్మాయి మీద, తర్వాత మనసుని మెలి పెట్టిన ఎవరో ఒక అమ్మాయి మీద, తర్వాత భార్య మీద, తర్వాత పిల్లల మీదికి వెళ్లి అక్కడ స్థిరపడిపోతుంది..(90% అబ్బాయిలకి కాస్త పిల్లలు పెద్ద వాళ్ళయి, భార్య చర్మం కాస్త ముడతలు పడడం మొదలెట్టాక పరాయి ఆడ వాళ్ళ మీదికి మరులుతుంది..(ఇక్కడ ప్రేమ బదులు మీరు ఇంకేమన్నా వాడుకుంటే నాకేమి ఇబ్బంది లేదు)...

           కానీ ఇప్పటి మన కధలో దంపతులు పూర్తిగా అన్నిటికీ అతీతం....ఈ రోజుకీ ఉదయం సుబ్రహ్మణ్యం ఉద్యోగానికి వెళ్ళే ముందు పార్వతిని, ప్రేమ జ్యోతిని నుదుట ముద్దు పెట్టుకుని వెళతాడు..కాలం వారి అనురాగంలో ఏ మాత్రం మార్పు తీసుకు రాలేకపోయింది..కొత్తగా పెళ్ళయిన జంటలాగ, భర్త హీరో హోండా బైక్, వీధి మలుపు తిరిగే వరకు మెట్ల మీద నిలబడి చూస్తూ ఉంటుంది పార్వతి..మలుపు తిరిగే ఆఖరి క్షణంలో ఒక్కసారి తల తిప్పి చిన్న నవ్వు నవ్వి చెయ్యి ఊపి వెళతాడు సుబ్రహ్మణ్యం...

వాళ్ళని చూస్తే మంచి పాట  గుర్తొస్తుంది నాకు..

ఒకే వెలుతురిచ్చే రెండు పొద్దులు 
ఒకే చూపు చూసే రెండు కన్నులు 
ఒకే పాట పాడే రెండు పెదవులు 
అలకల అల్లాలు పలుకుల బెల్లాలు 
మొగుడు పెళ్ళాలు మొగుడు పెళ్ళాలు

ముచ్చెర్ల వారి వీధిలోని వారికి ఇదేం కొత్త కాదు...డైలీ రొటీన్..అసూయా పడే వాళ్ళు కొందరు..చూసి ఇలాగే ఉండాలి అనుకునే వాళ్ళు కొందరు...
               భర్త వెళిపోయాక పార్వతి, ప్రేమ జ్యోతిని తయారు చేసి స్కూల్ కి పంపి తలుపు వేసేసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎవరికీ కనబడదు.. సాయంత్రం  కూతురు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చే వరకు తలుపు తియ్యదు ఎంతో అవసరమైతే తప్ప..సుబ్రహ్మణ్యం రాత్రి 11 గంటలకు వస్తాడు...కూతురు పడుకున్నాక భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది...
                
                   ఈ రోజు కూడా అలాగే గడిచింది..ప్రేమజ్యోతి చదువుకుని నిద్రపోతుంది..9 గంటలకి, మొగలిరేకులు సీరియల్ ముగిసే సమయానికి, పార్వతి cellphone vibrate అయ్యింది.."నా ప్రాణం" అని సేవ్ చేసి ఉన్న నెంబర్ నుంచి కాల్ వచ్చింది..vibrate అవుతున్న మొబైల్ ని silent లో పెట్టి నెమ్మదిగా పక్క మీది నుంచి లేచింది.ప్రేమ జ్యోతి నిద్రపోతున్న విషయం మరొకసారి confirm చేసుకుని నెమ్మదిగా బయటికి నడిచింది..తలుపులు తెరిచి గడప దాటి, నెమ్మదిగా తలుపులు మళ్ళీ వేసింది.. 

అప్పుడు కళ్ళు తెరిచింది ప్రేమజ్యోతి...

చెప్పు సుబ్బు..
"ఏమిటి ఇంతసేపు phone lift చేయడానికి?
ఏమీ లేదు.బయటికొచ్చి lift చేసాను..
"ఆఫీసు లో పని అయిపోయింది"
ఇవేం ఉద్యోగాలో బాబు..పని లేకపోయినా 11 గంటల వరకు ఆఫీసు లో కూర్చోవాలి..
"ఏం చేస్తాం చెప్పు మరి ప్రైవేటు ఉద్యోగాలంతే..ఇంతకీ నా చిట్టి తల్లి ఏం చేస్తుంది?"
ఇప్పటి దాకా చదువుకుంది...నిద్రపోతుంది..
"దాన్ని డాక్టర్ గా చూడాలి. అదే నా కోరిక"
చూద్దుగానిలే ఇంకా చాలా సంవత్సరాలుందిగా
"ఇంకేంటి ఏం కూర వండావ్ ఈ రోజు?"
నీకు చాలా ఇష్టం..నాటు చిక్కుడుకాయల కూర, కొత్తిమీర పచ్చడి..
"చెప్పకే బాబు..ఆకలి పెరిగిపోతుంది"
ఆఫీసు లో ఎవరో కొత్తావిడ జాయిన్ అయ్యిందన్నావ్.....ఏం పేరబ్బా...ఆ..వాణి....ఏమంటుంది? పరిచయమయ్యిందా?
" ఒసేయ్ నీ అనుమానం తగలెయ్య...అసలామె మొహమే చూడలేదు ఇప్పటి వరకు సరిగ్గా.."
మొహమే అంటే..మొహం మాత్రమే చూడలేదన్న మాట
"బాబోయ్....జనాలందరూ మాకు పడి ఏడుస్తారు గాని ఆడవాళ్ళు డబల్ మీనింగ్ మొదలుపెడితే మేము బలాదూర్ అసలు..చెప్పడం మరిచిపోయాను.ఈ రోజు ఉదయం కట్టుకున్న చీర చాలా బాగుంది.."
ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా ఈ మాట చెబుతావని.
"మొన్న సంక్రాంతికి అమ్మవాళ్ల ఊరు వెళ్ళినప్పుడు మా వదిన పెట్టింది..ఇవాళే కట్టుకున్నాను..
"ఆఫీసు అయిపోయాక చిన్న మందు పార్టీ ఉంది వెళ్ళనా?"
చంపేస్తాను..ఎన్నిసార్లు చెప్పాను నీకు అసలు దాని గురించి ఆలోచించొద్దని...ఇంకోసారి తాగావని తెలిసిందంటే అసలు జీవితంలో దగ్గరికి రానివ్వను..
"అమ్మో వద్దు...గుక్కెడు విషం కోసం, అమృత సాగరాన్ని వదులుకునేంత మూర్ఖుణ్ణి  కాదు"
ఈ కబుర్లకేమి కరువు లేదు..
"ఏంటి కోపమే....?"
అవును..
"వద్దు..మళ్ళీ సత్యాగ్రహం మొదలుపెట్టకు....ఏదో సరదాగా అడిగాను..నువ్వు చెప్పాక ఇప్పటి వరకు మళ్ళీ మందు ముట్టుకోలేదు కదా..."
అయినా నా మీద ఈ మధ్య ప్రేమ తగ్గింది నీకు..
"ఎందుకలా అనిపించింది?"
ఇదివరకు వారానికి ఒకసారైనా నాకిష్టమైన కాజుస్వీట్ తెచ్చి ఇచ్చే వాడివి..ఇప్పటికి రెండు నెలలయ్యింది..
"నిజమే కదా....సారీ సారీ ఇప్పుడే ఆనందసాయి కి వెళ్లి తీసుకుంటాను.."
చూస్తా కదా...అది సరే గాని...... మన మొదటి కలయిక గుర్తుందా నీకు?
"పిచ్చి దానా భోజనానికి కూర్చున్నాక మనం అన్నం ఎంతైనా తింటాం...కాని కడుపు కాలిపోతున్నప్పుడు ఆ మంట చల్లార్చే మొదటి ముద్ద రుచి మరిచిపోలేనిది..."
నిజంగానే పిచ్చిదాన్ని...ఇలాంటి మాటలు చెప్పి నన్నింకా పిచ్చిదాన్ని చేసావ్..
 (అప్పటి వరకు అక్కడ అలుముకున్న నిశబ్దాన్ని చేధిస్తూ, వారిద్దరి telephonic romance  ని భగ్నం చేస్తూ దూరంగా బైక్ శబ్దం వినబడింది)

అది విని వెంటనే పార్వతి....హే సుబ్బారావ్..మా అయన వచ్చేస్తున్నాడు..రేపు మధ్యాహ్నం మాట్లాడుకుందాం...గుడ్ నైట్...ఉమ్మా....
ఫోన్ కట్ చేసి గబగబా లోపలికి వెళ్లి ఘడియ పెట్టుకుని cellphone, kitchen లో పెట్టేసి వెళ్లి కూతురు పక్కన పడుకుంది....ఈ హడావుడిలో ప్రేమజ్యోతి కళ్ళ వెంట కారుతున్న నీళ్ళు తను గమనించలేదు..

calling bell మోగింది..ఆవలిస్తున్న నోటి ముందు చిటికెలు వేస్తూ తలుపు తెరిచింది పార్వతి...నవ్వుతు లోపల అడుగు పెట్టాడు సుబ్రహ్మణ్యం..

ఏమిటోయ్ ఇందాక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు?
ఎప్పుడండి?
8.00 కి చేశాను కాస్త ఫ్రీ అయ్యి..
మార్నింగ్ మా అక్క కాల్ చేస్తే మాట్లాడి కిచెన్ లో పెట్టి మరిచిపోయానండి..మళ్లీ చూడలేదు...

డాడీ వచ్చి ముద్దు పెట్టుకుంటారని తెలిసి గబగబా కళ్ళ వెంట కారుతున్న నీళ్ళు  తుడిచేసుకుంది ప్రేమ జ్యోతి..

ఇంతలో అదే  వీధిలోకి మరో బైక్ వచ్చింది .... దాని మీద నుంచి సుబ్బారావు దిగి,  పార్వతి ఇంటివైపు చూసుకుంటూ ఎదురుగా ఉన్న తన ఇంట్లోకి వెళ్ళాడు, గుమ్మం దగ్గర నిలుచున్న భార్య మొహం మీద బాగ్ విసిరి కొట్టి..


దూరంగా తలారి మోహన్ గాడు తాగిన మత్తులో మైమరచి ,
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక,
ఏ దారెటుపోతుందో ఎవరినీ అడగక ...
అని పాడుకుంటూ వెళిపోయాడు...