ఈ రోజుల్లో india లో
శ్రీ చైతన్య విద్యా సంస్థల గురించి తెలియని వాళ్ళు ఉంటారని నేను అనుకోను.. పిల్లల, వారి తల్లిదండ్రుల
రక్తాన్ని, నరాల్ని పిండి , పీల్చి పిప్పి చేసి కొన్ని కోట్లు సంపాదిస్తున్న
సంస్థ. .ఇదొక్కటే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ఈ రోజు విద్య వ్యాపారమయిపోయి, అసలు
దాని అర్ధమే కోల్పోవడానికి, భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ఇలాంటి సంస్థలు పుట్ట
గొడుగుల్లా పుట్టడానికి శ్రీకారం చుట్టిన సంస్థల్లో శ్రీ చైతన్య కూడా ఒకటి.
2002 ,
శ్రీచైతన్య, విజయవాడ, సౌదామిని సౌధం champus లో కాలేజీ 10
toppers లో ఒకడు సంఘమిత్ర,10 hit list లో ఒకణ్ణి నేను. ఆ రెండేళ్లలో మేము
అనుభవించిన జీవితమే ఈ కధ.
************
10th class వరకు
మూడు సంవత్సరాలు గురుకుల పాఠశాల లో చదివాక ఎందుకనిపించిందో మరి, నన్ను sudden
గా doctor ని చేసేద్దామనిపించింది మా బాబుకి. గురుకుల
పాఠశాల అంటే బహుశా మీకు అవగాహన ఉందో, లేదో ...కొన్ని విషయాలు
చెబుతాను..A.P.S.W.R.
School. అంటే ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకల
పాఠశాల. సంవత్సరానికి కనీసం 1500 కూడా ఆదాయం లేని, బడికి వెళ్లి చదువుకోలేని
పిల్లల కోసం N.T.రామారావు గారు స్థాపించిన సంస్థలు.ఆయన ఉద్దేశ్యం
మంచిదే. ఇండియా లో గొప్ప గొప్ప వాళ్ళ ఉద్దేశ్యాలు తరువాత ఏమయ్యాయో మీకు తెలియంది
కాదు. సాధారణంగా ఇంటి భోజనం తినేవాడు ఎవడైనా ఆ hostel భోజనం
మొదటి సారి తింటే వాంతి చేసుకోవాల్సిందే. చచ్చిన ఈగలు, పురుగులు చూసి అస్సలు
ఆశ్చర్యపోవలసిన పనిలేదు.. ఆ పరిస్థితులు భరించలేక నేను రెండు సార్లు పారిపోయాను..తరువాత
తరువాత అలవాటు పడ్డాను..అక్కడ నేనే rich. నెలకి 50
రూపాయలు ఇచ్చేవాడు మా బాబు.. స్కూల్ లో ఇచ్చే uniform తప్ప
ఒక్క జత బట్టలు కూడా కొనుక్కోలేని పిల్లలు అక్కడ చాలా మంది ఉండేవారు. అటువంటి చోటు
నుండి ఒక్కసారిగా శ్రిచైతన్యకి. Slumdog had become millionaire...2002 జూన్
అనుకుంట. అమ్మ, బాబు, నేను శ్రీచైతన్య లో join
అవ్వడానికి బయలుదేరాం...
*************
అప్పటికే శ్రీచైతన్య, విజయవాడలో దాదాపు 22 చోట్ల
తన విషపు వేళ్ళని భూమిలో దింపింది. ఈ 22 champus ల లో కొన్ని ఆడపిల్లలవి, కొన్ని మగ పిల్లలవి,
కొన్ని day-scholors వి . co-education
రెండో, మూడో day-scholor colleges లో ఉండేది. అబ్బాయిల champus ల కి
సంబంధించిన head office అశోక్ నగర్ లో ఉండేది. నాకు తెలిసి ఇప్పటికీ
అక్కడే ఉందనుకుంట. ముందు వెళ్లి అశోక్ నగర్ లో join అయితే
మన champus ఏమిటే అనేది అక్కడ decide చేస్తారు. మేము అక్కడికి చేరుకునేసరికి
champus అంతా కోలాహలంగా ఉంది. ఒకచోట money collection counter, ఇంకో
చోట enrollment , ఇంకోచోట doubts clarify చేసే benches. మా
బాబుకి ఏమీ తెలీదని , ఉత్త fool అని నాకు తెలిసినా నేను ఆయన మాట వినాలి.
ఎందుకంటే ఏ విషయమైనా ఆయనకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదని (ముఖ్యంగా మాకు) ఆయన
feeling..నేను ఏమన్నా మాట్లాడితే అక్కడ చుట్టూ వెయ్యి
మంది ఉన్నా ఒక్క క్షణం ఆలోచించకుండా నా చెంప పగల గొట్టేస్తాడు..అందుకే మౌనంగా follow
అయ్యాను. అక్కడ చాలా clear గా money counter అని
రాసి ఉన్నా, అది చూడకుండా పక్కనే ఉన్న ఒక couple దగ్గరికెళ్ళి
అడిగాడు..వాళ్ళు process అంతా చక్కగా explain
చేసారు. మా బాబుకి బయటివాళ్ళతో వెంటనే మాటలు కలిపెయ్యడం పుట్టుకతో వచ్చిన art. so
మాటల్లో పడ్డాడు. ఆ couple పక్కన సన్నగా, తెల్లగా ఓ కుర్రాడు నిలబడి ఉన్నాడు.
పక్కన జరుగుతున్న ఈ తతంగమేమీ పట్టించుకోకుండా ఓ కొబ్బరి చెట్టు వైపు తీక్షణంగా
చూస్తున్నాడు. నేను వెళ్లి పలకరించాను. వెంటనే పలకలేదు. మళ్ళీ పిలిస్తే ఈ లోకంలోకి
వచ్చాడు..హాయ్ అన్నాడు. మోహన్ అన్నాను. సంఘమిత్ర అని shake hand
ఇచ్చాడు.that was the most confident shake hand. Curiosity
చంపుకోలేక ఏమిటి అంత తీక్షణంగా చూస్తున్నారు అన్నాను.
Cocus nucifera phyllotaxy అన్నాడు. ఒక్క ముక్క అర్ధం కాలేదు. నేను తెలుగు మీడియం కదా అదేదో English word అయ్యుంటుందని light తీసుకున్నాను.ఒక chair, ఒక plank, ఒక పరుపు అక్కడే కొనుక్కుని 1000 fee pay చేసాం..చేతిలో ఒక slip పెట్టి వెళ్లి సౌదామిని సౌధం లో చుపించామన్నారు. అక్కణ్ణుంచి బయలుదేరాం. చాలా మంది parents వాళ్ళ పిల్లల్ని అశోక్ నగర్ campus లో ఉంచమని బ్రతిమాలుతున్నారు. దానిలో ఉన్న మర్మం తెలియక మా బాబు ఆ పని చెయ్యలేదు.
Cocus nucifera phyllotaxy అన్నాడు. ఒక్క ముక్క అర్ధం కాలేదు. నేను తెలుగు మీడియం కదా అదేదో English word అయ్యుంటుందని light తీసుకున్నాను.ఒక chair, ఒక plank, ఒక పరుపు అక్కడే కొనుక్కుని 1000 fee pay చేసాం..చేతిలో ఒక slip పెట్టి వెళ్లి సౌదామిని సౌధం లో చుపించామన్నారు. అక్కణ్ణుంచి బయలుదేరాం. చాలా మంది parents వాళ్ళ పిల్లల్ని అశోక్ నగర్ campus లో ఉంచమని బ్రతిమాలుతున్నారు. దానిలో ఉన్న మర్మం తెలియక మా బాబు ఆ పని చెయ్యలేదు.
***********
మేం బయటికి వెళ్లేసరికి సంఘమిత్ర వాళ్ళు
కూడా ఆటో కోసం wait చేస్తున్నారు ..అందరం కలిసి ఆటో లో బయలుదేరాం.
ఇంట్లో తప్ప ఇంకెక్కడా నిశ్శబ్దాన్ని ఇష్టపడని మా బాబు తన ధర్మ సందేహాన్ని
సంఘమిత్ర parents దగ్గర వెలిబుచ్చాడు. ఎందుకు అందరు అశోక్ నగర్ campus కోసం బతిమాలుతున్నారని...అప్పుడు వాళ్ళ నాన్న explain చేసారు..570 మార్కులు దాటిన వాళ్ళని మాత్రమే అశోక్ నగర్ campus లో ఉంచుతారు. marks ని బట్టి campus లు , section లు , వాటికి వెళ్ళే lecturers నిర్ణయించబడతారు.మేము సౌదామిని సౌధం campus కి
వెళ్లేసరికి అక్కడ కూడా అంతా హడావుడిగా ఉంది..ముందు section decide చేసాడు..నేను
T-1, సంఘమిత్ర M-1..ఈ division ఏ base మీద
జరిగిందంటే 10th వరకు
తెలుగు మీడియం చదివి ఇంగ్లీష్ మీడియం కి వచ్చిన వాళ్ళు T-1, T-2 sections.
500 దాటిన వాళ్ళు T-1. అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు T-2.నాకు 503 కాబట్టి
T-1...English medium నుంచి వచ్చిన వాళ్లకి M-1 to M-10 sections.
560-570 వచ్చిన వాళ్ళు M-1 550-560 వచ్చిన వాళ్ళు M-2..........
అలా M-10 లో just pass
ఉంటారనమాట. వచ్చే Lecturers లో కూడా చాలా difference
ఉంటుంది. M-1 కి well qualified, almost అందరూ phd చేసిన వాళ్ళు వెళతారు. కింద sections కి
వెళ్ళే కొద్దీ lecturers quality తగ్గుతుంది. T-1, T-2 సెక్షన్స్
కి తెలుగులో explain చెయ్యగలిగిన వాళ్ళు వెళతారు. ఎంత difference
ఉంటుందంటే M-1 కి
వెళ్ళే lecturer కి సంవత్సరానికి 14
లక్షలు జీతం ఉంటే T-2 కి వెళ్ళే lecturer కి కేవలం
లక్ష మాత్రమే ఉంటుంది. మా time లో year కి 35000 fee...అది
కాకుండా 2000 ఇంకేవో charges.
పుస్తకాలు మనమే కొనుక్కోవాలి. వాళ్ళు కేవలం భోజనం పెట్టి, room ఇచ్చి చదువు
చెబుతారు అంతే...
class decide అయిపోయిన
తరువాత hostel room decide చేసారు. సంఘమిత్ర కి room no-103(first
floor) నాకు room no 503(fifth floor)...ఇలా
rooms ఇవ్వడంలో ఉన్న అంతరార్ధం నాకు తర్వాత అర్ధమయ్యింది. First
floor అంతా M-1, M-2, M-3 second floor M-4, M-5, M-6 .......last
floor అదే fifth floor T-1 and T-2. మేము
తెలుగు మీడియం. అంటే సాధారణంగా పల్లెటూరి నుంచి వచ్చి ఉంటాం.
Government school కాబట్టి అంత సుకుమారంగా ఉండము. కాబట్టి
fifth floor వరకు మెట్లు ఎక్కడానికి కష్టపడమనమాట. English medium అంటే
జనరల్ గా ఒళ్ళంతా కొవ్వు పేరుకుపోయి, మధ్యాహ్నం lunch box లో
పప్పులో నెయ్యి తగ్గిందని అలిగితే ఆయా తినిపించి, బుజ్జగించిన సుకుమారులు ఉంటారు
కాబట్టి అన్ని మెట్లు ఎక్కలేరనమాట.. ఇందులో ఇంకో విషయం ఉంది. శ్రీ చైతన్య కి
ఎక్కువ ranks తెచ్చి పెట్టేవాళ్ళంతా M-1 లోనే
ఉంటారు. వాళ్ళు అంత పైకి ఎక్కితే అలిసిపోతారు. classes కి
వెళ్ళడం ఒక 5 సెకండ్స్ కుడా late అయ్యే ఛాన్స్ ఉండకూడదు, night 5
నిముషాలు ముందు నిద్రపోవచ్చు. ఆలోచిస్తే ఇంకా చాలా ఉంటాయి.
First floor లో సంఘమిత్ర వాళ్లకి bye చెప్పేసి , fifth floor వరకు నా luggage తీసుకొని వెళ్లాం. నా room లో అంతకు ముందే join అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు..my future room mates. భాస్కర్, పేర్రెడ్డి, ప్రవీణ్...ఇంకా కొంతమంది..సరిగా గుర్తు లేరు. అంతా అయిపోయాక మా అమ్మ “ జాగ్రత్తగా చదువుకో నాన్నా , భోజనం బాగానే పెడతారంట “ అని తల నిమిరింది. మా బాబు “35000 కట్టాం..ఆషామాషీగా చదివితే కుదరదు “ అని తన సొంత monotone లో అన్నాడు.వాళ్ళకి send off ఇవ్వడానికి కిందకి వెళ్లాను. సంఘమిత్ర parents కూడా బయలుదేరుతున్నారు. వాళ్ళ అమ్మ ముద్దు పెట్టుకుంది, వాళ్ళ నాన్న చెదిరిన తల దువ్వుతున్నాడు. డబ్బులు కావలిస్తే అడగడానికి మొహమాటపడొద్దని చెప్పి 5000 చేతిలో పెట్టారు. అది చూసి ఏదో మరిచిపోయానన్న విషయం గుర్తొచ్చి మా బాబు కూడా వెంటనే 500 కాగితం తీసి నా చేతిలో పెట్టాడు. అప్పటి వరకు 50 రూపాయల నోటుకి మాత్రమే అలవాటు పడిన నా చేతులు దాన్ని తీసుకోడానికి కాస్త వణికాయి....అలవాటు ప్రకారం అమ్మ తను రూపాయి రూపాయి చేర్చి దాచిన 100 రూపాయల నోటు చేతిలో పెట్టింది. ఆ తరువాత వెళిపోయారు. సంఘమిత్ర కి hostel కొత్త. అందుకే వాళ్ళు వెళిపోతుంటే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. మూడు సంవత్సరాల గురుకుల జీవితం నా కళ్ళ నీళ్ళని ఎప్పుడో మింగేసింది...సంఘ మిత్ర భుజం మీద చెయ్యి వేసి పైకి తీసుకెళ్ళాను.
****************
ఏదో ఒకటి రెండు సార్లు వైజాగ్ తప్ప
జీవితంలో ఎప్పుడూ గోదావరి జిల్లాలు దాటక పోవడం వల్ల నాకు తెలుగులో ఎన్ని రకాల
యాసలున్నాయో తెలీదు.. నా room లో ఇద్దరు తెలంగాణ వాళ్ళు, ఇద్దరు రాయలసీమ
వాళ్ళు ముగ్గురం గోదావరి, ఒకడు కృష్ణ...తెలంగాణా వాళ్ళు ఒకడు నల్లగొండ నుంచి,
ఇంకొకడు ఆదిలాబాద్ నుంచి...రాయలసీమ వాళ్ళు ఒకడు అనంతపూర్, ఇంకొకడు కర్నూలు. మొదటి
రోజు ప్రయాణ బడలిక వల్ల పెద్దగా మాట్లాడుకోలేదు. త్వరగా పడుకున్నాం..
తెల్లవారు
జామున 5 గంటలకి ఒక పెద్ద శబ్దం వినిపించింది. మగత నిద్రలో నా మెదడు ఆ శబ్దాన్ని decode చెయ్యలేకపోయింది.కాస్త
concentrate చేస్తే అదేదో జంతువు అరుపు అనిపించింది.కానీ
animals అక్కడికి వచ్చే chance లేదు కదా..లేచి కుర్చుని మళ్ళీ
విన్నాను..లెండి.లెండి అని అరుస్తూ(may be 120 decibels ) ఒక
పరమ అసహ్యమైన గొంతు. ఎంత అసహ్యమైనదంటే నేను కాబట్టి అంత సేపు పట్టింది గాని,
మిగిలిన వాళ్ళు మొదటి అరుపుకే లేచిపోయారు. గురుకుల పాఠశాల లో కూడా పొద్దున్నే
లేవడం అలవాటే కాబట్టి అదేం పెద్ద problem అనిపించలేదు..అయినా ఎందుకో మళ్ళీ బద్ధకం
వచ్చి ముసుగు తన్నాను. ఈసారి sound song రూపంలో వచ్చింది. “ గోవిందాశ్రిత గోకుల
బృందా పావన జయ జయ పరమానందా “ అన్నమయ్య పాటలు .నాకెంతో ఇష్టం. నేను కూడా అలాగే దుప్పటి
ముసుగులో పాడేసుకున్నాను. volume పెరిగింది. పాటని enjoy చేసే stage దాటి
తట్టుకోలేని stage వచ్చింది. ఆప్పుడర్ధమయ్యింది నాకు విషయం. ప్రతీ floor లోనూ
ahuja sound boxes ఉన్నాయి. వాటి యొక్క మొదటి ఉద్దేశ్యం..కింద
నుంచి receptionist ఎవరినైనా పిలవాలనుకుంటే easy way. పేరు
announce చెయ్యగానే building లో ఉన్న అందరికీ వినబడుతుంది. రెండో ఉద్దేశ్యం ఇలా
ఎక్కువ sound తో పాటలు పెట్టి పొద్దున్నే నిద్ర మత్తు వదలగొట్టడం.
మొదటి రోజు కాబట్టి enjoy చేసాను. కానీ తరువాత 2 years continuous గా అవే పాటలు...cassette కూడా మార్చలేదు వెధవలు..అర్ధం చేసుకోండి
ఎంత నరకమో..నేను brush మీద paste
పెట్టి బయలుదేరేసరికి నా room లో సగం
మంది dress చేసేసుకుంటున్నారు...చాలా మంది పుస్తకాలు పట్టుకుని
కిందకి దిగిపోతున్నారు.. ఇవాళనుంచే విపరీతంగా చదివేసి state ranker అయిపోవాలన్న తపన వాళ్ళ మొహాల్లో కొట్టొచ్చినట్టుగా, తన్నొచ్చినట్టుగా, బాదొచ్చినట్టుగా
కనబడుతుంది.
ఒక floor లో
ఉండే వాళ్ళందరికీ ఒక మూల bathrooms. నేను వెళ్ళే సరికి ఒక్కటి కూడా ఖాళీ లేదు.
వెనకవైపు వరుసగా wash basins ఉన్నాయ్. Face wash
చేసుకోవడానికి అక్కడికెళ్ళి నోట్లో brush పెట్టి తల ఊపడం మొదలుపెట్టాను. నా పక్క
వాడు brush తీసి, నోట్లో వేళ్ళు పెట్టుకుని పెద్ద పెద్ద
శబ్దాలు చేస్తూ కక్కడం మొదలెట్టాడు. ఇంకొకడు brush తోనే
నాలుక గీస్తున్నాడు. ఆ దృశ్యం చూసిన సగటు కోస్తా వాడెవడికైనా కడుపులో తిప్పుతుంది.
తరువాత నాకు తెలిసిన పచ్చి నిజం ఏమిటంటే తెలంగాణా, రాయలసీమల్లో చాలా ప్రాంతాల
వాళ్ళు tongue cleaner వాడరు. అసలు అదొకటి ఉంటుందని చాలా మందికి తెలీదు.
Either uncivilized or over civilized అనుకున్నా మనసులో. వెంటనే room లో నా
bed పక్కన ఎవరున్నారో అని గుర్తు చేసుకున్నాను. భయపడాల్సింది ఏమీ లేదని ఆనందపడ్డాను.
తరువాత స్నానం అయిపోయింది. ఇంకో పది నిముషాల తర్వాత floor
మొత్తం ఖాళీ అయిపొయింది. అప్పటిదాకా చేపల మార్కెట్ లాగా ఉన్న building
ఒక్కసారే రాంగోపాల్ వర్మ సినిమాలో పాడుబడ్డ భవనం లా తయారయ్యింది. నేను నా style లో slow గా ready
అయ్యి ఒకే ఒక్క note book
పట్టుకుని ఒక్కో floor దిగడం మొదలెట్టాను. అప్పటికి 6.30
అయ్యింది.కింద నాలాగే కాస్త late గా వచ్చిన వాళ్ళందరినీ నిలబెట్టి principal గణపతి
క్లాసు పీకుతున్నాడు. నేనొచ్చేసరికి ఆఖరి మాట పూర్తి చేసాడు. "రేపట్నుంచి
6 దాటిన తర్వాత వచ్చే వాళ్లకి ఇలా మాటలతో చెప్పడం ఉండదు. Now go
to your classes. అన్నాడు". వెంటనే అందరం classes కి
వెళిపోయాం. T-1 కి నాతో పాటు ఇంకో ముగ్గురు late గా
వచ్చారు. సీరియస్ గా class జరుగుతుంది. శవం లేచిన ఇంట్లో జనం ఏడ్చి ఊరుకున్నాక
అలుముకునే నిశ్శబ్దం. Only lecturer మాటలు......గుమ్మం దగ్గర మమ్మల్ని చూసి లోపలికి
రమ్మన్నట్టు సైగ చేసాడు. Last benches లో మాత్రమే ఖాళీలున్నాయ్. నాక్కావలసింది కూడా అదే. వెళ్లి right side corner place select
చేసుకున్నాను. ఒక్కసారి class మొత్తం చూసాను. ఏమీ లేదు. ఒక rake shed.
దానిలో benches. “ ప్రియమైన విద్యార్ధులు మరియు వారి
తల్లిదండ్రులకు విజ్ఞప్తి. .దయచేసి కాలేజీ వాళ్ళు ఇచ్చే prospectus చూసి
మోసపోకండి. ఆ పుస్తకంలో ఉన్నది ఒక్కటి కూడా నిజం కాదు.”
Minimum
AC class expect చేసిన నేను ఆ class room చూసి
డీలా పడిపోయాను. పైగా అందరూ అబ్బాయిలే. గత మూడేళ్ళుగా గురుకుల పాఠశాల లో స్త్రీ
పరిమళ భాగ్యానికి నోచుకోని నాకు ఇంకో 2 సంవత్సరాలు అదే పరిస్థితి అని తెలిసాక
ఏడుపొచ్చేసింది. అందర్నీ పుస్తకాలతో పాటే plates కుడా
తెచ్చుకొమ్మని చెప్పారు. periods జరుగుతూ ఉండగా మధ్యలోనే కొన్ని sections ని breakfast కి
పంపేసారు. Just half an hour. అదే break.
మొదటి రోజు తిన్నప్పుడు food చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం అప్పటిదాకా
తిన్నది పురుగులు కదా మరి..ఇక్కడ ఒక్క పురుగు కూడా లేదు. పైగా ఇడ్లి లోకి చట్నీ
కుడా వేసారు. రెండో రోజు పులిహోర. ముందెళ్ళి వేరుశెనగ గుళ్ళు ఏరేసుకోవాలి...అలా వారం
అంతా ఏదొక change ఉంటుంది గానీ, తర్వాత 2 years పాటు
అదే menu..నెల రోజుల తర్వాత dining hall కి వెళ్ళాలంటేనే చిరాకొచ్చేస్తుంది..మధ్యాహ్నం
కూడా అదే పరిస్థితి. almost 5 to 6 periods
జరిగాక students అందరికీ batch wise 12.30 నుండి
2 వరకు lunch పెడతారు. పొద్దున్న break fast కి first వెళ్ళిన
batch మధ్యాహ్నం lunch కి first వెళుతుందనమాట...ఆ ఘోరాతి ఘోరమైన items
నాకిప్పుడు గుర్తు రావడం లేదు. వదిలెయ్యండి.మధ్యాహ్నం మళ్ళీ classes. evening 5 కి break.
కొంచెం brick color లో ఉన్న ఒక drink ( మా
వాళ్ళందరూ దాన్ని tea అనేవారు)...ఒట్టిగడ్డికి, పచ్చగడ్డికి మధ్యలో
ఉండే రెండు పదార్ధాలు ( కొంతమంది biscuits అనేవారు) పెట్టేవారు. అవి తినేసి గబగబా
room కి వెళిపోయి fresh అయిపోయి మళ్ళీ 6 కల్లా
study hour లో కూర్చోవాలి. Up to 11 study hour. తల
ఎత్తినా, పక్కవాడితో మాట్లాడినా తోలు తీసెయ్యడానికి దున్నపోతుల్లాంటి in
charges study hour అంతా తిరుగుతూనే ఉంటారు.11 కి
రూమ్ కి వెళ్ళాక డ్రెస్ change చేసుకుని పడుకోడానికి పావుగంట టైం.11.15
తర్వాత ఎవరి room లో lights
వెలిగితే వాళ్లకి 50 rupees fine. మనకేమన్నా పని ఉంటే candles
వెలిగించుకుని చేసుకోవాలి. మళ్ళీ పొద్దున్నే 5 కి లెండి లెండి అని జంతువు అరుపులు
....ఇది 2 years పాటు schedule..Freedom,
enjoyment అసలు ఇలాంటి పదాలు సమస్యే లేదు. Read, revise, exam, marks,
punishment...ఇవే మాటలు..
*******************
నెమ్మదిగా నాకు , సంఘమిత్ర కి దూరం పెరిగిపోయింది. ఎప్పుడన్నా breakfast కో , మెట్ల మీదో కలిస్తే ఊరికే నవ్వుతో పలకరించుకునే వాళ్ళం. అంతే. careful గా observe చేస్తే ఆ టైం లో కూడా సంఘమిత్ర ఏదొకటి మననం చేసుకుంటూ ఉండేవాడు. ఓసారి ఎందుకో అడిగా ఏంటి సంఘమిత్రా గోల్ అని ....neurologist అన్నాడు...and you deserve that అన్నాను..
*******************
ఎందుకో తెలీదు. join అయిన ఒక నెల తర్వాతే నాకు ఆ education system అంతా trash అనిపించింది..(బళ్ళో బలవంతంగా కూర్చోబెట్టి మెడలు వంచి వంకర గీత మీద వంద సార్లు గీయించి నేర్పించే విద్యా ఒక విద్యేనా అని చలం అంటాడు చూసారా ..అలంటి feelings అనమాట )..అసలు రెండు సంవత్సరాల తర్వాత మెడ పని చేస్తుందా అనుకునేవాణ్ణి అస్తమాను పుస్తకాల్లో తలలు పెట్టుకుని పక్కన బ్రహ్మాండం బద్దలయినా పట్టించుకోని వాళ్ళని చూసి...వెంటనే ఇంటికి phone చేసి నన్ను తెసుకెళ్ళి పొండి. ఇక్కడ నేను చదవలేను. ఇంటి దగ్గర కాలేజీ లోనే చదివి డాక్టర్ అమ్మ మొగుణ్ణి అవుతాను అని చెప్పాను. అలా చెప్పిన వారం రోజులకి మా నాన్న, మొదటి రాత్రి జరిగిన రెండో రోజే మొగుడు చచ్చిన పుణ్య స్త్రీలా మొహం వెళ్లాడేసుకుని, కూడా ఒక పెద్ద మనిషిని వెంటబెట్టుకొచ్చాడు.
ఆ
సగటు పెద్ద మనిషి నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని నీతి వాక్యాలు చెబుతూ, అసలు శ్రీచైతన్యలో
నేను ఎందుకు చదవాలో, డాక్టర్ అవ్వవలసిన ఆవశ్యకత దేశానికి ఎంత ఉందో, మా నాన్న నన్ను
కనడానికి ( ఈ మాట గమనించాలి మీరు ), పెంచి పెద్ద చెయ్యడానికి ఎన్ని వ్యయ ప్రయాసలు
కోర్చాడో వివరించి నా cerebrum మీద ఉన్న grey matter సగం పైగా
తినేసాడు.. వెంటనే జ్ఞానోదయం కలిగినట్లు నేను ఒప్పుకోకపోతే ఆ జ్ఞాన బోధ ఆగదన్న
విషయం గమనించి వెంటనే బుద్ధుడిలా మొహం పెట్టి “ ఇక్కడే ఉండి బాగా చదువుకుంటానండి “
అని భక్త ప్రహ్లాదుడంత వినయంగా చెప్పాను...
****************
నాకున్న గొప్ప వరం, ఎలాంటి వాళ్ళనయినా వెంటనే ఫ్రెండ్స్ చేసేసుకోవడం. అంతకన్నా పెద్ద శాపం అంతే త్వరగా వాళ్ళని పోగొట్టేసుకోవడం. చాలా త్వరగా నాతో పాటు ఆఖరి benches లో కూర్చునేవాళ్ళందరూ నాకు friends అయిపోయారు. నా కూనిరాగాలు పైకి పాడితే మంచి పాటలని జనాలు తెలుసుకున్నారు. కొద్దిగా gap దొరికినా చాలు పాటలు పాడేసుకునే వాళ్ళం. మా అల్లరి కొందరు enjoy చేస్తే కొందరు చిరాకు పడేవారు. ఆ చిరాకు పడే వాళ్ళ శాతం చాలా తక్కువ ఉండడం వల్ల complaint ఇచ్చే ధైర్యం చేసేవారు కాదు. so నెమ్మదిగా నేను entertainer అయిపోయాను.
సాధారణంగా తెలుగు మీడియం పిల్లలు తెలివైన వాళ్ళు , కళాపోషకులు కూడా ఉంటారు. ఎందుకంటే చదువొక్కటే కాదు ఆటలు, పాటలు అన్నీ ఉంటాయ్ వాళ్ళ జీవితంలో. చాలా English medium schools లో కనీసం ఆడుకోవడానికి play ground కుడా ఉండదు. ( అలాంటి school లో join చేసే parents అందరికీ ఒక చిన్న శిక్ష వేస్తే చాలు, ఆ పసి హృదయాల బాధ తెలుస్తుంది. అదేమిటంటే ఒక కుర్చీలో కాళ్ళు, చేతులు కట్టేసి ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చోబెట్టడం. toilet అన్నా, water అన్నా కళ్ళు యెర్ర జెయ్యడం). కాబట్టి మొదటి రోజు ఏదో చదివేద్దాం అన్న తపనతో classes తెగ వినేసినా నెమ్మదిగా చిరాకు పుడుతుంది. అలా పుట్టిన వాళ్ళ సంఖ్య నెమ్మదిగా పెరిగి , దానితో పాటు class లో ఆఖరి benches కి demand పెరిగింది. నా place మాత్రం నేనేప్పుడు వెళ్ళినా అలాగే ఉండేది. ఎందుకంటే entertainer నేనేగా మరి. .campus లో Walkman, mobile, అసలు any entertaining article not allowed. కనీసం దూరంగానన్నా ఒక్క cinema పాట కూడా వినబడదు( అన్నమయ్య తప్ప)..so జనాలు నా తింగరి గీతాల్నే బాల మురళీ కృష్ణ మధుర గేయాల్లా feel అయ్యేవారు. చప్పట్లకి, పొగడ్తలకి పడిపోని కళాకారుడెవడు చెప్పండి. నేను రెచ్చిపోయి నా సినిమా సంగీత పరిజ్ఞానాన్నంతా వాళ్ళ ముందు ప్రదర్శించేవాణ్ణి..ఇది class rooms లో, అదిన్నూ కేవలం sir class లో లేని time లో , interval లో , breaks లో మాత్రమే కుదిరేది.. కేవలం పాటలు పాడుకోవడానికి, అరగంట తినాల్సిన భోజనం పది నిముషాల్లో ముగించి వచ్చేసే వాళ్ళం..ఇంత అల్లరి మేము చేస్తుంటే, దాన్ని ఎంజాయ్ చేస్తూనే , ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా ముందు bench లో కుర్చోనేవాడొకడు. వాడే కట్టా. ఆదిత్య ప్రియతమ్..( campus లో ఉన్న 850 మంది students లో జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకోబోయే ఒకే ఒక్క స్నేహితుడు , చిరకాల స్నేహితుడు వాడొక్కడే అన్న విషయం నాకప్పుడు తెలియదు.
****************
జాయిన్
అయ్యాక మొదటి నాలుగు నెలలు తెలంగాణ అర్ధం చేసుకోడానికి నేను పడ్డ బాధలు అన్నీ
ఇన్నీ కావు...రూమ్ లో ఆదిలాబాద్ నుంచి వచ్చిన సంపత్ గాడు ఉండేవాడు....వాడు జాయిన్
అయిన రెండో రోజు గోదావరి వాళ్ళం అందరం మాట్లాడుకుంటుంటే sudden గా లేచి “
సప్పిడేకా వండుకోండి రా వయ్” అన్నాడు...ఎంత బుర్ర బద్దలు గొట్టుకున్నా మాకది అర్ధం
కాలేదు...నేను వాణ్ణి లేపి దాన్నొక పుస్తకం మీద రాయమన్నాను...అయినా ఫలితం
శూన్యం..వాడు క్లియర్ గా పడుకోండి అని చెప్పాడు గానీ , వాడు అన్న ఆ మాట మొత్తం
అర్ధం చేసుకోవాలన్న interest తెగ పెరిగిపోయింది నాకు...తరువాత తరువాత నాకే
అర్ధమయ్యింది....ఇంతకీ అదేంటయ్యా అంటే “చప్పుడు చెయ్యకుండా పడుకోండి రా బయ్” class
లో శ్రీకాకుళం వాళ్ళు ఉండేవారు...వీళ్ళు ఇంకొక రకం....పైన ఉంది అనకుండా మీదనుంది
అనడం...లేకపోతే సారు నాక్కొట్టేసాడు అనడం నన్ను కొట్టేసాడు అనడానికి...బూతు రా అంటే వినరు...భరించలేక
పోని తెలుగు నేర్పిద్దామంటే, మేము మాట్లాడేదే అసలైన తెలుగు అని గొడవలు....అబ్బో
భలే ఉండేది లే....నేను మరీ ఉడికించేసే వాణ్ణి.....ఏ హీరో రా సప్పిడేకా వండుకో
అనేది అని......రాయలసీమ వాళ్ళది కాస్త యాస ఉన్నా ఏదో royalty ఉండేది...కాకపొతే
ఒకోసారి మరీ నాటుగా “ బిడ్డని ఇంటికి తోలుకుపోతున్నాం” అనేవారు... అది కాస్త
ఇబ్బందిగా ఉండేది...
***************
ఇంతలో September 5th వచ్చింది. గురుకుల దినోత్సవం చాలా grand గా చేయడం శ్రీ చైతన్య management కి అలవాటు. august 15th నుంచే హడావుడి మొదలుపెట్టారు. Anchors, singers, dancers కోసం selections ప్రారంభం అయ్యాయి. నా కున్న inferiority complex వల్ల నేను participate చేయనన్నాను. కానీ అప్పటికే నాకు die hard fans అయిపోయిన నా తెలుగు to ఇంగ్లీష్ మీడియం దోస్తులు నన్ను బలవంత పెట్టి selections కి తీసుకువెళ్ళారు. ఇంగ్లీష్ sir చేస్తున్నారు selection. నన్ను వెంటనే OK చేసారు. మంచి song ఒకటి practice చేసుకోమని చెప్పారు. మా friends అందరు రకరకాల songs suggest చేసారు గానీ without music జనాలు వినగలిగిన పాట కోసం నేను వెతికాను. September 5th వచ్చేసింది. చాలా భారీగా చేసారు arrangements. మాకు doctor Ramesh (famous cardiologist) ని chief guest గా పిలిచారు. అశోక్ నగర్ campus వాళ్ళు యండమూరి ని పిలిచారు. Ramesh gaaru busy doctor కాబట్టి just 5 minutes మాట్లాడి వెళ్లిపోయారు. తరువాత జస్ట్ 2, 3 speeches అయిపోయాక cultural start చేసారు. ముందు పాటలే మొదలెట్టాడు మా English sir. ఆయనకి best అనిపించిన వాళ్ళని ముందు పెట్టి కొంచెం నాసిరకం వాళ్ళని తరవాత పెట్టాడు. ఫస్ట్ సింగర్ ఏకంగా సంగీతం ఒక అయిదు సంవత్సరాలు నేర్చుకున్నవాడు...స్టేజి ఎక్కి శృతి సవరించుకుని పాడడం మొదలు పెట్టాడు. “ ఓ చెలియా నా ప్రియసఖియా” ..ఒక 15 seconds అందరూ బాగానే ఉన్నారు. ఇంతలో ఎవడో వెనకనుంచి చాలురోయ్ అన్నాడు. అంతే... నవ్వులు , వాటిని ఫాలో అయ్యి కేకలు, comments. ఇక వాడి గొంతు వినిపించకుండా అరవడం మొదలెట్టారు. ఈ దృశ్యం చూసి నెమ్మదిగా కాళ్ళు వణకడం మొదలెట్టాయ్. కానీ గుండె ధైర్యం చేసుకున్నా..పాపం వాడు మధ్యలోనే పాట ఆపి దిగిపోయాడు..రెండవ వాడు “ రావే నా చెలియా” అని మొదలు పెట్టాడు..వాడు పాటని ఖూనీ చేస్తున్న పద్దతిని చూసి అరిచి వాడిని కూడా దించేసారు..నా వణుకు కాళ్ళనుంచి వెన్నులోకి పాకి ఇంక నేను వెళ్ళకూడదని fix అయిపోయాను. వీళ్ళు ఎవడు పాడడానికి వెళ్ళినా దించెయ్యడానికి fix అయిపోయారు..తరువాత ఇద్దరిదీ కూడా అదే పరిస్థితి. అయిదవ వాణ్ణి నేను. పేరు announce చేసారు..వెళ్ళకుండా దాక్కుందామని కుర్చీలోంచి కిందికి దిగేసి కూర్చున్నా..కానీ నా వీరాభిమానులు ఊరుకోలేదు..చేతులతో ఎత్తుకెళ్ళి స్టేజి మీద పారేసారు. ఎదురుగా మొహం మీద పడుతున్న పెద్ద flash లైట్స్. ఆ పెద్ద flash lights కి ఎదురుగా ఏమున్నదీ అసలు స్పష్టంగా కనబడడం లేదు. తేరిపార చూస్తే అదొక జన సముద్రం లాగా ఉంది. 850 మంది students. 100 మంది teaching అండ్ non-teaching staff. college Building, apartments మధ్యలో ఉండడం వల్ల apartments లో ఉన్న జనం చూస్తున్నారు.. in fact వాళ్ళందరూ ఇంకో ద్రౌపది వస్త్రాపహరణ కోసం ఎదురు చూస్తున్నారు. శరీరంలో అన్ని భాగాలు వణికిపోతున్నాయ్....గట్టిగా పట్టుకోవడం వల్ల mic కూడా.నేను select చేసుకున్న పాట సుబ్బు సినిమాలోది. పాట starting లో dear friends do you hear me? అని ఉంటుంది.. అన్నాను. వెంటనే అందరు No…… అన్నారు. Next do you love me? అనాలి...అదంటే ఇంకా ఏం వినవలసి వస్తుందోనని భయం వేసి అనలేదు. Next do you love your mummy and daddy అన్నాను.. దానికి మంచి response వచ్చింది. పాట మొదలు..మొదలెట్టిన కాసేపటికి కింద గోల మొదలయ్యింది.నేను ఆపలేదు. నెమ్మదిగా ఏడుపొచ్చేసింది. అది పాటలో mix అయిపొయింది. Correct గా పాటకి కావలసింది కూడా అదే emotion. so అందరూ silent అయిపోయారు.. అక్కడ ఒక్క నా గొంతు తప్ప ఇంకేమీ లేదు. కళ్ళు తెరవకుండా పాడేసాను. పాట ending లో I love my India అని వస్తుంది....ఒక five times. అది chorus ఉంటుంది...chorus లేదు కాబట్టి నేనే పాడుకోవాలి...కానీ chorus వచ్చింది...మొత్తం అక్కడ చూస్తున్న ప్రతీ వాళ్ళు నాకు chorus ఇచ్చారు....ఆ తరువాత అయిదు నిముషాల పాటు చప్పట్లు కొడుతూనే ఉన్నారు...ఉద్వేగం ఆపుకోలేక ఏడ్చుకుంటూ కిందకి దిగేసాను.. నా తెలుగు మీడియం batch అంతా వచ్చి నన్ను గాల్లోకి ఎత్తేసారు. ఇక ఆ తరువాత వేరేవాడికి chance లేదండి.. జనాలదరు మోహన్ మోహన్ అని అరవడం మొదలు పెట్ట్టారు. రెండవ సాంగ్ “ ఎవెట్టి చేసాడే ముద్దుగుమ్మ” అందరు టి టి టి టి అని full enjoy చేసారు.. ఇక నాకు భయం పోయింది....full confidence తో రెచ్చిపోయాను...వరసగా నాలుగు పాటలు ..overnight college famous singer అయిపోయాను...అందరు నా room కి వచ్చి మరీ wish చేసి వెళ్ళారు...(కానీ ఆ రాత్రే తరువాత నా పాలిట శాపం అవుతుందని నాకు తెలీదు.
****************
Every week
end అంటే Sunday morning exam ఉంటుంది. ఆ papers JLs correct చేస్తారు....ఈ
వారం exam జరుగుతుండగానే next week exam syllabus బయట display
చేస్తారు....కొన్ని సార్లు వారంలో ఇచ్చిన syllabus complete
అవ్వదు..అందుకని lecturers Saturday night 11 వరకు special
classes తీసుకుని syllabus complete చేసేవారు...ఆ lessons next day
early in the morning exam లో వస్తాయన్నమాట. ఇంకెప్పుడండి చదివేది...night
11 వరకు వాయించారు. అప్పటికే బుర్ర వాచిపోయి ఉంటుంది. exam కి
చదువుకోనివ్వకుండా class పెట్టారు...అంటే students ని ఏం
చెయ్యమని అసలు. పాపం ఇంకా పూర్తిగా అన్నీ చదవని, అప్పుడే complete అయిన
ఆ lessons కూడా వదలకూడదని కసిగా ఉన్న పిల్లలు, room కి
వెళ్ళాక మళ్ళీ చదువు మొదలు పెట్టేవారు. room లో
light వెయ్యకూడదు. ఒక వేళ charging light, candle
లాంటివి పెట్టి చదువుదామన్నా నాలాంటి వెధవ ఊరుకోడు.. అందుకు ఏం చేసేవారో
తెలుసా..చివర అందరికీ ఉన్న common bathrooms లోకి
వెళ్ళిపోయి bucket తిరగబెట్టి దాని మీద కూర్చొని చదువుకునేవారు..
నాకు మాత్రం అంత కష్టపడి చదవాలంటే చిరాకు కాబట్టి చక్కగా పడుకునే వాణ్ణి...ఎందుకంటే
ఆ రోజు నాకు programme (తరువాత తెలుస్తుంది) ఉండదు..exam లో
నాకు answers తెలిసినా రాసేవాణ్ణి కాదు. ఎందుకంటే every
week end progress card ఇంటికి పంపిస్తారు. అన్నీ సున్నాలున్న నా progress
card చూసి మా నాన్న మొహం లో వచ్చే expressions చూడడం
అంటే నాకు చాలా ఇష్టం..
********************
exam లో college top 10 వచ్చిన వాళ్ళ పేర్లు బయట notice board లో పెట్టేవారు. అందులో సంఘ మిత్ర పేరు definite గా ఉండేది. తరువాత top hit list ( అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలంటే college మొత్తానికి అతి పెద్ద ఎదవలు) ..ఇందులో మన పేరు ఖచ్చితంగా ఉండేది…exam exam కి section shuffling ఉంటుంది. మంచి marks వస్తే పై sections కి, చెత్త marks వస్తే కింద sections కి వేసేవారు. Half yearly తర్వాత T-1, T-2 sections తీసేసారు..only M-1 to M-12 మాత్రమే ఉండేవి. మా telugu medium వాళ్ళు అన్ని sections కి పంచబడ్డారు...కొందరు ఏకంగా M-1 కి వెళిపోయారు. నేను మొదట M-6 కి , చివరి రోజులోచ్చేసరికి M-12 కి వెళిపోయాను. అబ్బో M-12 లో students ఉంటారండి. వర్ణనాతీతం అసలు. పుర్తిగా A,B,C,D లు అన్నీ రాయమని assignment ఇస్తే ఖచ్చితంగా మధ్యలో మూడో నాలుగో వదిలేస్తారన్నమాట. ఆ class కి వచ్చే sirs జేబుల్లో ఎప్పుడు ఒక asprin tablet, ready గా ఒక glucose biscuit packet ఉండేది.. నేను మాత్రం full enjoy చేసేవాణ్ణి. ఎక్కడున్నా మనం పాటలేగా...in charge మురళీ కృష్ణ అని ఒక చండశాసనుడు ఉండేవాడు. వాడు నన్ను కొట్టని, సారీ చావగొట్టని రోజు లేదు...పైగా ఏరా అంత పెద్ద పాటలు గుర్తుంటాయి..చదువు ఎందుకు గుర్తుండడం లేదు..అని మరీ కొట్టేవాడు.
ఎప్పుడన్నా holidays ఇచ్చినా నాకు ఇంటికి వెళ్ళడం అంత interest ఉండేది కాదు. ఎందుకంటే కొంపలేవో మునిగి పోయినట్టు ఇంటి దగ్గర కూడా చదవమంటాడు మా పిత్రువర్యులు.....పైగా నా సున్నాల progress cards చూపించి దేభ్యం మొహం పెట్టి క్లాసులు పీకడం...ఇవి భరించడం కన్నా hostel better అని feel అయ్యేవాణ్ణి....శ్రీచైతన్య లో మేము చేసిన గొప్ప గొప్ప పనుల గురించి కొన్ని వివరాలు....
- నేను ఒక singer అని college అంతా fix అయిపోయాక నాకు demand పెరిగిపోయింది. రోజూ సాయంత్రం study hours లో ఎవరో ఒక room batch నా దగ్గరికి వచ్చేవారు. ఆ రోజు రాత్రి వాళ్ళ room లో పాటలు పాడాలన్నమాట...అందుకు ప్రతిగా వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకున్న sweets పెట్టేవారు and next outing కి సినిమా ల ఖర్చు వాళ్ళదే.....రాత్రి study hour అయిపోయాక 11 కి వాళ్ళ రూమ్ కి వెళ్లి 2.30 వరకు వాళ్ళని పాటలు పాడి అలరించాలనమాట...October నుండి January వరకు ఒక్కరోజు కూడా నా dates ఖాళీ లేవు. February తర్వాత అందరికీ exam fear పట్టుకుంది.. పుస్తకాలు పట్టుకున్నారు. నన్నొదిలేసారు.
- ఈ రాత్రి పాట కచేరీల వల్ల నిద్ర చాలక పొద్దున్న late గా లేవడం , class లో last bench లో పడుకోవడం ఎక్కువయిపోయింది. ఇక చదువంటారా అవే సున్నాలు. teachers, incharges నన్ను కొట్టి అలిసిపోయి చివరికి బ్రతిమాలడం మొదలెట్టారు. నచ్చిన lecturers subject class first వచ్చేసి మిగిలినవి మళ్ళీ సున్నాలు..
- ఒక రోజు ఉదయం 5 కి లేవలేదు...పైన terrus మీద పడుకున్నా ఎందుకో ఎవరికీ కనబడకుండా.పైగా ఎవరికీ చెప్పలేదు.....నిద్ర లేచేసరికి 7...అక్కడ first period కూడా అయిపోయి ఉంటది....మొత్తం ఒళ్ళంతా తడిసిపోయింది..మిగిలినవి తరవాత చూద్దామని మొహం కడుక్కుని కిందకి వెళిపోయా..Silent గా class లోకి దూరేద్దామని ప్రయత్నించి in charge మురళి కృష్ణ కి దొరికిపోయా...ఇక ఆ తరువాత scene కి, ఒకసారి మీరు భాషా సినిమా గుర్తు తెచ్చుకోవాలి..చుట్టూ classes జరుగుతుంటే ఒక light pole కి నన్ను చేతులు వెనక్కి లాగి కట్టేశాడు..మధ్యాహ్నం వరకు అదే punishment...(వర్షం effect ఒకటే తక్కువ)...కాలేజీ లో ఉన్న 850 మంది నన్ను చూసేసారు అన్న నమ్మకం కుదిరాక వదిలాడు...·
·
· 2003 లో world cup జరిగింది గుర్తుందిగా...అప్పటికి cricket అంటే మహా పిచ్చి....కనీసం అంత పిచ్చి ఉన్నట్టు నటించేవాణ్ణి...ఎందుకంటే ఆరుగొలను లో మాకసలు టీవీ చూసే అవకాశమే లేదు..Correct గా exams time లో వచ్చింది world cup. champus లోకి చిన్న విషయం కుడా బయట నుంచి వచ్చేది కాదు....అన్ని match లు ఎలా ఉన్నా పాకిస్తాన్, ఇండియా semi-final match కి మాత్రం అందరికీ నరాలు తెగిపోయాయ్...ఏం జరుగుతుందో తెలియదు......ఇదంతా ముందే ఉహించిన నేను ముందు సారిచ్చిన outing లో చిన్న transistor కొన్నాను. ఆ రోజు study hour మహా strict గా ఉంది...మ్యాచ్ కోసం ఎవడన్నా బయటికెళ్ళినా, చదవడం మానేసినా, చంపెయ్యమని high command orders....దున్నపోతులు అటు ఇటు తిరుగుతున్నాయ్.తెల్లారితే zoology exam...పిల్లలకి exam, cricket రెండు tensions కలిసొచ్చాయి పాపం...నాకు cricket ఒక్కటే....నెమ్మదిగా transistor on చేసి జేబులో పెట్టాను...ear phone ఒక్కటి మాత్రం చొక్కాలోంచి లాగి, full hands shirt చేతి చివరికి లోపల నుంచి వచ్చేట్టు set చేసాను....so చివరికి ear phone end piece మాత్రం వస్తుందనమాట....ఎవరన్నా వస్తే లోపలికి గేంటేయొచ్చు...లేకపోతే చదువుకున్నట్టు act చేస్తూ నెమ్మదిగా చెవికి ఆన్చి వినొచ్చు....దొరికితే మరణ దండన ఖాయం....study hour లో sitting arrangement ఎలా ఉంటుందో తెలియాలంటే కొత్తబంగారు లోకం సినిమా చూడండి...నేను 5 minutes కి ఒకసారి score pass చేసేవాణ్ణి....అది next 5 minutes లో campus అంతా వెళిపోయేది....but అంతా సైగల ద్వారానే.....ఇండియా గెలిచింది అన్న మాట radio లో వినగానే control చేసుకోవడం నా వల్ల కాలేదు...win అనేసాను. correct గా అదే time కి break bell మోగింది..అందరు అరుపులు, కేకలు. Plates, planks, chairs, books అన్నీ విసిరేసుకుంటూ గాల్లోకి papers ఎగరేస్తూ గోల .అది ఒక 20 minutes continue అయ్యింది. విజయవాడ లో పేల్చిన టపాకాయల sound కూడా మాకు వినబడలేదు....అంతా చిందరవందర...ఎవరూ ఆపడానికి కూడా tri చెయ్యలేదు....తరువాత మళ్ళీ study hour start....మురళి కృష్ణ, అప్పుడిచ్చే punishment అందరికీ గుర్తు ఉండిపోవాలని కాలేజీ లో కరుడు గట్టిన వెధవల్ని 10 మందిని select చేసాడు...అందులో topper ని ఈ పాటికి మీరు guess చేసారని నాకు తెలుసు....వరుసగా మోకాళ్ళు వేయించాడు....ఇప్పుడు విక్రమార్కుడు సినిమా గుర్తు చేసుకోండి..railway station లో రవితేజ కొట్టే scene...
**********
ముఖ్యమైన విషయం ఒకటి మాట్లడుకోట్లేదు ఇందాకట్నుంచి.....అప్పటికి మాకు గొంతులు మారిపోయి 3 సంవత్సారలయ్యింది...ప్రస్తుత సినిమాల ప్రకారం ప్రేమించే వయసొచ్చేసింది అన్నమాట...endocrine system తన పని తాను సక్రమంగా చేస్తుంటే సగటు కుర్రాడి పరిస్థితి ఆలోచించండి…room లో ఏ ఐశ్వర్య రాయ్ బొమ్మో అంటించుకుని తృప్తి పడదామన్నా ఆ అవకాశం కుడా ఇచ్చేవారు కాదు దుర్మార్గులు..ఒట్టి ఊహలే....ముఖ్యంగా అప్పుడు మాకొచ్చే మొదటి ఆలోచన ladies hostel ఎలా ఉంటుందా అని..Fantasy ల కి అయితే హద్దు పద్దు ఉండేది కాదు....
అమ్మాయిల దగ్గర, మా దగ్గర కూడా పని చేసే lecturer నన్ను ఒకరు దగ్గరికి పిలిచి next outing కి ఇంటికి రమ్మని...అక్కడికి వెళ్ళాక నాలాగే ఇంటికి పిలిచిన మరో అమ్మాయిని పరిచయం చేసి....”ఈ వయసులో ఉండే బాధలు నాకు తెలుసు" అని అంత పెద్ద ఇల్లు మాకు వదిలి వెళ్లిపోయినట్టు.....
ఒక రోజెందుకో, నేను ఒక రాత్రి నిద్రలోనే వంద యుగాలు తపస్సు చేస్తే ఎవరో దేవుడు ప్రత్యక్షమై నాకు రొజూ రాత్రి, ప్రపంచంలో ఏ అమ్మాయిల hostel కైనా రాత్రి పూట ఎవరికీ కనబడకుండా వెళిపోయే శక్తిని ఇచ్చినట్టు...
మా campus receptionist, మనీ ఆర్డర్ ఇవ్వడానికి పిలిచినప్పుడు సైలెంట్ గా ఒక చిన్న వైట్ పేపర్ మీద తన ఇంటి address రాసి ఔటింగ్ రోజు రమ్మన్నట్టు...
అబ్బో ఇంకా బోలెడు......
వెళ్ళక, వెళ్ళక బయటికి ఔటింగ్ కి వెళ్ళేవాళ్ళమేమో.....road మీద, theater లోనూ, market లోనూ , shopping mallsలోనూ కాస్త రంగులు రంగులు గా ఎవరు కనబడ్డా....salivary glands brain control లో ఉండేవి కాదు......
*****************
Inter first year exams అయిపోయాయ్....సంవత్సరం అంతా సున్నాలు తెచ్చుకున్నా last exams నా జీవితం కాబట్టి బాగా రాసాను నా style లో... second year కొత్త campus ఇచ్చారు..మళ్ళీ అన్నీ కొత్త sections...Marks ని బట్టి divide చేసారు.....నేను ఏకంగా M-3 కి వెళ్ళిపోయా....M-1 to M-5 special block లో ఉండేవి.. అక్కడ నేను వెళ్లి క్లాసు లో కూర్చునే సరికి జనావాసాల్లోకి తప్పి పోయి వచ్చిన అడవి జంతువుని చూసినట్టు చూడడం మొదలెట్టారు...నాకన్ని marks ఎలా వచ్చాయో ఎవరికీ అర్ధం కాలేదు. సొంతగా తెచ్చుకున్నానని మాత్రం ఎవరూ నమ్మలేదు...botany ఏకంగా 60 కి 59 వచ్చేసరికి మా M-12 botany sir ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.....in charge మురళీ కృష్ణ ఒకసారి నా marks మళ్ళీ verify చేసాడు....చివరికి తప్పక M-3 లో ఉంచారు....
M-3 లో అసలు ఏం lecturers అండి ....ఒక chemistry sir వచ్చారు...అందర్నీ 5 నిముషాలు కళ్ళు మూసుకోమన్నాడు ..తెరిచేసరికి board మీద periodic table ఉంది..నేనైతే spell bound అంతే.....కానీ నాకా atmosphere పడలేదు....gap లో కూడా పక్కోడితో మాట్లాడరండి జనాలు, మన పాటలు, గీతాలు జానతా నయ్ ......ఇక hostel విషయానికి వస్తే M-1 to M-5 వాళ్లకి ఇవి కుడా special...చాలా బావుండేవి...కానీ అస్తమాను ఆ పుస్తకాల్లోనే ఉండి, కాస్త కూడా రసస్పందన లేని over నాగరిక అనాగరికుల మధ్య నేను ఉండలేక పోయేవాణ్ణి....
Second year లో సంఘమిత్ర మా campus కాదు....అశోక్ నగర్ campus...22 branches లో ఉన్న్న best students ని తీసుకుని second year లో అశోక్ నగర్ campus లో special treatment ఇస్తారు....state and national rankers ని తయారు చేసే factory అది...నేను మాత్రం మళ్ళీ exams రాయకుండా సున్నాలు తెచ్చుకుని నెమ్మదిగా నా పాత friends దగ్గరికి అంటే M-12 కి వెళ్ళిపోయా...ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలి నేను, మా batch అందర్నీ మా గణపతి సర్ భలే తిట్టేవాడు.....అందులో మచ్చుకి ఒక్కటి..
ఒరేయ్ వెధవల్లారా....
గుడ్డివాడికి చంద్రోదయం...
చెవిటివాడికి శంఖాల ధ్వని,
నపుంశకుడికి స్త్రీ వాంఛ,
మీకు చదువు అవసరమా అని...
చెవిటివాడికి శంఖాల ధ్వని,
నపుంశకుడికి స్త్రీ వాంఛ,
మీకు చదువు అవసరమా అని...
ఆయన చేత తిట్టించుకోడానికి ఇంకా ఎక్కువ అల్లరి చేసేవాణ్ణి నేను...
ఏంటో పప్పులు, వాళ్ళ మాటలు, తిట్లు, of course వాళ్ళ అమ్మాయిలూ అంటే నాకెందుకో వల్లమాలిన అభిమానం....
*******************
నాకు మహాప్రస్థానం మీద అంత పిచ్చి పెరగడానికి ఈ కాలేజే కారణం....అక్కడ ఆరుగొలను లో రూపాయి మిగులుతుందని బస్సు ఎక్కకుండా కిలో మీటర్లు నడిచే జనం..ఇక్కడ జీవితంలో ఒక్కసారి కూడా కారు తప్ప మరింకేది ఎక్కని జనం....అక్కడ ఒక ప్లేట్ బజ్జీ తినడానికి కూడా లేని జనం ....ఇక్కడ ఒక్క ఔటింగ్ లో D.V.Manor హోటల్ లో వేలు వేలు తిని వచ్చే జనం....ఒక్క రోజు snacks ఖర్చు 100 minimum......
ఈ వ్యత్యాసాలు చూసాక శ్రీశ్రీ “సంధ్యా సమస్యలు ” ఎన్నో సార్లు చదివాను.....ఈ సందర్భంగా చెప్పక తప్పదు.
ఆ సాయంత్రం.....
రాక్సీలో నార్మా షేరర్,
బ్రాడ్ వే లో కాంచన మాల
ఎట కేగుటో సమస్య తగిలిం
దొక విద్యార్ధికి !
ఉడిపి శ్రీ కృష్ణ విలాస్ లో
అటు చూస్తే బాదం హల్వా
ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ
ఎంచుకునే సమస్య కలిగిం
దొక ఉద్యోగికి!
ఆ సాయంత్రం....
ఇటు చూస్తే అప్పుల వాళ్ళు
అటు చూస్తే బిడ్డల ఆకలి
ఉరిపోసుకు చనిపోవడమో,
సముద్రమున పడిపోవడమో
సమస్యగా ఘనీభవించిందొక సంసారికి!
**************
Second year M.Cet కాబట్టి జనాలందరూ serious గా చదవడం మొదలు పెట్టారు....no entertainments...no కచేరీస్....only studies....నా అభిమానులు నాకో Walkman కొనిచ్చారు....మరీ అలిసిపోతే latest songs పాడించుకునేవారు...second year లో నాలాగే machines లా చదవడం ఇష్టం లేని , రస స్పందన కలిగిన వాళ్ళమంతా ఒక batch గా form అయ్యాం....మా motto ఏంటంటే enjoy in hell also....ఓసారి Loyola college లో వేటూరి గారి సన్మానం జరిగితే దొంగచాటు గా వెళ్లి చూసి వచ్చి దొరికేసి చావు దెబ్బలు తిన్నాం....ఓసారి second show చూసొచ్చి కనకదుర్గ గుళ్ళో దర్శనం late అని చెప్పాం(batch లో ఒక్కడే hindu మిగలిన అంతా muslims, christians).....అలా second year కూడా అయిపోయింది....M.Cet కుడా అయిపోయింది.....పొరపాటున కూడా doctor అవకూడదని fix అయిపోయిన నేను..కనీసం పేపర్ కూడా చదవలేదు....last 5 minutes లో OMR లో ఉన్న చుక్కలన్నీ మంచి design లో ముగ్గేసి వచ్చేసాను.....సాయంత్రం exam అయిపోయి campus కి వచ్చాక తెలిసింది ఒక పిడుగు లాంటి వార్త...
***********
సంఘమిత్ర ని hospital లో admit చేసారు...అది some neurology hospital....ఎందుకో నాకు కూడా తెలీదు..అందుకే నేను, ఇంకో ఇద్దరూ friends కలిసి ఆటో లో వెళ్లాం చూడడానికి...ఏం జరిగిందో వాడితో పాటే M.Cet exam రాసిన ఒక అబ్బాయి చెప్పాడు...అశోక్ నగర్ campus కి వెళ్ళాక కూడా సంఘమిత్ర టాప్ 10 లో ఉండేవాడు...ఈ 10 మంది toppers ని separate section చేసారు..వాళ్లకి separate classes, separate exams...separate schedule..even separate food......వాళ్ళ కోసమే paper తయారయ్యేది...exam ఇంకా నెల ఉందనగా రోజుకి 20 hours చదివేవారట....exam కి వెళ్ళే రోజు శ్రీచైతన్య chairman B.S.Rao స్వయంగా వచ్చి వాళ్ళని wish చేసి exam కి పంపించాడు...exam start అయ్యింది....అయిన పది నిముషాలకి సంఘమిత్ర bench కేసి తల బాదుకోడం మొదలెట్టాడు..చేతిలో ఉన్న OMR sheet, question paper చించేసి పెద్ద పెద్దగా కేకలు వేసి ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోయాడు.....
డాక్టర్ ఏం చెప్పారంటే కనీసం ఆ అబ్బాయికి 3 years bed rest కావాలని...ఏమీ చదవకూడదని...అసలు brain మీద ఎటువంటి stress పెట్టకూడదని.....hospital లో వాడి మంచం పక్కన కూర్చుని ఏడుస్తున్న వాడి parents ని చూసి ముందు బాధ వేసినా...already చిన్నప్పట్నుంచి వాడి health కాస్త weak అని తెలిసినా, అలాంటి college లో join చేసి వాడి జీవితాన్ని వాళ్ళే చిదిమేసిన మూర్ఖత్వానికి, దురాశకి జాలి వేసింది......
No comments:
Post a Comment