అన్నీ తెలిసే నాకు...
ఎందుకో ఈ నిరర్ధకమైన నిరీక్షణ..
నీ ఎడబాటు రగిలించిన విలాపాగ్నులు కరిగించిన గుండె,
నెత్తుటి ప్రవాహమై ఏనాటికైనా నిన్ను తాకుతుందన్న తపన..
ఈ నిశ్శబ్ద నిశిలో ఎవరు వింటారు నా ఈ ఆవేదన...
అందుకే ఆకాశం వైపు తిరిగి చుక్కలు అదిరి పడేలా
అరిచి వినిపిస్తున్నా నా అరణ్య రోదన..
పదే పదే నిను చూపొద్దని విసుగెత్తి
మనసు అద్దాన్ని బద్దలు గొడితే,
తిరిగి వేయి ముక్కల్లోంచి నవ్వి నువ్వు నాకు మిగిల్చిందేమిటి..
కేవలం మనోవేదన..
అన్యులకర్ధమయ్యేది కాదు నా ఈ ప్రార్ధన
సృష్టి పుట్టినప్పుడు పుట్టి ఇంకా కొనసాగుతున్న
ప్రేమారాధన...
No comments:
Post a Comment