Monday 7 May 2012

పెద్దలు కుదిర్చిన పెళ్లి

నాకు నచ్చిన అమ్మాయి దొరకకపోవడం వల్లనో, నేను ఏ అమ్మాయికీ నచ్చకపోవడం వల్లనో భయమో, ఏమో.. కారణమేమైనా నేనెవ్వరినీ ప్రేమించలేదు... చాలా రోజుల పాటు పెళ్ళి  కూడా చేసుకోలేదు.
  
అమ్మ పోరు పడలేక చివరికి ఒక అమ్మాయిని చూడడానికొప్పుకున్నాను.. మా కారు అమ్మాయి ఇంటి ముందు ఆగగానే హడావుడి మొదలయ్యింది.. ముందు అమ్మ, నాన్న... వెనక అక్క, నేను తల ఎత్తి నడవడానికి ఇబ్బందే, దించి నడవడానికి ఇబ్బందే.. అక్కడున్నవాళ్ళంతా నన్ను చూడడానికే ఎదురు చూస్తున్నారన్న విషయం గుర్తోచ్చినప్పుడు ఆ ఇబ్బంది ఇంకొంచెం పెరిగింది.. ఇలా ఈ ఇంటికి పెళ్లి చూపులకొచ్చిన ఎన్నో పెళ్లి కొడుకునో నేను అన్న అనుమనమూ వచ్చింది.. కాసేపాగాక అడుగులో అడుగేసుకుంటూ లోపలనుంచి వచ్చింది అమ్మాయి.. ఆమె వస్తున్నవైపు అలికిడి తెలిసి కళ్ళు అటు తిరిగాయి.. తెల్లని పాదాలు...వాటిని అందంగా అలంకరించిన గోరింటాకు.. చప్పున తలెత్తి చూసేద్దామనిపించింది...మళ్ళీ ఎందుకో ఆగిపోయాను... రెండు నిముషాలు అంతా నిశ్శబ్దం...ఇంతలో అక్క మెల్లగా తట్టింది పిల్లని చూడమన్నట్టు.. అప్పుడు తల పైకెత్తి చూసాను మెల్లగా....  

ఆమె కురులు అమావాస్యనాటి అర్ధరాత్రి, అంబుధి మీద అలుముకున్న కారుచీకటి, ఆమె కను రెప్పలు హోరు గాలికి కొట్టుకుంటున్న కిటికీ రెక్కలు ఆమె ముక్కు సంపెంగ... అబ్బా ఇంకా ఏమని చెప్పను...ఆమె కుందనపు బొమ్మ మారు మాట్లాడకుండా నచ్చిందని తలూపాను..

 తరువాతన్నీ ఆఘమేఘాల మీద జరిగిపోయాయి.. సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసెయ్యాలని అందరూ నిశ్చయించుకున్నారు.. అనుకున్న రీతిలోనే ఆ నెల రోజుల తర్వాత నిశ్చితార్ధం జరిగిపోయింది.. అందరబ్బాయిల్లాగే నేను కూడా అమ్మాయికి సొల్లు ఫోను కొనిచ్చాను... ఎంగేజ్మెంట్ అయిన రెండు రోజుల తర్వాత తడబడుతూ నూటొక్క సార్లు డయల్ చేసి కట్ చేశాను.... తర్వాత ధైర్యం తెచుకుని కాల్ చేసాను... ఎంత తియ్యగా ఉందో ఆ గొంతు... ఇక్కడ మళ్ళీ సమస్య నేను పేరు పెట్టి పిలవాలా, అండి అని పిలవాలా అని... చివరికి ఏవండీ అని మొదలెట్టాను... మొదటి రోజు రెండు మూడు నిమిషాలకన్నా ఎక్కువ మాట్లాడలేదు.. రెండవ రోజు కొంచెం సమయం పెరిగింది... మూడవ రోజు కాస్త చనువు పెరిగింది... నాలుగువ రోజు ఆమె "నన్ను ఏవండి అనొద్దండి పేరు పెట్టి పిలవండి" అంది.. అర్ధరాత్రి అకస్మాత్తుగా ఒకరోజు మెలకువొచ్చింది... ఒకటే ఆలోచనలు... 23 సంవత్సరాలుగా నా ముక్కు, మొహం తెలియని అమ్మాయి మూడు నిమిషాలు నా ముందు కూర్చుని ఏం అర్ధం చేసుకుందో నన్ను, అసలు నేనేం అర్ధం చేసుకున్నాను... నా దగ్గర మాట్లాడుతున్న ఈ పంచదార పలుకులన్నీ నిజమేనా? నిజమే అయితే సహజమా? కృత్రిమమా? ఇన్నేళ్లుగా లేని ప్రేమ అకస్మాత్తుగా ఇప్పుడు ఏం జరిగిందని పుడుతుంది... అంటే ఈ ప్రేమని బలవంతంగా తెచ్చి పెట్టుకుంటున్నామా... ఇలాంటి అలొచనలన్నీ దోలిచేస్తున్నాయి... ఇంతలో గుర్తొచ్చాయి మళ్ళీ ఆమె కనురెప్పల రెపరెపలు... అలొచలన్నీ మారిపోయాయి... పెళ్ళైపోయింది...  

మొదటి రాత్రి పాలు తీసుకుని వచ్చింది నా భార్య.. నా అర్ధాంగి, నా సతీమణి, నా సఖి, నా ప్రియురాలు..నా ఎదురుగా నిలుచుంది.. ఒక అనిర్వచనీయమైన అనుభూతి..జీవితంలో ఒకసారి మాత్రమే కలిగే అనుభూతి.. వయసొచ్చిన దగ్గరనుంచి మొదటిరాత్రి గురించి కన్న కలలు... ఎన్ని రకాల కలలు.. ఈ చిన్ని రాత్రి సరిపోతుందా... పక్కన కుర్చోమన్నాను... నీకోసం నేనొక పాట పాడతాను అన్నాను... మరది సిగ్గో, ఆశ్చర్యమో అర్ధం కాలేదు గాని పాడండి అంది... నేను "వయ్యారి గోదారమ్మ" పాట పాడదామనుకొని ఆగి నువ్వు చెప్పు నీకేం పాట కావాలో అన్నాను... ఒక 5 నిముషాలు తీవ్రంగా అలోచించి.... స్టాలిన్ సినిమాలో పరారే పరారే పాట పాడండి అంది... అరగంట కష్టపడి రాజేసిన మంట మీద ఎవరో బిందెడు నీళ్ళు కుమ్మరించినట్టయ్యింది.... ఇంక పాటల గురించి మాట్లాడడం అనవసరం అని నాకర్ధమయిపోయింది... నీకు శ్రీశ్రీ తెలుసా అని అడిగాను... మొన్న TV9 లో చెప్తే విన్నాను అంది... చలం గారు తెలుసా అన్నాను.. పాత సినిమా ఆక్టర్ కదా అంది... యండమూరి తెలుసా అన్నాను..... అంతర్ముఖంలో వస్తాడు ఆయనే కదా ఒకసారి చూసాను అంది.. సినిమాలు చూస్తావా అని అడిగాను... చూస్తాను అంది.. నీకిష్టమైన 4 సినిమాలు చెప్పు అన్నాను... ఈమధ్యవి అయితే...స్టాలిన్, బాస్, ఆట...ఇంకేదో చెప్పబోతుంటే చాలు అన్నాను... ఇష్టమైన హీరో ఎవరు అంటే ఉదయకిరణ్ అంది... నాకింక ఏమీ మిగలలేదు.. ఆమె మనస్తత్వం పూర్తిగా అర్ధమైపోయింది.... వెయ్యి పిడుగులు ఒకసారే తల మీద పడ్డట్టయ్యింది... నా మొహం కళ తప్పి కాస్త కోపంగా మారే సరికి నా వంక భయంగా చూసింది... మళ్ళీ అవే కనురెప్పల రెపరెపలు...కోపమంతా పోయింది.... మా అనుమతితో దీపం ఆరిపోయింది..  

సంవత్సరం గడిచిపోయింది... ఒకనాడు నా ఫ్రెండ్ ఫోన్ చేస్తీ నా బాధ అంతా కక్కుక్కున్నాను... ఎన్ని కలలు కన్నానురా జీవిత భాగస్వామి గురించి..... రోజుకొక కవితతో నిద్ర లేపుదామనుకున్నాను... తనని ఎంకి అని పిలిచి నన్ను నాయుడు బావా అని పిలిపించుకుందామనుకున్నాను... ఇళయరాజా బాణీకి నా గొంతుతో తన గొంతు కలపాలనుకున్నాను... బాలు పాట, శ్రీశ్రీ మాట అన్నీ తనతో పంచుకుందామనుకున్నాను... అర్ధరాత్రి గోదారి ఇసక తిన్నెల మీద వెల్లికిలా పడుకుని తననొకసారి, చందమామనొకసారి చూసి కవ్విద్దామనుకున్నాను... ఎదురెదురుగా కూర్చుని అల్లసాని పద్యాలతో ఆడుకుందామనుకున్నాను... పాప్ పాటలకి స్టెప్పులేయిద్దామనుకున్నాను... ఏదీ నెరవేరలేదు...ఏమీ మిగలలేదు... ఆమె మాత్రం మనం డిగ్రీలో ఉండగా మొదలయిన మొగలిరేకులు సీరియల్ ఇంకా చూస్తుంది... నరకమయిపోయిందిరా జీవితం..

  ఒకసారి ఆఫీస్ అయిపోయాక ఇంటికెళ్ళాను... వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది నా భార్య.. ఏమిటోనమ్మ ఈయన నాకర్ధం కాడు... ఎంతసేపూ ఏవో పిచ్చి పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు... పాత పాటలు వింటాడు... అదేదో ప్రియమణిది తమిళం సినిమా.. ఆ...... పరుత్తివీరన్ అంట, ఇప్పటికి దాన్ని ఒక 30 సార్లు చూసాడు.. కష్టపడి వంట చేస్తే కనీసం బాగుంది అని కూడా అనడు... చేపల కూర వండితే చారుతో తిని లేచిపోతాడు.. ఏదో లోకంలో ఉంటాడు... ఏం కావాలన్నా కొంటాడు...కానీ నాతో అస్సలు మాట్లాడడు... ఎంతసేపూ ఏవో రాసుకుంటూ ఉంటాడు... అసలు సరైన బట్టలు వేసుకోడు... ఏదైనా చెప్తే సగమే వింటాడు... చచ్చిపోతున్నానమ్మా...నరకమయిపోయింది జీవితం....

13 comments:

  1. Hey is this Real about u r Life?
    If yes try to love ur wife's likes at the same for sure she will give respect to your likes.

    ReplyDelete
  2. Nooooooo........I am not yet married..its just an imagination...

    ReplyDelete
  3. abhiprayalu, abhiruchulu kalavani bharyabharthala alochanalu ela vuntayo baga chepparu...like it...keep post more ..:)

    ReplyDelete
  4. ప్రపంచంలో ఏ ఇద్దరి వ్యక్తుల అభిప్రాయాలూ ఒకేలా ఉండవుగా మోహన్. కానీ ఇలాంటివి నిజంగా ఎదురయినప్పుడు బాధగానే ఉంటుంది. జీవితాంతం మనతో ఉండే భాగస్వామికి మన అభిరుచులు నచ్చకపోవడం అనేది ఒక పెద్ద శిక్షలా ఉంటుంది. కానీ అలానే క్రుంగిపోక ఎదుటివారి ఇష్టా ఇష్టాలకు విలువనిస్తూ ఉంటేనే బంధం నిలబడుతుంది. అలా ముగించేయకుండా కొంచెం కొనసాగిస్తే పరిపూర్ణంగా ఉండేది అనిపించింది.

    ReplyDelete
  5. aa ammayi valla ammato matladadam vinna next minute aa abbayi maripotadu Rasagnaa...yendukante appati varaku tanaku matrame feelings unnay...tanaku matram goppa taste undanukuntadu...Mogali rekulu chuse ammayiki mogudi meeda feelings yendukuntay anukuntadu...kani untay....aame manasu paridhiloki velite telustaay...

    ReplyDelete
  6. ayyo mohan .. naavi aa pellikoduki abiruchile.. naku maa vallu sambandallu chusthunnaru .. meeru mee kathatho baya pettesaru pellante .. But any way rasagnagaru cheppinattu lokamlo ee iddari vykathulu okala undaru .. anni manaku nachhinatle kavali anukunte anthe eppatiki manasiki santosam dorakdu .. eppudithe ithuralani artham chesukontamo vallani valluga sweekaristhamo appudu antha santhoshame .. ayyo baboy vayasuku minchina matalu cheppesanu ..:)

    ReplyDelete
  7. seenu garu vayasuku minchina matalu antu yemundavu...chalaa baga chepparu...na opinion kuda ade...kanee yedo miss avutundi..anthe...

    ReplyDelete
  8. Excellent narration.I am big fan of telugu poetry like you.I like your poetic heart.

    ReplyDelete
  9. ఒకసారి ఆఫీస్ అయిపోయాక ఇంటికెళ్ళాను... వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది నా భార్య.. ఏమిటోనమ్మ ఈయన నాకర్ధం కాడు... ఎంతసేపూ ఏవో పిచ్చి పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు... పాత పాటలు వింటాడు... అదేదో ప్రియమణిది తమిళం సినిమా.. ఆ...... పరుత్తివీరన్ అంట, ఇప్పటికి దాన్ని ఒక 30 సార్లు చూసాడు.. కష్టపడి వంట చేస్తే కనీసం బాగుంది అని కూడా అనడు... చేపల కూర వండితే చారుతో తిని లేచిపోతాడు.. ఏదో లోకంలో ఉంటాడు... ఏం కావాలన్నా కొంటాడు...కానీ నాతో అస్సలు మాట్లాడడు... ఎంతసేపూ ఏవో రాసుకుంటూ ఉంటాడు... అసలు సరైన బట్టలు వేసుకోడు... ఏదైనా చెప్తే సగమే వింటాడు... చచ్చిపోతున్నానమ్మా...నరకమయిపోయింది జీవితం.... hahahahah sister kastalu papam

    ReplyDelete
  10. naalo ekkado dagunna reader ni bayataki tesukochav mitram.

    ReplyDelete