Showing posts with label నాకు నచ్చని ప్రపంచం. Show all posts
Showing posts with label నాకు నచ్చని ప్రపంచం. Show all posts

Friday, 1 June 2012

ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజులు

హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న రాజేష్ ఆంధ్రా యూనివర్సిటిలో పని ఉండి వైజాగ్ వచ్చాడు. వైజాగ్ ఎప్పుడు వచ్చినా తన క్లోజ్ ఫ్రెండ్ మదన్ దగ్గర ఉండడం అలవాటు..పొద్దున్న యూనివర్సిటిలో పని చూసుకున్నారు ఇద్దరు కలిసి..రాత్రి ఎప్పటిలాగే నాలుగు బీర్లు కొనుక్కుని, మద్దిలపాలెం నుంచి సింహాచలం వెళ్ళడానికి కొత్తగా వేసిన రోడ్డులోకి వెళ్లారు..సాయంత్రం 10 తర్వాత ఆ రోడ్డు నిర్మానుష్యంగా అయిపోతుంది.మందు కొట్టడానికి మంచి spot..అప్పుడప్పుడు ఎవడైనా constable patrolling కి వస్తే ఒక వంద చేతిలో పెడితే సరిపోతుంది..అటు ఇటు కొండలు, మధ్యలో నల్లతాచు లాగా తారు రోడ్డు..చూడడానికి చాలా బావుంటుంది..రోడ్డు పక్క pavement మీద కూర్చుని చల్లటిగాలిలో chilled beer తాగుతుంటే భలే ఉంటుంది..ఇద్దరు మాటలు చెప్పుకుంటూ నాలుగు బీర్లు పూర్తి చేసేసరికి 12 అయ్యింది..room కెళ్ళి alpha hotel నుంచి తెచ్చుకున్న
dum biryani పార్సిల్ తినేసి పడుకున్నారు..
                   మధ్య రాత్రిలో మదన్ లేచి రాజేష్ మొబైల్ తీసుకున్నాడు..contacts ఓపెన్ చేసి మొత్తం list అంతా జల్లెడ పట్టి మూడు numbers save చేసుకున్నాడు..రాధ,ప్రవల్లిక,సంగీత..తరువాత మళ్ళి మొబైల్ తీసిన చోట పెట్టేసి పడుకున్నాడు..
next రోజు రాజేష్ తిరిగి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయాడు..

DAY-1

రాజేష్ వెళ్ళిపోయిన తర్వాత మదన్ మొబైల్ తీసి sms balance చెక్ చేసుకున్నాడు..ఇంకా 7500 msgs ఉన్నాయ్..'Hi' అని msg type చేసి రాత్రి save చేసుకున్న మూడు numbers కి పంపాడు..రాధ నెంబర్ కి msg deliver కాలేదు..ప్రవల్లిక number కి msg deliver అయ్యింది కానీ reply రాలేదు..ఒక 10 minutes అయిన తర్వాత సంగీత number నుంచి who is this?? అని reply వచ్చింది..
మదన్: అదేంటి కొత్తగా??
సంగీత : what?
మదన్: who is this అంటావేంటి? నా number delete చేసేసావా?
సంగీత: సారీ...నాకు మీరెవరో గుర్తు రావడం లేదు..
మదన్ : నేను రా మదన్, వైజాగ్ నుంచి..
సంగీత: సారీ మీరెవరనుకుని ఎవరికి msg చేస్తున్నారో...my name is సంగీత..
మదన్: రేయ్..కామెడి చెయ్యకు..సరేగాని నేను ఆఫీసు లో ఉన్నా..రేపు chat చేద్దాం bye...
సంగీత వెంటనే మదన్ నెంబర్ కి కాల్ చేసింది...అది switch off అని వచ్చింది..

DAY-2

మదన్: Good morning
సంగీత : Hello I am not your friend ok..dont msg me again..
             మదన్ సంగీత number కి call చేసాడు..
“హలో”
ఓ I am sorry అండి మా ఫ్రెండ్ నెంబర్ అనుకున్నా..
“ Its ok"
నిజంగా సారీ అండి.but number ఎలా change అయ్యిందో అర్ధం కావట్లేదు..any way trouble ఇచ్చాను..సారీ.
“పర్వాలేదు bye..”

DAY-3

మదన్: రాత్రంతా తను లేడనే విరహ వేదనతో కుమిలిపోతున్న పుడమిని సూర్యుడు తన వేల కిరణాల చేతులతో ఆత్రంగా హత్తుకుంటాడు..ఆ కౌగిలికి పులకించిపోయిన పుడమి చెక్కిళ్ళ వెంట జారిన ఆనంద భాష్పాలు పైరు అంచుల మీది నీటి బిందువులై ప్రకృతికి అందాన్ని తెస్తాయి..గుడ్ మార్నింగ్..
ఒక అరగంట తర్వాత...
మదన్: అయ్యో సారీ అండి..మీ number message groups లో నుంచి delete చేయలేదు..అందుకే ఇందాక పంపిన msg మీకు కూడా వచ్చేసింది...
సంగీత: అది ఎవరు రాసారు?
మదన్: ఏది?
సంగీత: ఇందాక మీరు పంపిన కవిత్వం..
మదన్: ఎవరో పంపిన msgs forward చెయ్యడం నాకిష్టముండదు..నేనే రాసాను..
సంగీత: చాలా బాగా రాసారు..
మదన్: Thank you..
సంగీత: మొన్న msg చేసినప్పుడు డ్యూటీ లో ఉన్నా అన్నారు కదా ...ఏం జాబ్ చేస్తారు మీరు...
మదన్: HSBC లో జాబ్ చేస్తున్నా..మీరేం చేస్తున్నారు..?
సంగీత: ఇంజనీరింగ్ 3rd year...హైదరాబాద్ ప్రియాంక కాలేజ్
మదన్: మీ పేరు చాలా బాగుంది..నాకు చిన్నప్పట్నుంచి music అంటే ప్రాణం..కానీ పరిస్థితులు అనుకూలించక శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేకపోయాను..
సంగీత: మీరు తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు..
మదన్: నేను టెన్త్ క్లాసు వరకు తెలుగు మీడియం లో చదువుకున్నా..ఎందుకో చిన్నప్పట్నుంచి తెలుగు అంటే చాలా ఇష్టం..
సంగీత: any way...నాకు కొంచెం పని ఉంది. Catch you later bye....
మదన్: Ok bye....
evining 8 దాటిన తర్వాత....
మదన్: still busy?
సంగీత: మూవీ చూస్తున్నా...
మదన్: ఏం మూవీ?
సంగీత: “అతడు”..నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం ఇప్పటికి ఈ మూవీ 10 టైమ్స్ చూసాను..
మదన్: ya its a good movie...సరే.. 10 టైమ్స్ చూసాను అంటున్నారు కాబట్టి నేనొక question అడుగుతా...
అందులో పిల్లగాలి అల్లరి సాంగ్ ఉంది కదా...ఆ పాట అర్ధం చెప్పుకోండి చూద్దాం...అందులో కాస్త సైన్స్ కూడా ఉంది...
సంగీత: ఏదో పాటలు వినేస్తాం గాని వాటి meanings గురించి పట్టించుకోం కదా...
మదన్: ఆలోచించండి..ఒకవేళ మీరు చెప్పలేకపోతే రేపు నేనే చెప్తాను...

DAY-4

సంగీత: గుడ్ మార్నింగ్...
మదన్: గుడ్ మార్నింగ్..ఏంటి అర్ధం తెలిసిందా?
సంగీత: Hmmm... నేనొకటనుకున్నాను...కానీ అది అంత కరెక్ట్ అని నాకనిపించడం లేదు..మీరే చెప్పండి...
మదన్: మూవీ లో త్రిష , మహేష్ బాబు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చాలా అల్లరి చేస్తుంది..కొంచెం ఫొజ్ కొడుతుంది...చూస్తాడు చూస్తాడు..ఇంక ఏదొక విధంగా బుద్ది చెప్పాలనుకుంటాడు..అందుకే అందంగా లేవంటాడు..మీకు వర్షం కురిసే procedure తెలుసుగా..నీరు ఆవిరైపోయి ఆకాశం లోకి వెళ్లి కారు మేఘంగా మారుతుంది..కారు మబ్బు ఎప్పుడు కరకు తనానికి symbol...ఆ మబ్బుని చల్ల గాలి తాకినప్పుడు వర్షం కురుస్తుంది...సిరివెన్నెల గారు మహానుభావుడు..మహేష్ బాబు కారుమబ్బు..త్రిష అల్లరి చేసే పిల్ల గాలి..
ఇప్పుడు చూడండి లిరిక్స్...పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమబ్బు ఉరిమేనా...కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా..ఎల్లలన్ని కరిగి ఝల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ..అందమైన సిరి వాన...శ్రియ ఘోషల్ అద్భుతంగా పాడింది...
సంగీత:oh my god.. ఇంత meaning ఉందా? మీరు నిజంగా సూపర్ అసలు..
మదన్: thank you so much..అది సరే గాని మనం ఈ అండి, మీరు అని బహువచనం మానేద్దాం...కాస్త ఇబ్బందిగా ఉంది..
సంగీత: అలాగే ఇంకేంటి చెప్పు...
మదన్: ఇంకేముంది..present ఉన్న హీరోస్ లో నాకు కూడా మహేష్ బాబు అంటే ఇష్టం...నిజంగానే “పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడు..”
సంగీత: ఇంకెవరిష్టం నీకు?
మదన్: కమల హాసన్...
సంగీత: మరి హీరోయిన్?
మదన్: ఎప్పుడూ శ్రీదేవి..
సంగీత: అబ్బో ఎందుకో?
మదన్: ఆమె అందం ఆకాశం, కొలమానం లేదు..ఆమె అభినయం అంబుధి,అందులో అనుమానమే లేదు...
అలా చాటింగ్ చాలా సేపు సాగింది..చాట్ చేస్తూనే ఇద్దరు brush చేసారు, స్నానం చేసారు..నడుస్తున్నా, పడుకున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా బొటనవేలు మాత్రం mobile keys నొక్కుతూనే ఉంది...అర్ధరాత్రి పన్నెండు దాటింది..
..................
సంగీత: ఓయ్...నిద్ర రావడం లేదా?
మదన్: లేదు..అసలు మాములుగా అయితే నేను చాలా త్వరగా పడుకుంటాను..కానీ నీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియడం లేదు..
సంగీత: నేను కూడా ఏ అబ్బాయితోను ఇంతసేపు మాట్లాడలేదు.
మదన్: చాలా వింతగా ఉంది కదా మన పరిచయం..
సంగీత: అవును నాకూ అదే అర్ధం కావడం లేదు..
మదన్: సరే నేను పడుకుంటాను...గుడ్ నైట్..
సంగీత: ummm....
మదన్: ఓయ్ ఏంటి sudden గా ముద్దు పెట్టేసావ్?
సంగీత:నేనా!!! ఎక్కడ పెట్టాను? ఓకే అన్నాను..
మదన్: అయ్యో...నిజమా...ఓకే అంటే Hmm అనాలి..Ummm అంటే ముద్దు అని అర్ధం..పక్కన ఎన్ని ‘m’లు పెడితే అంత పెద్ద ముద్దు అని అర్ధం..
సంగీత: అబ్బో అబ్బాయిగారికి బాగానే ప్రవేశం ఉన్నట్టుందే చుంబన శాస్త్రం లో..
మదన్: just theory వరకే...practicals చేసే భాగ్యం ఇంకా దక్కలేదు..
సంగీత: నేను నమ్మను..
మదన్: నమ్మకపోతే మానెయ్...కానీ కోరిక ఉంది...ఇదిగో చూడు ఓ పక్క చల్లగా గాలేస్తుంది..ఆకాశంలో నక్షత్రాలు నలుపు రంగు చీర మీద అద్దిన మల్లె పువ్వుల్లా  ఉన్నాయ్...రెండు పక్షులు ప్రపంచాన్ని మరిచిపోయి ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయ్..వయసులో ఉన్న ఏ మగాడికైనా ఇప్పుడేమి కావాలనిపిస్తుంది వెచ్చని ముద్దు తప్ప...
సంగీత: ummmmmmm
మదన్: మళ్ళి ఓకే నా ?
సంగీత: ఇందాక చెప్పావుగా ఇలా పంపితే ఓకే కాదు అని...గుడ్ నైట్..

DAY-5

మదన్: రాత్రంతా నీ చిత్రాన్ని మదిలో గీసుకున్నాను..దానికి ఊపిరి పోస్తే ఒక సుందర రూపం..ఇద్దరం కలిసి వెన్నెల మైదానంలోకి ఎగురుకుంటూ వెళ్ళాం..ఆ వెన్నెల మైదానంలో నీ పెదవుల వెంట కురిసిన అమృత ధార నా పెదవుల్ని తాకింది..నాలో కొత్త ఊపిరి నింపింది..నా మనసు పునర్జన్మ పొందింది..
సంగీత: కవిత్వం బావుంది..
మదన్: రాత్రి నువ్విచ్చిన ముద్దు మరీ బావుంది..
సంగీత: అబ్బ నిజంగానా..
మదన్: అవును..మాములు msgs వచ్చినప్పటికంటే నీ ముద్దు msg వచ్చినప్పుడు నా మొబైల్ డబల్ vibrate అయ్యింది..
సంగీత: సరేగాని ఈ రోజు నేను మా relatives ఇంటికి వెళ్తున్నా నేను చెప్పేవరకు  msg చెయ్యొద్దు..
మదన్: ok..but dont forget that a poor fellow is waiting for your message..

నిజానికి ఈ రోజు మదన్ కి కూడా కుదరదు..ఎందుకంటే ఒక లోకల్ అమ్మాయికి appointment ఇచ్చాడు..ఆ అమ్మాయి కాసేపటికి వచ్చింది...ఆమెతో ఉదయం చుంబన సేవనం, మధ్యాహ్నం కౌగిలి భోజనం, సాయంత్రం వేళల మహా నైవేద్యం కానిచ్చి పంపేసాడు..తర్వాత రాజేష్ కి కాల్ చేసాడు..
“హలో”
నేను రా మదన్ ని
“చెప్పరా”
ఏంటి బాగా distrubence గా ఉంది...??
“theatre లో ఉన్నా..”
girlfriend తోనా..నియ్యబ్బ నాకు చెప్పట్లేదు కదా అమ్మాయెవరో.... చెప్తా నీ పని..ఎన్ని రోజులు దాస్తావో చూస్తా..
“ఈసారి నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు పరిచయం చేస్తా లేరా ఇంతకీ విషయం చెప్పు”
ఏం లేదు వస్తే ఒక 4,5 డేస్ లో హైదరాబాద్ వస్తా..
“సరే”
...............................

Evening 7 తర్వాత సంగీత msg చేసింది..
సంగీత: ఓయ్ ఏం చేస్తున్నావ్?
మదన్: నాతో మాట్లాడకు..
సంగీత: ఏరా కన్నా ఏమైంది?
మదన్: నేను పొద్దున్నుంచి నీ msg కోసం పిచ్చివాడిలా వెయిట్ చేస్తుంటే ఇప్పుడు తీరిగ్గా ఏం చేస్తున్నావ్ అనడుగుతావా?
సంగీత: సారీరా బంగారం మా relatives ఇంట్లో late..సరే నీ కోపం తగ్గాలంటే ఏం కావాలి చెప్పు..
మదన్: నాకేం వద్దు
సంగీత: ummmmm
మదన్: నాకీ sms ముద్దులేమి అక్కర్లేదు..
సంగీత: మరి కాల్ ముద్దు కావాలా సరే..ఇప్పుడు అందరు నా పక్కనే ఉన్నారు...అందరు పడుకున్నాక ఇస్తా..జస్ట్ వెయిట్ ఫ్రెష్ అప్ అయి వస్తా..
మదన్: ఓకే
రాత్రి 12 దాటే వరకు చాట్ చేసుకుని పడుకునే ముందు కాల్  చేసింది సంగీత..ఫోన్ లో ముద్దిచ్చింది..అప్పటికే మదన్ మొబైల్ loud speaker ఆన్ చేసి ఉంది..సంగీత ముద్దు చప్పుడు మదన్ తో పాటు మరో నలుగురు మగాళ్ళను తాకింది...

DAY-6

సంగీత: గుడ్ మార్నింగ్(8.30)
సంగీత: గుడ్ మార్నింగ్(9.30)
సంగీత: గుడ్ మార్నింగ్{10:30)
మదన్: గుడ్ మార్నింగ్..
సంగీత: ఏమైంది ఇంత వరకు..
మదన్: రాత్రి నువ్విచ్చిన ముద్దుకి మూర్చపోయాను..ఇదిగో మళ్ళి ఇప్పుడే లేవడం..
సంగీత: నాకు మాత్రం రాత్రి సరిగా నిద్ర పట్టలేదు..
మదన్: ఎందుకు?
సంగీత: నేను కూడా నీ ఊహా చిత్రాన్ని గీసుకుని అలా వెన్నెల మైదానంలోకి వెళ్ళానులే..
మదన్: కేక..
సంగీత: నిన్ను చూడాలని ఉంది మదన్ నాకు..నీ ఫోటో MAIL చెయ్యవా..
మదన్: వద్దు..నువ్వెలా ఉంటావో నాకు తెలియదు...నేనెలా ఉంటానో నీకు తెలియదు..ఈ SUSPENSE ఇలా ఉండనిద్దాం..నేనే హైదరాబాద్ వస్తాను..అక్కడ కలుసుకుందాం..
రోజంతా అలాగే మాట్లాడుకుని తెల్లవారు జాము 3 కి పడుకున్నారు..మాటల మైకంలో సంగీత మదన్ HSBC లో JOB చేస్తున్నాను అని చెప్పిన విషయం మరిచిపోయింది..లేకపోతే కనీసం ఒక్క సారైనా డ్యూటీ కి వెళ్ళలేదా అనడిగేది..

DAY-7

రోజంతా మదన్ ఒక్క msg కూడ పంపలేదు...కావాలనే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసాడు..సంగీత మాత్రం continous గా msgs పెడుతూనే ఉంది.msg sending failed..call చేస్తే స్విచ్ ఆఫ్...call చేసి చేసి రాత్రి ఎప్పుడో తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది..

DAY-8

మదన్: గుడ్ మార్నింగ్..
వెంటనే CALL చేసింది సంగీత...
“హలో”
స్టుపిడ్, ఇడియట్ ఏమైపోయావ్ నిన్నంతా ఎన్ని సార్లు call చేసానో తెలుసా..అంటూ బోరున ఏడ్చేసింది..
“సారీ రా నా మొబైల్ వాటర్ లో పడిపోయింది..నా ఫ్రెండ్ మొబైల్ తీసుకుని అందులో sim వేసి చేస్తున్నాను..
ఒక రెండు నిముషాలు అలా ఏడుస్తూనే ఉంది..తరువాత కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసింది.సరిగ్గా ఇదే reaction expect చేసిన మదన్ ఎగిరి గంతేసాడు..


DAY-9

మదన్: గుడ్ మార్నింగ్
సంగీత: గుడ్ మార్నింగ్..
మదన్: ఇప్పుడు నేను నీకొక surprise ఇవ్వబోతున్నా..
సంగీత: ఏంటది?
మదన్: ఈ రోజు నైట్ నేను బయలుదేరి హైదరాబాద్ వస్తున్నా..
సంగీత: అదేంటి సడన్ గా..
మదన్: ఏమో రాత్రంతా నిద్ర పట్టలేదు...నిన్ను చూడాలనిపిస్తోంది..టికెట్స్ కూడా దొరికాయ్..
సంగీత: అలా సడన్ గా చెప్తే ఎలా?
మదన్: ఏం రావద్దా...వద్దంటే చెప్పు..ఇంకెప్పుడు మాట్లాడను..
సంగీత: అలా కాదు..... సరేలే.. రా..
మదన్: అది సరే గాని వస్తే నాకేమిస్తావ్?
సంగీత: ఏం కావాలేంటి?
మదన్: నేను అది,ఇది అని చెప్పను గాని అది ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవ్వరు ఇవ్వలేనిది అయి  ఉండాలి..

సంగీతతో చాటింగ్ అయిపోయాక రాజేష్ కి కాల్ చేసాడు..

మామా ఈ రోజు నేను బయలుదేరి హైదరాబాద్ వస్తున్నా..
“ఏంటి ఇంత  sudden గా ?”
ఒకమ్మాయిని పడగొట్టా మామా..రేపు కాసేపు నీ రూం కూడా వాడుకుంటా..
“రేయ్ నా రూం కుదరదురా...అందరు ఉంటారు..వేరే ఫ్రెండ్ రూం ఉంది అక్కడయితే owner గొడవ ఉండదు..full safe”
Ok thank you...

“ మాకేం ఛాన్స్ ఉండదా?”
అది ఆ టైపు కాదురా...కానీ ఒక plan చేద్దాం..నువ్వు రూం బయటే ఉండు..గొళ్ళెం వెయ్యను..నా పని అయిపోయిన తర్వాత mis cal ఇస్తా... తలుపు తోసుకుని మొబైల్ లో షూట్ చేస్తున్నట్టు act చేస్తూ లోపలికి రా..తర్వాత అదే ఒప్పుకుంటుంది...
“కేక మామా నువ్వు”

DAY-10

మార్నింగ్ పది గంటలకి అమీర్ పెట్ బిగ్ బజార్ దగ్గర మదన్ వెయిట్ చేస్తున్నాడు..ఇంతలో ఆటోలో సంగీత దిగింది..ఒకసారి ఇద్దరు ఒకరినొకరు తేరిపార చూసుకున్నారు..చిన్న నవ్వు నవ్వుకున్నారు..
ఏం చేద్దాం అంది సంగీత...
నేను సాయంత్రం మళ్ళి వైజాగ్ వెళ్ళిపోతాను..నీతో ఉండే ఈ కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకునేట్టు ఉండాలి...మూవీకి వద్దు..పార్క్స్ లో అయితే నేను comfortable గా ఫీల్ అవ్వను..సో నేనే ఒక చోటికి తీసుకెళతాను అన్నాడు..
ఓకే అంది..
ఇద్దరు కలిసి రాజేష్ చెప్పిన ఇంటికి వెళ్లారు..ఉండేది bachelors అయినా రూం చాలా అందంగా ఉంది..ఇద్దరు మంచం మీద కూర్చున్నారు..కాసేపు ఏవో అసందర్బ వాక్యాలు మాట్లాడుకున్నారు..తరువాత కాసేపు నిశ్శబ్దం...తర్వాత మదన్ చెయ్యి అలవాటు ప్రకారం తన పని తాను చేసుకోవడం మొదలెట్టింది..సంగీత లోని సహజమైన స్త్రీ స్వభావం తన శరీరం మీద మదన్ చెయ్యి పడిన ప్రతి చోటు నుండి రెండు సార్లు నెట్టేస్తుంది..మూడోసారి ఏమనడం లేదు...ఒక అరగంట తర్వాత ఒకరి కౌగిలిలో ఒకరున్నారు..నిట్టూర్పులు విడిచిన శబ్దం తప్పా ఏమీ వినబడడం లేదు...మధ్యలో ఒకసారి మాత్రం సంగీత “problem అవుతుంది వద్దు” అంది..”no problem I have protection” అన్నాడు మదన్...తర్వాత ఒక పది నిమిషాలకి ఇద్దరి మధ్య జరిగిన హొరాహొరీ పోరులో ఇద్దరూ ఓడిపోయారు..సంగీత పక్కనే పడి ఉన్న బ్లాంకెట్ తీసుకుని సగం శరీరాన్ని కప్పుకుంది...
ప్లాన్ ప్రకారం మదన్ మొబైల్ తీసి రాజేష్ కి mis cal ఇచ్చి..bath room కి వెళిపోయాడు..

సరిగ్గా ఒక్క నిమిషం తర్వాత తలుపులు తోసుకుని రాజేష్ మొబైల్ లో షూట్ చేస్తున్నట్టు నటిస్తూ లోపలికొచ్చాడు..మంచం మీద నగ్నంగా ఉన్న అమ్మాయిని చూసేసరికి చేతిలో మొబైల్ జారిపోయింది...ఒక్క క్షణం శరీరంలో నెత్తురు ప్రవాహం స్తంభించిపోయింది..
సంగీత కళ్ళు ఆర్పడం లేదు...అసలు ఆమె మోహంలో ఎటువంటి ఫీలింగ్స్ లేవు..కదలకుండా అలా శిలా ప్రతిమలా ఉండిపోయింది..కళ్ళ వెంట నీళ్ళు మాత్రం వస్తున్నాయ్..సిగ్గుతోనో, భయంతోనో,అపరాధ భావం తోనో ఏమో మరి...
మంచం మీద తను మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్న సంగీత...ఎవరో అనుకుని తన కోరిక తీర్చుకోడానికొచ్చాడు రాజేష్..
ఆ రోజు మదన్ ఫోన్ చేసినప్పుడు రాజేష్ మూవీ చూస్తుంది సంగీతతోనే...సంగీత relatives అని చెప్పి కలవాడానికి వెళ్ళింది రాజేష్ నే..

MY DEAR FRIEND.....ఆ తర్వాత ఆ గదిలో ఏం జరిగిందో నాకు తెలీదు...

Monday, 7 May 2012

పెద్దలు కుదిర్చిన పెళ్లి

నాకు నచ్చిన అమ్మాయి దొరకకపోవడం వల్లనో, నేను ఏ అమ్మాయికీ నచ్చకపోవడం వల్లనో భయమో, ఏమో.. కారణమేమైనా నేనెవ్వరినీ ప్రేమించలేదు... చాలా రోజుల పాటు పెళ్ళి  కూడా చేసుకోలేదు.
  
అమ్మ పోరు పడలేక చివరికి ఒక అమ్మాయిని చూడడానికొప్పుకున్నాను.. మా కారు అమ్మాయి ఇంటి ముందు ఆగగానే హడావుడి మొదలయ్యింది.. ముందు అమ్మ, నాన్న... వెనక అక్క, నేను తల ఎత్తి నడవడానికి ఇబ్బందే, దించి నడవడానికి ఇబ్బందే.. అక్కడున్నవాళ్ళంతా నన్ను చూడడానికే ఎదురు చూస్తున్నారన్న విషయం గుర్తోచ్చినప్పుడు ఆ ఇబ్బంది ఇంకొంచెం పెరిగింది.. ఇలా ఈ ఇంటికి పెళ్లి చూపులకొచ్చిన ఎన్నో పెళ్లి కొడుకునో నేను అన్న అనుమనమూ వచ్చింది.. కాసేపాగాక అడుగులో అడుగేసుకుంటూ లోపలనుంచి వచ్చింది అమ్మాయి.. ఆమె వస్తున్నవైపు అలికిడి తెలిసి కళ్ళు అటు తిరిగాయి.. తెల్లని పాదాలు...వాటిని అందంగా అలంకరించిన గోరింటాకు.. చప్పున తలెత్తి చూసేద్దామనిపించింది...మళ్ళీ ఎందుకో ఆగిపోయాను... రెండు నిముషాలు అంతా నిశ్శబ్దం...ఇంతలో అక్క మెల్లగా తట్టింది పిల్లని చూడమన్నట్టు.. అప్పుడు తల పైకెత్తి చూసాను మెల్లగా....  

ఆమె కురులు అమావాస్యనాటి అర్ధరాత్రి, అంబుధి మీద అలుముకున్న కారుచీకటి, ఆమె కను రెప్పలు హోరు గాలికి కొట్టుకుంటున్న కిటికీ రెక్కలు ఆమె ముక్కు సంపెంగ... అబ్బా ఇంకా ఏమని చెప్పను...ఆమె కుందనపు బొమ్మ మారు మాట్లాడకుండా నచ్చిందని తలూపాను..

 తరువాతన్నీ ఆఘమేఘాల మీద జరిగిపోయాయి.. సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసెయ్యాలని అందరూ నిశ్చయించుకున్నారు.. అనుకున్న రీతిలోనే ఆ నెల రోజుల తర్వాత నిశ్చితార్ధం జరిగిపోయింది.. అందరబ్బాయిల్లాగే నేను కూడా అమ్మాయికి సొల్లు ఫోను కొనిచ్చాను... ఎంగేజ్మెంట్ అయిన రెండు రోజుల తర్వాత తడబడుతూ నూటొక్క సార్లు డయల్ చేసి కట్ చేశాను.... తర్వాత ధైర్యం తెచుకుని కాల్ చేసాను... ఎంత తియ్యగా ఉందో ఆ గొంతు... ఇక్కడ మళ్ళీ సమస్య నేను పేరు పెట్టి పిలవాలా, అండి అని పిలవాలా అని... చివరికి ఏవండీ అని మొదలెట్టాను... మొదటి రోజు రెండు మూడు నిమిషాలకన్నా ఎక్కువ మాట్లాడలేదు.. రెండవ రోజు కొంచెం సమయం పెరిగింది... మూడవ రోజు కాస్త చనువు పెరిగింది... నాలుగువ రోజు ఆమె "నన్ను ఏవండి అనొద్దండి పేరు పెట్టి పిలవండి" అంది.. అర్ధరాత్రి అకస్మాత్తుగా ఒకరోజు మెలకువొచ్చింది... ఒకటే ఆలోచనలు... 23 సంవత్సరాలుగా నా ముక్కు, మొహం తెలియని అమ్మాయి మూడు నిమిషాలు నా ముందు కూర్చుని ఏం అర్ధం చేసుకుందో నన్ను, అసలు నేనేం అర్ధం చేసుకున్నాను... నా దగ్గర మాట్లాడుతున్న ఈ పంచదార పలుకులన్నీ నిజమేనా? నిజమే అయితే సహజమా? కృత్రిమమా? ఇన్నేళ్లుగా లేని ప్రేమ అకస్మాత్తుగా ఇప్పుడు ఏం జరిగిందని పుడుతుంది... అంటే ఈ ప్రేమని బలవంతంగా తెచ్చి పెట్టుకుంటున్నామా... ఇలాంటి అలొచనలన్నీ దోలిచేస్తున్నాయి... ఇంతలో గుర్తొచ్చాయి మళ్ళీ ఆమె కనురెప్పల రెపరెపలు... అలొచలన్నీ మారిపోయాయి... పెళ్ళైపోయింది...  

మొదటి రాత్రి పాలు తీసుకుని వచ్చింది నా భార్య.. నా అర్ధాంగి, నా సతీమణి, నా సఖి, నా ప్రియురాలు..నా ఎదురుగా నిలుచుంది.. ఒక అనిర్వచనీయమైన అనుభూతి..జీవితంలో ఒకసారి మాత్రమే కలిగే అనుభూతి.. వయసొచ్చిన దగ్గరనుంచి మొదటిరాత్రి గురించి కన్న కలలు... ఎన్ని రకాల కలలు.. ఈ చిన్ని రాత్రి సరిపోతుందా... పక్కన కుర్చోమన్నాను... నీకోసం నేనొక పాట పాడతాను అన్నాను... మరది సిగ్గో, ఆశ్చర్యమో అర్ధం కాలేదు గాని పాడండి అంది... నేను "వయ్యారి గోదారమ్మ" పాట పాడదామనుకొని ఆగి నువ్వు చెప్పు నీకేం పాట కావాలో అన్నాను... ఒక 5 నిముషాలు తీవ్రంగా అలోచించి.... స్టాలిన్ సినిమాలో పరారే పరారే పాట పాడండి అంది... అరగంట కష్టపడి రాజేసిన మంట మీద ఎవరో బిందెడు నీళ్ళు కుమ్మరించినట్టయ్యింది.... ఇంక పాటల గురించి మాట్లాడడం అనవసరం అని నాకర్ధమయిపోయింది... నీకు శ్రీశ్రీ తెలుసా అని అడిగాను... మొన్న TV9 లో చెప్తే విన్నాను అంది... చలం గారు తెలుసా అన్నాను.. పాత సినిమా ఆక్టర్ కదా అంది... యండమూరి తెలుసా అన్నాను..... అంతర్ముఖంలో వస్తాడు ఆయనే కదా ఒకసారి చూసాను అంది.. సినిమాలు చూస్తావా అని అడిగాను... చూస్తాను అంది.. నీకిష్టమైన 4 సినిమాలు చెప్పు అన్నాను... ఈమధ్యవి అయితే...స్టాలిన్, బాస్, ఆట...ఇంకేదో చెప్పబోతుంటే చాలు అన్నాను... ఇష్టమైన హీరో ఎవరు అంటే ఉదయకిరణ్ అంది... నాకింక ఏమీ మిగలలేదు.. ఆమె మనస్తత్వం పూర్తిగా అర్ధమైపోయింది.... వెయ్యి పిడుగులు ఒకసారే తల మీద పడ్డట్టయ్యింది... నా మొహం కళ తప్పి కాస్త కోపంగా మారే సరికి నా వంక భయంగా చూసింది... మళ్ళీ అవే కనురెప్పల రెపరెపలు...కోపమంతా పోయింది.... మా అనుమతితో దీపం ఆరిపోయింది..  

సంవత్సరం గడిచిపోయింది... ఒకనాడు నా ఫ్రెండ్ ఫోన్ చేస్తీ నా బాధ అంతా కక్కుక్కున్నాను... ఎన్ని కలలు కన్నానురా జీవిత భాగస్వామి గురించి..... రోజుకొక కవితతో నిద్ర లేపుదామనుకున్నాను... తనని ఎంకి అని పిలిచి నన్ను నాయుడు బావా అని పిలిపించుకుందామనుకున్నాను... ఇళయరాజా బాణీకి నా గొంతుతో తన గొంతు కలపాలనుకున్నాను... బాలు పాట, శ్రీశ్రీ మాట అన్నీ తనతో పంచుకుందామనుకున్నాను... అర్ధరాత్రి గోదారి ఇసక తిన్నెల మీద వెల్లికిలా పడుకుని తననొకసారి, చందమామనొకసారి చూసి కవ్విద్దామనుకున్నాను... ఎదురెదురుగా కూర్చుని అల్లసాని పద్యాలతో ఆడుకుందామనుకున్నాను... పాప్ పాటలకి స్టెప్పులేయిద్దామనుకున్నాను... ఏదీ నెరవేరలేదు...ఏమీ మిగలలేదు... ఆమె మాత్రం మనం డిగ్రీలో ఉండగా మొదలయిన మొగలిరేకులు సీరియల్ ఇంకా చూస్తుంది... నరకమయిపోయిందిరా జీవితం..

  ఒకసారి ఆఫీస్ అయిపోయాక ఇంటికెళ్ళాను... వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది నా భార్య.. ఏమిటోనమ్మ ఈయన నాకర్ధం కాడు... ఎంతసేపూ ఏవో పిచ్చి పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు... పాత పాటలు వింటాడు... అదేదో ప్రియమణిది తమిళం సినిమా.. ఆ...... పరుత్తివీరన్ అంట, ఇప్పటికి దాన్ని ఒక 30 సార్లు చూసాడు.. కష్టపడి వంట చేస్తే కనీసం బాగుంది అని కూడా అనడు... చేపల కూర వండితే చారుతో తిని లేచిపోతాడు.. ఏదో లోకంలో ఉంటాడు... ఏం కావాలన్నా కొంటాడు...కానీ నాతో అస్సలు మాట్లాడడు... ఎంతసేపూ ఏవో రాసుకుంటూ ఉంటాడు... అసలు సరైన బట్టలు వేసుకోడు... ఏదైనా చెప్తే సగమే వింటాడు... చచ్చిపోతున్నానమ్మా...నరకమయిపోయింది జీవితం....

బాపూజీకొక లేఖ

బాపూజీకి ఒక భారత పౌరుడు రాయునది....


భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రీమించుటలేదు, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద చూసి నేను గర్వపడుట లేదు....................................................................................................


బాపూ....

భారతిని తెల్లదొరలు చెరబట్టి 250 సంవత్సరాలు కసితీరా అనుభవించాక అహింస పేరు చెప్పి వాళ్ళని బాబు బాబు అని బ్రతిమాలి వారి చేతినుంచి విడిపించి మువ్వన్నెల పైట కప్పి మాకప్పగించావ్...

నువ్వు వాళ్ళకే వదిలేస్తీ కనీసం ఆమె పాతివ్రత్యమైనా మిగిలేదేమో...మమ్మల్ని నమ్మి మా చేతిలో పెట్టి పోయావ్...మా వాళ్ళు నువ్వు నీ స్వంత చేతులతో నేసి ఇచ్చిన "అహింస" అనే తెల్ల దుప్పటి కింద చేస్తున్న దారుణాలు అన్నీ, ఇన్నీ కావు...నువ్వు అప్పగించింది మొదలు ఈ రోజు వరకూ భారతికి అనుక్షణం మానభంగం జరుగుతూనే వుంది...

ఎప్పటినుంచో రాద్దామనుకున్నాను నీకు ఈ లేఖ...సరైన సమయం రాలేదు..ఈరోజు ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం కదా...అందుకే రాస్తున్నాను...మన తెలుగు నిఘంటువుల ప్రకారం హింసకు పాల్పడే, నరబలిని కోరుకునే, మతం మత్తులో పసిపాపను సైతం మసి చీసీ వాళ్లకి మనం పెట్టుకున్న పేర్లు "ఉగ్రవాది","తీవ్రవాది","హింసావాది","ఉన్మాది"....ఇంకా ఏవో....వీటన్నిటికీ వ్యతిరేక పదం "అహింసావాది" అంటున్నారు...మరి వీళ్లందర్నీ ప్రేరేపించే వ్యక్తి రాజ్యసభలో నీ చిత్రపటం ముందు కూర్చుని నేను అహింసావాదిని అని చెప్పుకుంటున్నాడు...అందుకే నాకది పర్యాయ పదం లా కనపడుతుంది..

అడవుల్లోనూ, అజ్ఞాతంలోనూ ఉండి అప్పుడప్పుడూ వచ్చి అరాచకాలు చేస్తున్న వాళ్ళనే తీవ్రవదులు,ఉగ్రవాదులు అంటున్నారు...వాళ్ళు చేసేదే హింస అంటున్నారు...

తెల్లవారితే నీ పాటలే నేర్పే మాష్టారు అభం,శుభం తెలియని ఆడపిల్లని చెరచడానికి చూస్తాడు...
మా నాన్న కూడా పుట్టలేదంట ఈ వరకట్న నిరోధక చట్టం వచ్చేసరికి,
మొన్నే కట్నం కోసం నిండుచూలాల్ని నిలువెత్తునా నిప్పంటించి చంపేశారు అత్తా,మావలు...
ఒక పన్నెండేళ్ళ పిల్ల ఆసుపత్రికొచ్చింది..తనకి పుట్టబోయే బిడ్డ వాళ్ళ నాన్నదో, అన్నదో చెప్పమని...
మూడు లక్షల రూపాయల ఆస్తి కోసం భార్యతో కలిసి, కన్న తల్లిదండ్రులని కడతేర్చాడొకడు..ఇంకా ఎందరో....
చెప్పుకుంటూ పోతే ఈ లేఖ పూర్తయ్యే లోపు నా ఆయుష్షు నిండిపోతుంది..
వీళ్ళందరికీ ఇంకా ఏ పేర్లూ పెట్టలేదు...మనుషులు అనే పిలుస్తున్నారు..
వీళ్ళకి ఏ హానీ జరగకుండా మన రక్షక భటులు బంధించి రక్షకభట నిలయాలుగా చెప్పబడే విడిది గృహాలలో చేర్చారు...వాళ్ళకి శిక్ష విధించడానికి వీల్లేదు...ఒకవేళ శిక్ష వేద్దామనుకున్నా,
మానవహక్కుల సంఘం వాళ్ళు నీ చిత్రపటాలు చేతిలో పట్టుకుని రోడ్డెక్కి వాళ్లకి అండగా నిలబడతారు..

భావి పౌరులుగా చెప్పబడ్డ నేటి యువతరం...
ప్రియురాలి ప్రేమలోనూ...
రోడ్డు పక్క కారులో పడుపుకత్తె కౌగిలిలోనూ..
మధుశాలల్లోనూ, మత్తులోనూ...
పరాయిదేశాలకి సంపాదించి పెట్టే పనిలోనూ..
పీకల్లొతు వరకు మునిగి ఉన్నారు...

నా భారతి నగ్నంగా నడివీధిలో నిలబడి ఉంది..నువ్వు కప్పిన మువ్వన్నెల జెండా రాజకీయ నాయకులు, స్వార్ధపరులు ఎప్పుడో ముక్కలు ముక్కలుగా చింపేసారు..కొన్ని వందల సంవత్సరాలుగా తనకి జరుగుతున్న ఈ దారుణాన్ని భరించలేక ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని భయపడి జాతిపితవయిన నీకు ఈ లేఖ రాస్తున్నాను...

ఒక్కసారి రా... అహింస పేరుతో జరుగుతున్న హింసకి చరమగీతం పాడు..మా చేతికి ఈటెలు, కత్తులూ ఇచ్చి వెళ్ళు..ధనార్జన కోసం జరుగుతున్నదారుణ మారణ క్రీడలో వంద నోటు మీద ముద్రించబడ్డ నీ మొహం ఎప్పుడో రక్తంతో తడిసిపోయింది..వచ్చి వాటిని తగలబెట్టి వెళ్ళు..క్రూరమృగాల కొమ్ము కాస్తున్న ఈ పనికిమాలిన చట్టాలని తిరగరాసి వెళ్ళు. నువ్వు ఎగరేసి వెళ్ళిన శాంతికపోతం రెక్కలు పీకి, చంపుకు తినేసారు...ఈ నాటి ఈ హింసాకాండకి ఆనాటి నీ అహింసాసూత్రమే కారణమని చెప్పి వెళ్ళు...

నువ్వు అందరు దేవుళ్ళు ఒక్కటే అన్నావు...కొన్ని మతాలేమో హింస మహా పాపం అని చెబుతున్నాయి...కొన్ని మతాలేమో పరుల హింసే పరమ సోపానం అని చెబుతున్నాయి..నీకు ఏ దేవుడు తీర్పిచ్చాడో నాకు తెలియదు...అందుకే ఈ లేఖ నరకానికొక కాపీ స్వర్గానికొక కాపీ పంపిస్తున్నాను...అందుకున్న వెంటనే వస్తావు కదూ...

ఆమె అత్తోరిల్లు హైదరాబాదు

మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర కానూరు అగ్రహారం అని చిన్న పల్లెటూరు..

కమల, నేను చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులం..
ఇద్దరం పదో తరగతి వరకు కలిసి చదువుకున్నాం..తరువాత ఇద్దరం మానేసాం...
ఎంత బాగా ఆడుకునేవాళ్ళమో చిన్నప్పుడు
బట్టలు రాత్రి నానబెట్టుకుని పొద్దున్నే లేచి గోదారికెళ్ళి ఉతుక్కుని వచ్చేవాళ్ళం..
ఎంత బావుంటుందో గోదారికెళ్ళే దారి
దారికి అటు, ఇటు చెరుకు తోటలు, కమ్మగా కూసే కోయిలలు,
ఎర్రగా పండి రాలిన చేమ చింత కాయలు
భయం భయంగా చూసే ఉడత పిల్లలు
అప్పుడప్పుడు పాము, ముంగీస చెరుకుతోటలోంచి బయటికొచ్చి దార్లోనే దెబ్బలాడుకునేవి.
గోదారికెళ్ళేటప్పుడు చెప్పులేసుకునేవాళ్ళం కాదు ఇసుకలో నడిచేటప్పుడు, గట్టెక్కేటప్పుడు పట్టివ్వవని..
ఎంత అందంగా ఉంటుందో మా ఉరు..
చిలుకలు, చిలక పచ్చ రంగు పంట చేలు
మిగల ముగ్గిన జామ పళ్ళు
ఇంటిపక్కనే విరగబూసిన సన్నజాజి తోట
దొంగతనానికెళ్ళిన రాజు గారి మామిడి తోట
పరుగులు తీసే పంట కాలవ
ఇంకా ఎన్నో....
అయిదేళ్ళ క్రితం కమలకి, నాకు ఒకసారే పెళ్ళయ్యింది..
మా అత్తోరి ఊరు పక్కనే పెండ్యాల...
కమల అత్తోరి ఊరు హైదరాబాదు..
పెళ్ళయ్యాక మేమిద్దరం మళ్ళీ కలుసుకోలేదు..
మొన్న సంక్రాంతికి పిల్లల్ని తీసుకుని వచ్చింది...
నేను కూడా వెళ్లాను... ఎంత ఆనందమేసిందో అన్ని రోజుల తరువాత దాన్ని చూస్తున్నందుకు..
మనిషి మొత్తం మారిపోయింది..
సరిగ్గా కట్టుకోకపోతే ఆడవాళ్ళు చీరలో మరీ చిరాగ్గా ఉంటారని అప్పుడే అర్ధమయ్యింది నాకు..
కనపడగానే నవ్వింది...అందులో ఆనాటి స్వచ్చత లేదు...
పలకరింపు కూడా కొత్తగానే ఉంది..."ఎట్లున్నవ్" అంది...
పట్నం నుంచి వచ్చింది కాబట్టి కబుర్లన్నీ అదే చెప్పింది...
సాయంత్రం పూట నక్లెస్ రోడ్లో కూర్చుని హుస్సేన్ సాగర్ నీళ్ళు, బుద్ద విగ్రహం చూస్తే భలే ఉంటుందంట...
"హుస్సీన్ సాగర్ ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద మురికి కాలవ అట కదా" అని అమాయకంగా అడిగాను..
"ఏం కాదు" అంది...
పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయంట....
అందులో మమూలోళ్ళు ఎమీ కొనలేరంట...
పెద్ద పెద్ద లైట్లు రోజంతా వెలుగుతూనే ఉంటాయంట...
ఆప్పుడర్ధమయ్యింది నాకు పల్లెటూళ్ళో రోజుకి 10 గంటలు కరెంటెందుకు తీసేస్తున్నారో...
మొత్తం ఊరంతా తిరగాలంటే కనీసం 2 రోజులైనా పడుతుందంట...ఇంకా చాలా చెప్పింది...
ఇంతలో వాళ్ళమ్మొచ్చి కొబ్బరిబొండం నీళ్ళిస్తుంటే వద్దు కాఫీ తీసుకురమ్మంది...
వాళ్ళ పిల్లోడు ఆడుకోడానికెళ్తుంటే పిలిచి " ఏడికి వోతున్నవ్...డాడొచ్చినంక చెప్త మస్తు సతాయిస్తున్నవని" అంది..
ఆ పిల్లోడు మాట్లాడిందైతే నాకసలు అర్ధమే కాలేదు..
సరదాగా అలా గోదారికెళ్దామన్నాను...
హ్యాండ్ బ్యాగ్ లోంచి అద్దం తీసుకుని మొహానికి అదేదో రాసుకుని, లిప్స్టిక్కేసుకుని, హై-హీల్స్ చెప్పులేసుకుని బయలుదేరింది...
ఎందుకు ఇవన్నీ అన్నాను...
హైదరాబాదు లో ఈ మాత్రమైనా మేకప్ వేసుకోకుండా ఆడవాళ్ళు శవాన్ని చూడడానికి కూడా వెళ్ళరని చెప్పింది..
దారంతా మమ్మల్ని చూడటమే...
గట్టెక్కుతుంటే ఆ చెప్పు హీలు కాస్తా విరిగిపోయింది...
చెప్పులు చేత్తో పట్టుకుని నడవడానికి నామోషీ అంట అక్కడే పాడేసింది...
వచ్చేటప్పుడు అడిగాను ఎందుకే నీ భాష అలా మారిపోయింది అని...
"హైదరాబాదు ల గట్లనే మాట్లాడతరు" అంది...
మరిది హైదరాబాదు కాదుగా అన్నాను...
నా వంక అదోలా చూసింది...
అందరూ నీ వంక వింతగా చూస్తున్నారు...దానికి చూడు స్టైలెంత పెరిగిందో అనుకుంటున్నారు అన్నాను..
అప్పుడదేదో తీసుకోమంది...
ఆ...........లైటు... లైటు తీసుకోమంది...