(Note: ఇప్పటివరకూ “నా జీవితంలోంచి కొన్ని” లేబుల్ తో రాసిన
కధలన్నీ, జరిగిన వాస్తవానికి కాస్త కల్పన జోడించి వ్రాసాను..ఇది మాత్రం జరిగింది
జరిగినట్టు వ్రాస్తున్నాను....)
28/10/2012.....సాయంత్రం
6:15
శెట్టి పేట లాకుల దగ్గరనుంచి ఇంటికి తిరిగి నడుచుకుంటూ వస్తున్నా..( ఈ మధ్య Dieting, walking మొదలుపెట్టానులెండి.) Eric Segal రాసిన “ Only Love” బుక్ చదివా ఈ మధ్య...అందులో ఉన్న రెండు లైన్లు నాకు చాలా బాగా నచ్చాయి..
“ Time is the best healers of all”
“ Living well
is the best revenge”
నేను పాటిస్తున్నాను..కుదిరితే నలుగురికి చెప్తున్నాను...బాగా exercise చెయ్యడం ద్వారా, career మీద దృష్టి పెట్టడం ద్వారా, ఇష్టమైన పనిని ఎక్కువ సేపు చేస్తుండడం ద్వారా( నాకు పాటలంటే పిచ్చి) పాత జ్ఞాపకాల్ని మరిచిపోవచ్చు..అందుకని walking మొదలుపెట్టా...I-pod నిండా రెహమాన్, ఇళయరాజా పాటలు నింపేసుకున్నా ...
“షెహర్ మే హూ మే తేరే
ఆకే ముజే మిల్ తో లే
దేనా నా తు కుచ్ మగర్
ఆకే మేరా దిల్ తో తు లే లే జానా”
వినే కొద్దీ బావుండే ఈ పాట 130 వ సారి వింటూ, నన్ను నేను మరిచిపోయి, రోడ్ మీద walking చేస్తూ, అప్పుడప్పుడు డాన్స్ చేసేస్తూ వస్తున్నా...జనాలందరూ తేడాగా చూస్తున్నారనుకోండి..But I don’t care..నాకిది అలవాటే...ఇలా తన్మయత్వంలో ఉండగా నా ఫోన్ vibrate అయ్యింది...చూస్తే అక్క...
“ఏంటక్కా చెప్పు ?”
ఎక్కడున్నావ్?
“దగ్గర్లోనే ఉన్నా...ఇంకో 20 నిమిషాల్లో వచ్చేస్తా...”
సరే త్వరగా రా .
“ఎందుకు?”
ప్రసాద్ అంకుల్ కి సీరియస్ గా ఉందట...అమ్మ , డాడి
వెళ్లారు.. ఫోన్ చేసి మనిద్దర్నీ రమ్మన్నారు...
“ఓకే..”
నాలుగు రోజుల క్రితం ఒకసారి అమ్మ అంది....
“మోషే......(కంగారు పడకండి..ఇది నా అసలు పేరు)....నీకు ప్రసాద్ అంకుల్ గుర్తున్నారా?”
ఎవరమ్మా?
“బుట్టాయిగూడెం లో మన ఇంటి
వెనకాల ఉండేవారు కదరా.."
ఆ గుర్తుంది...కొంచెం లావుగా ఉండేవారు...డాడీ వాళ్ళ
డిపార్టుమెంటు కదా?
“అవును పాపం..ఈ మధ్య ఒంట్లో
బాగోవట్లేదట రా ఆయనకి..”
ఏమయింది?
“సంవత్సరం క్రితం బైక్ మీద
వెళుతుంటే ఆక్సిడెంట్ అయ్యిందట...ఒక నెల హాస్పిటల్ లోనే ఉన్నాడు...తరవాత
కొన్నాళ్ళకి స్కిన్ నల్లగా మారిపోవడం , weight తగ్గిపోవడం, చాలా వీక్
అయిపోయాడంట...ఇప్పుడసలు నోటిలోనుంచి మాట రావట్లేదు...మంచం మీదే అన్నీ...”
.................................
అక్క, నేను వెళ్లేసరికి అక్కడ చాలా మంది జనం ఉన్నారు...అమ్మ నన్ను లోపలికి తీసుకెళ్ళింది..మంచం చుట్టూ ఓ నలుగురు నుంచుని ఆయన్ని మాట్లాడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు...ఒంటి మీద చిన్న గ్యాప్ కూడా లేకుండా నల్లని మచ్చలు..కళ్ళు తెరిచి చూస్తున్నాడు అంతే...ఊపిరి కూడా సరిగా తీసుకోలేక పోతున్నాడు..అసలు గుర్తు పట్ట లేకుండా ఉన్నాడు ...100 కేజీలు ఉండాల్సిన మనిషి 50 కేజీలకి తగ్గిపోయాడు..నేను అలాంటి దృశ్యాలు ఎక్కువసేపు చూడలేను..అందుకే బయటికోచ్చేసాను...
బయట జనాలు రెండు groups డివైడ్ అయ్యి
మాట్లాడుకుంటున్నారు
Group: 1
మన చేతిలో ఏమీ లేదండి ఇంక
కానీ అలా చూస్తూ ఉండలేం కదా
..
ఏం చేయ్యగలమండి..విజయవాడ
హెల్ప్ హాస్పిటల్స్ కి తీసుకెళితే , ఎక్కడికి తీసుకెళ్ళినా వేస్ట్ అని చెప్పేసారు
..
Group: 2
ఇందులో మా బాబున్నాడు
మానవ ప్రయత్నం చెయ్యాలి
కదండీ
అన్నిటికీ దేవుడే
ఉన్నాడు..ఏదొక కార్యం చేస్తాడు ..
మా బాబు: ( నిమ్స్ కి
తీసుకెళితే శవాన్ని కూడా బతికించేస్తారండి)
నేను: ( ఏమంటాను
చెప్పండి...ఎన్ని బూతులు తిట్టుకున్నా మనసులోనే తప్ప బయటికంటే సభ్య సమాజం
హర్షించదు...అందుకే ఇక్కడ కూడా రాయట్లేదు)
మా బాబు నాతో: ఆదిత్య(
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో పని చేస్తున్నాడు...నా ఫ్రెండ్) కి ఒకసారి ఫోన్ చేసి
చెప్పరా ..వెళ్ళాక కాస్త దగ్గరుండి చూసుకుంటాడు.నువ్వు కూడా వెళ్ళాలి.మా అబ్బాయిని
పంపిస్తానని చెప్పాను..
నేను వెంటనే కాల్ చేయకుండా
సరితక్కని( ప్రసాద్ గారి వైఫ్) రిపోర్ట్స్ అడిగాను..లోపలికి తీసుకెళ్ళి చేతికి
ఇచ్చింది..చదివాను..
Diagnosis:
Pneumonia
Acute renal failure
Reactive for HIV
అప్పటి వరకు నాకు గాని, అక్కడ ఇంకెవరికి గానీ HIV పాజిటివ్ అని తెలీదు..చివరికి మా బాబుకి కూడా..అంత secret గా maintain చేసింది అక్క..బహుశా తెలిస్తే వాళ్ళ close relatives కి తెలిసి ఉండొచ్చు..
అక్కని పక్కకి పిలిచి
అడిగాను ..
“ అక్కా HIV పాజిటివ్ కదా” అని
“అవును తమ్ముడు లాస్ట్ ఇయర్ ఆక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్
ఎక్కించారు..అప్పుడు ఎవరో HIV ఉన్నవాళ్ళ బ్లడ్ ఎక్కించేసారు” అంది...
నేను అక్క సమాధానంతో satisfy కాలేదు..ఎందుకంటే
నాకు HIV గురించి కాస్త తెలుసు.
Four stages in HIV infected person
1.
Acute HIV
infection : Illness occurs in
individual when infected by HIV. Usually within 2 to 6 weeks. Person may have
flu like symptoms. This period is also called window period..
2.
Incubation
period: No symptoms, stage lasts
for about 3 to 5 years..
3.
HIV
positive symptomatic period :
Immunity decreases. Person gets symptoms like fever, loose motions, and skin
diseases..stage lasts for 2 to 3 years..
4.
AIDS stage: TB, incesent cough, severe weight loss,
diarrhoea, skin rashes..
ప్రసాద్ గారిలో లాస్ట్ స్టేజి లో ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయ్..అప్పుడు ఆదిత్యకి ఫోన్ చేసి చెప్పాను.... “ తీసుకొచ్చినా ఉపయోగం ఉండదు రా, డబ్బులు వేస్ట్” అన్నాడు..
మళ్ళీ అక్కని పిలిచి....
”
అక్కా లాస్ట్ ఇయర్ HIV వచ్చి ఉంటే అప్పుడే ఇంత సీరియస్ అవదు” అన్నాను ..
ఉన్నట్టుండి కళ్ళ నీళ్ళు
పెట్టుకుంది ..
అయిదేళ్ళ క్రితమే ఆయనకి HIV వచ్చింది తమ్ముడు..కానీ
సరిగా మందులు వాడలేదు..ఎవరితోనూ అనకు తమ్ముడు...
“కానీ అక్కా ....ఇప్పుడు
హైదరాబాద్ తీసుకెళ్ళినా ఉపయోగముండదు..”
ఆఖరి ప్రయత్నం చేద్దాం...పొతే
travelling charges పోతాయ్ అంతే కదా...
( ఆమెని చూస్తే ముచ్చటేసింది
నాకు...భర్త వేరొక ఆడదాన్ని చూస్తేనే చంపేసే ఈ రోజుల్లో, తప్పు చేసి రోగం తెచ్చుకున్నాడని
తెలిసినా, అది ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకున్నది పోగా ఇంకా బతికించుకోడానికి
తాపత్రయ పడుతుంది...నాకు వెళ్ళాలని లేకపోయినా ఆమె మొహం చూసి వెళదామని
నిర్ణయించుకున్నాను..)
ఒక గంటలో ambulance మాట్లాడి
బయలుదేరం...అక్క, department లో పని చేసే ఒకాయన్ని(john) కూడా రమ్మని అడిగింది..ఆయన
వస్తానన్నారు...ఆయనకో 45
సంవత్సరాలుంటాయి..ప్రసాద్ గారూ, ఆయన మంచి ఫ్రెండ్స్ అంట..
నేను , సరితక్క , జాన్ గారు,
డ్రైవర్, పేషెంట్ బయలుదేరాం...వాన్ బయలుదేరే వరకు నాకు భయమే.. నన్నెక్కడ
కుర్చోమంటారని..ఎందుకంటే ambulance లో వెనక కుర్చోవడమంటే నరకం..అదీ తెల్లవార్లూ..లక్కీ గా
నన్ను డ్రైవర్ పక్క సీట్లో కూర్చోమన్నారు..వెనక సరితక్క, జాన్ గారూ
కూర్చున్నారు...కొంతమంది చుట్టాలు మొసలి కన్నీళ్ళతో సాగనంపారు...
నిడదవోలు నుంచి రాత్రి 10 గంటలకి ambulance బయలుదేరింది. ఊపిరి
తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ప్రసాద్ గారికి oxygen పెట్టి మేము మాట్లాడుకోవడం
మొదలుపెట్టాం...లైట్ వేసి ఉంటే, ఎదురుగా ఉన్న view mirror లో వెనుక వాళ్ళు కనబడుతున్నారు..
నిడదవోలు...కొయ్యలగూడెం...జంగారెడ్డి
గూడెం...అశ్వరావు పేట....వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం....అక్కడ లైట్ ఆపేసాడు డ్రైవర్...రోడ్
అధ్వాన్నంగా ఉంది..ఇంత దరిద్రంగా ఉంది అని చెప్పడానికి కూడా లేనంత దరిద్రంగా ఉంది..ఖమ్మం
వెళ్లేసరికి 3 అయిపొయింది..నాకు మాములుగానే నిద్ర రాదు..ఇక ప్రయాణంలో
ఏమొస్తుంది..నెమ్మదిగా వెనక్కి వాలాను....
..............................
1998
మా బాబు బుట్టాయిగూడెం లో
పని చేసే వాడు...అప్పుడు నేను 7th చదువుతున్నాను..మా వెనక ఇంట్లో ఉండేవారు ప్రసాద్ అంకుల్
వాళ్ళు..మొదటిసారి ప్రసాద్ గారిని, సరితక్క ని చూసినప్పుడు, ఆయన కూతురనుకున్నాను..తరువాత
అమ్మ చెప్పింది, భార్య అని...అసలు విషయమేమిటంటే ఆయన మొదటి భార్య, ఈయన వేషాలు
భరించలేక విడాకులిచ్చి వెళిపోయింది..తరువాత సరితక్కని ఇచ్చి పెళ్లి చేసారు..అప్పటికి
ఆమె వయసు 18, ఆయన వయసు 37..చాలా బాధేసింది నాకు...పైగా ఎంత అందంగా ఉంటుందో..చుబుకం
మీద ఒక చిన్న పుట్టు మచ్చ తప్ప మరింకే మచ్చా లేని అందగత్తె..పైగా ఆయన్ని ఎంతో బాగా
చూసుకునేది..ప్రసాద్ గారు భయంకరమైన పిసినారి..వడ్డీలకి డబ్బులు తిప్పి అప్పటికే
లక్షలు సంపాదించాడు..అప్పుడప్పుడు, ఆయన అరుపులు, సరితక్కని కొడుతున్న దెబ్బలకి, ఆమె ఏడుపులు మా ఇంట్లోకి
వినిపించేవి....
...............................
ఇంతలో అక్క బండి
ఆపమంది...ఆపాడు డ్రైవర్
పెట్టిన oxygen బలవంతంగా పీకేసుకుంటున్నాడు
ప్రసాద్ గారు...బండి పక్కకి పార్క్ చేసి డ్రైవర్ పెట్టడానికి tri చేసాడు..అయినా ఉంచుకోవట్లేదు...మళ్ళీ అక్క tri చేస్తుంటే ప్రసాద్ గారు
ఏదో అనడానికి tri చేసాడు..నాకు అర్ధం కాలేదు..అప్పుడు అక్క..” చూడు తమ్ముడు
...నా పళ్ళు రాలగొట్టేస్తానంటున్నారు oxygen పెడుతున్నానని “ అంది నవ్వుతు..( చింత చచ్చినా పులుపు
చావలేదు అనుకున్నాను మనసులో)..మొత్తానికి ఇక oxygen పెట్టలేదు...మళ్ళీ బండి
బయలుదేరింది..అక్క వాటర్ బాటిల్ తో నీళ్ళు తాగి, అదే బాటిల్ మూతతో కొన్ని నీళ్ళు ఆయన నోటిలో
కూడా పోసింది...ఆ దృశ్యం చూసి నా మనసు చలించి పోయింది ఎంత ధైర్యముండాలి..ఎంత
ప్రేముండాలి...
“ HIV is not spread through sharing food, touching,
hugging , kissing on cheeks, shaking hands etc..,..”
కానీ ధైర్యం ఉండాలి
కదా....అదీ last stage of AIDS లో పేషెంట్...
మనసులో...ఇలాంటి భార్య
దొరికితే చాలనుకున్నాను...లైట్ ఆఫ్ చేసాడు డ్రైవర్...
సూర్యాపేట దాటాం...కొత్తగా
పోసిన రోడ్ మీద బండి హాయిగా పరిగెడుతుంది..నాకు బోర్ కొడుతుంది..ఎందుకైనా మంచిదని I-pod తెచ్చుకున్నా. కానీ అలాంటి పరిస్థితిలో
పాటలు వింటే ఏమనుకుంటారో అని బయటికి తియ్యలేదు..
..టైం 3 ½ అయ్యింది..ఎందుకో view mirror లో చూసాను
...ఎదురుగా వస్తున్న వాహనాల లైట్స్ పడుతున్నప్పుడల్లా వెనుక కూర్చున్న వాళ్ళు
కనబడి, మాయమవుతున్నారు...అప్పుడు ఆ వెలుగు నీడల క్రీడలో చూసిన దృశ్యాన్ని
నమ్మలేకపోయాను...జాగ్రత్తగా పరిశీలించి చూసాను..జాన్ గారు ఆమెని, పెదవులపై ముద్దు
పెట్టుకుంటున్నాడు..చేతులతో ఊరువులని, స్థనాలని తడుముతున్నాడు, తాకుతున్నాడు..ఆమె
కూడా కళ్ళు మూసుకుని ఆ స్పర్శని ఆస్వాదిస్తుంది....ఒక్క క్షణం చప్పున వెనక్కి
తిరగాలనిపించింది..కానీ ఆగి, చూపు పక్కకి తిప్పుకుని సీట్లో వాలి కళ్ళు మూసుకున్నాను...ఆ దృశ్యం
నాకు , డ్రైవర్ కి సరిగా కనబడకపోయినా వెనుక పడుకున్న ప్రసాద్ గారికి క్లియర్ గా
కనబడుతుంది..ఆయనకి శరీరంలో ఇంకా పని చేస్తున్న భాగాల్లో కళ్ళు కూడా ఉన్నాయి...తన
భార్య, తన స్నేహితునితో , తన ఎదురుగానే...( ఆహా ఎంత గొప్ప శిక్ష వేసావక్కా...ఆయన
నిన్ను పెట్టిన బాధలకి ఇలా కసి తీర్చుకున్నావా..తెలిసి చేస్తున్నావో , తెలియక
చేస్తున్నావో తెలీదు గాని ఇంతకన్నా గొప్ప revenge
లేదు......అయ్యా..అమ్మా..దయచేసి సరిత మీద
కోపగించుకోకండి.....)(చలం...ఎక్కడున్నావయ్యా?? ఇదిగో నీ కధానాయిక...జనాలకి నచ్చ
చెప్పు నా వల్ల కాదు.)..నెమ్మదిగా తల కొంచెం కుడి పక్కకి తిప్పి ప్రసాద్ గారి వంక
చూసాను..కుడి కంటి నుంచి నీరు కారి, చారికలు కనపడుతున్నాయి..ఎడమ కంటి సంగతి నాకు
తెలీదు..
ఇక దాని గురించి ఆలోచించడం
మానేసి i-pod తీసి ఆన్ చేశాను.. నెమ్మదిగా “ గోరంత దీపం” లో పాట మొదలయ్యింది..
చీర సగం కప్పేస్తే, సిగ్గు
సగం దాచేస్తే
మిగిలిందేమిటి చూడ
మిగిలిందేమిటి నేస్తం
పాత పరమ చాదస్తం...
గాలి ఎవరిది , గంధమెవరిది
వెలుతురెవరిది, వెన్నెలెవరిది
భక్తపోతన పద్యమెవరిది
త్యాగరాజల పాట ఎవరిది
నీవి కావా నావి కావా
ఎవరి సొంతం , రమణి అందం
ఎవరి సొంతం
తెల్లవారి 8 గంటలకి NIMS కి చేరుకున్నాం..సరిగ్గా
ambulance, హాస్పిటల్ ముందు ఆగేసరికి , ప్రసాద్ గారికి ఎగ శ్వాస
మొదలయ్యింది..నేను అక్కడున్న డాక్టర్ తో మాట్లాడాను..” HIV positive ని ఈడ అడ్మిట్
చేసుకోరు..ఉస్మానియా కి తీస్కపొండి” అన్నాడు...నేను మళ్ళీ ambulance దగ్గరికి
వెళ్ళేసరికి ఎగశ్వాస ఎక్కువయ్యింది..అక్క కంగారు పడుతుంది...oxygen పెట్టి ఏవేవో
ప్రయత్నాలు చేస్తుంది..నల్లగుడ్లు వెనక్కి వెళ్ళిపోయాయి...అంతే..ప్రాణం
పోయింది..ఎటు పోయిందో మరి...( యమ ధర్మ రాజు ఏ పక్కన నుంచుని పాశం విడిచాడో అన్న
ఆలోచన వచ్చింది)....నిస్సహాయంగా, కర్కశంగా చూస్తూ నిలబడ్డాను తప్ప కనీసం చెయ్యి
కూడ వెయ్యలేదు..ఎందుకంటే నేను కోరుకున్నది అతని చావునే.(in fact అందరు)...సంవత్సరం
నుండి మంచం మీద చావుతో పోరాడుతున్నాడు...అంతకు మించి ఇక ఒక ప్రాణిని బ్రతికించి,
హింసించడం భావ్యం కాదు..
Ambulance ఉస్మానియా కి బయలుదేరింది...అక్క ఏడుస్తుంది....నేను
ప్రశ్నార్ధకంగా చూసాను..నా జీవితంలో చనిపోయిన వాళ్ళని చాలా మందిని చూసాను గాని ,
నా ఎదురుగా ప్రాణం పోవడం ఇదే మొదటి సారి...అదీ దారుణమైన చావు..వెళ్లేసరికి ఆదిత్య,
సమీర్ వెయిట్ చేస్తున్నారు...ఆదిత్య చెక్ చేసి ప్రాణం పోయిందని confirm చేసాడు...అంతే
మళ్ళీ ప్రయాణం మొదలు..అప్పటికే రాత్రంతా నిద్ర లేక మొహాలు వాడిపోయాయి...నా వంక
జాలిగా చూసారు మా వాళ్ళు..( పేషెంట్ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ఓ రెండు రోజులు
ఎంజాయ్ చేద్దామనుకున్నా అసలు).. చౌటుప్పల్ దాటాక ఒక దాబా దగ్గర ambulance ఆపారు...నన్నేమన్నా తినమన్నారు..నాకు పెద్దగా ఫీలింగ్స్
ఏమీ లేవు...కాస్త మొహం కడుక్కుని ఒక నాలుగు రోటీ తిన్నాను..ఈ సారి విజయవాడ మీదగా
వెళ్ళాం...ఆయన స్వంత ఊరు గుడివాడ..అక్కడ శవాన్ని దింపి బయలుదేరి మళ్ళీ నిడదవోలు
వచ్చేసరికి నైట్ 10 అయ్యింది...
గుట్టు చప్పుడు కాకుండా ఒక quarter vodka( ఇంట్లో కదా మరి smell రాకూడదని) తెచ్చుకుని తాగేసి
పడుకున్నాను....
..........................
హలో అండీ !!
ReplyDelete''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!
వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!
రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది
మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు
http://teluguvariblogs.blogspot.in/
na purti angeekaram teluputunnanandi.....naku yento aanandam kuda......ee avakasham na blog ku istunnanduku meku dhanyavadalu
Deletenice
ReplyDelete