Friday 5 December 2014

కవి సంగమం # 37 #

# ఆఖరి మజిలీ # 

కొందర్ని ద్వేషిస్తావ్
ప్రత్యక్షంగానో పరోక్షంగానో

కొందర్ని అసహ్యించుకుంటావ్
అవసరంగానో అనవసరంగానో 

కొందర్ని కోపగించుకుంటావ్ 
కారణంగానో అకారణంగానో 

కానీ ఓరోజు
నీ లోపాలు నువ్వు గుర్తించగలిగిన రోజు
విశ్వమానవత్వానికి నిర్వచనం నీకు తెలిసిపోయిన రోజు
అసలు దైవత్వానికి అర్ధం బోధపడిన రోజు

అందర్నీ ప్రేమిస్తావ్
చిరునవ్వుతోనో చిన్న విసుగుతోనో
ఖచ్చితంగా ప్రేమను మాత్రమే ఇస్తావ్

ఆరోజు

మనిషిగా నిన్ను నువ్వు మలుచుకుంటున్న ప్రయాణంలో
ఆల్ మోస్ట్ ఆఖరి మెట్టుకు చేరుకున్నట్టే

3 comments:

  1. me kavithalu amogam కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవలి అనుకొంటె ఇప్పుడె చదవండి మీ Spice Andhra News

    ReplyDelete
  2. good content
    https://youtu.be/2uZRoa1eziA
    plz watch our channel

    ReplyDelete