దళిత వాడలో పుట్టి పేదరికంలో పెరిగి
బడిలో చివరన గుడికి దూరంగా
కులతత్వపు అడ్డుగీతలు
కోటిప్రశ్నలు లేవనెత్తగా
ఎటు చూసినా అజ్ఞానం
చుట్టూరా అంధకారం
బాధలు ఈసడింపులు
బానిస బ్రతుకుల విముక్తి కోసం
దేశాలెన్నో తిరిగి తిరిగి
శాస్త్రాలెన్నో చదివి చదివి
మానవత్వపు విలువలు పెంచి
మతతత్వానికి హద్దులు చెరిపి
నీవు కూర్చిన రాజ్యాంగం
జాతి జనులకు కరదీపం
దీనులకు నిరుపేదలకు
బతుకునిచ్చిన అంబేద్కర్
ఋణపడ్డది నీకు భారత జాతి...
భారతావని ఎంతో పుణ్యం చేసుకోగా పుట్టిన ఎందరో మహానుభావుల్లో అంబేద్కర్ కూడా ఒకరు..దళితులు ఈరోజు కడుపుకి గుప్పెడు మెతుకులు తిని ధైర్యంగా బయట తిరగగలుగుతున్నారంటే అది ఆయన పెట్టిన భిక్షే. కానీ వాళ్లలోనే చాలా మందికి ఆయన పూర్తి పేరు కుడా తెలియకపోవడం దురదృష్టం...బావి భారత పౌరులైన మీరైనా కనీసం ఈ కుల, మత పైత్యాలకి దూరంగా ఉండండి.....అని పాఠం చెబుతుండగా సుబ్రహ్మణ్యం మొబైల్ ఫోన్ రింగ్ అయ్యింది.. క్లాస్ బయటకొచ్చి లిఫ్ట్ చేసి మాట్లాడారు...
ఆ చెప్పమ్మా మహాలక్ష్మి..
నాన్నా రేపు నన్ను వైజాగ్ తీసుకెళ్ళి కాలేజీ లో జాయిన్ చెయ్యాలి సాయంత్రం త్వరగా వచ్చి షాపింగ్ కి తీసుకు వెళతానన్నావ్ మరిచిపోకు...
గుర్తుంది....Last period permission తీసుకుని వచ్చేస్తా...అమ్మ,నువ్వు రెడీ అయ్యి ఉండండి...
-----------------
దయామయుడా, స్తోత్రార్హుడా, వేలాది దేవదూతల చేత నిత్యమూ కీర్తింపబడు వాడా నీకు వందనాలు నాయనా..ఈ దినము వరకు మమ్ములను కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు లెక్కలేనన్ని స్తుతులు, వందనాలు...మీ కృప చొప్పున పీటర్ కి మంచి కాలేజీ లో సీటు వచ్చింది..రేపు బిడ్డ జాయిన్ అవ్వడానికి వెళుతుండగా ప్రయాణ సమయంలో దేవదూతల్ని చుట్టూ కావలి ఉంచండి..కాలేజీ లో మంచి స్నేహాలు దొరికేలా చెయ్యండి...చెడు స్నేహాలు,వ్యసనాల బారిన పడకుండా కాపాడండి..అలాగే తనతో పాటు చదువుకోబోతున్న అందరు విద్యార్ధులను దీవించి ఆశీర్వదించి భవిష్యత్తులో వాళ్ళ తల్లిదండ్రులకి గర్వకారణము గా చేయుమని, మీ దయ మా యెడల ఎల్లప్పుడూ చూపుమని త్వరలో రానైయున్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రీ...ఆమెన్...
ప్రార్ధన ముగించి పీటర్ పాల్ నుదుట మూడు సార్లు సిలువ గుర్తు వేసింది మేరీ..
------------------
గాయత్రీ విద్యా పరిషద్, వైజాగ్....ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని వేల కాలేజీ లు ఉన్నాయ్....అందులో కొన్ని వందల MBA కాలేజీ లు ఉన్నాయ్....కానీ అందులో చాలా వరకు మంచి lecturers ఉంటే మంచి లైబ్రరీ లేనివి, లైబ్రరీ వుంటే మంచి lecturers లేనివి..కానీ గాయత్రీ విద్యా పరిషద్ అన్నీ ఉన్న గొప్ప విద్యా సంస్థ. నిజమైన విద్యని విద్యార్ధులకి అందించాలన్న తపనతో కొంతమంది సరస్వతీ పుత్రులు కలిసి స్థాపించిన సంస్థ..మొత్తం మూడు బ్రాంచెస్ ఉన్నాయ్...ఒకటి మువ్వల వాని పాలెం(MVP), రెండు తగరపు వలస, మూడు ఋషికొండ...ఋషికొండ బ్రాంచ్ లో MBA ఉంది...పీటర్ I-CET counselling లో గాయత్రీ కాలేజీ సెలెక్ట్ చేసుకున్నాడు..విశాఖ శివార్లలో భీమిలి వెళ్ళే దారిలో కొండల మధ్యన ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటుంది...ఎదురుగా సముద్రం...క్లాసు లో కూర్చుని సముద్ర ఘోష వినొచ్చు...ప్రశాంతమైన వాతావరణం....నిజానికి అదొక దేవాలయం...
--------------------
పీటర్ కాలేజీ కి వెళ్లేసరికి ఎదురుగా ఒక పొడుగాటి వ్యక్తి నిలబడి ఉన్నాడు...దగ్గరికెళ్ళి అడిగాడు పీటర్ MBA 1st year class ఎక్కడ అని.. పీటర్ వైపు ఎగా దిగా చూసి జూనియరా...క్లాసు కి తర్వాత వెళ్ళొచ్చు ముందు ఇటురా అని తీసుకెళ్ళాడు ఒక గదిలోకి..వాతావరణం చూడగానే పీటర్ కి అర్ధమయ్యింది...అక్కడ రాగింగ్ జరుగుతుంది.....స్టేజి మీద ఒక అమ్మాయి నిలబడి ఉంది...పీటర్ ని కూడా స్టేజి మీద నిలబడమని చెప్పారు...
ఇంతలో ఒక సీనియర్....ఎంతసేపమ్మాయ్ ఒక పాట పాడటానికి..త్వరగా పాడు...ఇంకా చాలా మంది ఉన్నారు అన్నాడు
స్టేజి మీద అమ్మాయి నెమ్మదిగా పాట అందుకుంది...వణుకుతున్న గొంతుతో
శ్రీ రంగ రంగ నాయకి దివ్య రూపమే చూడరే..
శ్రీదేవి రంగ నాధుని నామం సంతతం పాడరే....
తర్వాత పీటర్ ని అడిగారు...నీ పేరేంటి?
పీటర్ పాల్...
సరే అయితే నువ్వో Christian song పాడు...
నాకు Christian songs రావు సర్..
చ...Christian కి Christian songs రాకపోతే ఏమొస్తాయ్...
అలా అని rule ఏమీ లేదు కదా సర్...ఇక్కడ కూర్చున్న హిందూస్ లో చాలా మంది తిరుపతిలో తల నీలాలు సమర్పించుకుని వుంటారు వెంకటేశ్వరస్వామి మీద భక్తితో...వాళ్ళలో ఎంత మందికి కనీసం అయిదు అన్నమాచార్య కీర్తనలు వచ్చు...జయదేవుడు రచించిన అష్టపదులు ఎంతమందికి తెలుసు...?? పేరుని బట్టి religion ని, religion ని బట్టి tastes ని, tastes ని బట్టి character ని ఎప్పుడు అంచనా వెయ్యకూడదు సర్ అని స్టేజి దిగి వెళ్ళిపోయాడు పీటర్...అతనిచ్చిన కొద్దిపాటి ధైర్యంతో మిగిలిన జూనియర్స్ కూడా అతన్ని ఫాలో అయిపోయారు...స్టేజి మీద అమ్మాయి పీటర్ పక్కనే నడుచుకుంటూ వెళ్ళింది...
“Hai..My name is మహాలక్ష్మి”..
హాయ్..నా పేరు పీటర్...
“మీకు అష్టపదులు తెలుసా...”
కొంచెం......నాకు మేఘ సందేశం సినిమాలో పాటలంటే చాలా ఇష్టం..ముఖ్యంగా అందులో " ప్రియే చారుశీలే" పాట..దాని lyric writer ఎవరో తెలుసుకుందామని ఎంత ప్రయత్నించినా దొరకలేదు..ఒకసారి నా ఫ్రెండ్ రసజ్ఞని అడిగితే చెప్పింది...అవి అష్టపదులు రా అని...
“Very nice..”
ఇందాక మీరు పాట తప్పు పాడారు...
“ఏం తప్పు పాడాను...?”
శ్రీ రంగ రంగ నాధుని దివ్య రూపమే చూడరే..
శ్రీ దేవి రంగ నాయకీ నామం సంతతం పాడరే..
ఇది correct...any way nice meeting you...bye...

hostel కి వెళ్లి ప్రియే చారుశీలే పాట download చేసుకుని కనీసం 10 సార్లు వింది మహాలక్ష్మి...
---------------------
రెండవ రోజు కాలేజీ కి వెళ్లేసరికి జునియర్స్ ని సెమినార్ హాల్ లో కూర్చోమని చెప్పాడు attender...ఒక సాధారణమైన పల్లెటూరు డిగ్రీ కాలేజీ లో చదివిన కుర్రాడికి ఆ AC సెమినార్ హాల్ కొంచెం వింతగానే అనిపిస్తుంది..పీటర్ కి కూడా అలాగే అనిపించింది...కాసేపటికి శేషగిరి సర్ వచ్చి marketing introduction class చెప్పి వెళ్ళిపోయారు...పేటర్ last row లో కూర్చున్నాడు..సర్ వెళ్ళిపోయిన కాసేపటికి పక్కనే ఉన్న ఒకతను హాయ్ బావా my name is రవి.. అని పలకరించాడు పీటర్ ని...ముక్కు, మొహం తెలియని ఒక కొత్త వ్యక్తిని బావా అని వరస పెట్టి పలకరించిన వ్యక్తి మానసిక స్థితిని అర్ధం చేసుకుని ఏం మాట్లాడకుండా ఒక చిన్న నవ్వు నవ్వాడంతే...
ఇంతలో కొంతమంది స్టూడెంట్స్ ఒక group గా కూర్చుని ఒకరినొకరు ఇంగ్లీష్ లో పరిచయం చేసుకోవడం మొదలు పెట్టారు..జనరల్ గా MBA join అయ్యే విద్యార్ధుల్లో ఒక తరహా ఉత్సాహం ఉంటుంది...ఎవడో తలకి మాసిన వెధవ ముందే చెబుతాడు..MBA అంటే పుస్తకాలు కాదు...ప్రపంచాన్ని చదవాలి, communication skills develop చేసుకోవాలి...ఆడ, మగ అని బేధం చూపకూడదు...సిగ్గు పడకూడదు....ఇంకా ఏవేవో...ఇంతవరకు పర్లేదు గానీ ఈ మాటలు విని కొంతమంది hyper active గా తయారవుతారు...వాళ్ళని భరించడం చాలా కష్టం...అక్కడున్న group లో అందరు hyper active గానే ఉన్నారు...అందులో చేరడం ఇష్టం లేక పీటర్ ఒంటరిగా అలాగే కూర్చొని కళ్ళు మూసుకొని మనసులోనే తనకిష్టమైన పాట హమ్ చేసుకోవడం మొదలెట్టాడు...

తలుపు మూసిన తల వాకిటనే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది...నీ హృదయం కదలనిది..
నేనొక ప్రేమ పిపాసిని...
పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది...నీ హృదయం కదలనిది..
నేనొక ప్రేమ పిపాసిని...
ఇంతలో ఎవరో హాయ్ పీటర్ అని పిలిచారు...కళ్ళు తెరిచి చూస్తే మహాలక్ష్మి..
“హాయ్..”
ఇవాళ ఇక క్లాసెస్ లేవట..పక్కనే ఉన్న ఋషికొండ బీచ్ కి మేం వెళ్తున్నాం...వస్తారా మీరు కూడా..?? It’s just walkable distance
“హాయ్..”
ఇవాళ ఇక క్లాసెస్ లేవట..పక్కనే ఉన్న ఋషికొండ బీచ్ కి మేం వెళ్తున్నాం...వస్తారా మీరు కూడా..?? It’s just walkable distance
ఓకే అన్నాడు పేటర్...
అయిదుగురు అమ్మాయిలు, పీటర్ తో కలిసి నలుగురు అబ్బాయిలు నడుచుకుంటూ ఋషికొండ వెళ్లారు... మధ్యలోనే ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు...బీచ్ కి వెళ్ళిన తర్వాత అందరూ సముద్రం లోకి దిగి ఆడడం మొదలు పెట్టారు..పీటర్ మాత్రం దిగలేదు..అతని దృష్టిలో సముద్రం ఒక పెద్ద drainage...మన ఇంటి ముందు ఉన్న చిన్నdrain లో ఏదైనా పడితే చెయ్యి పెట్టడానికి చిరాకు పడే మనం అంత పెద్ద drainage లో స్నానం ఎలా చేస్తాం...అని అతని లాజిక్కు...బీచ్ పక్కనే ఉన్న ఒక చిన్న బడ్డి కొట్లో కింగ్ సిగరెట్ కొనుక్కుని ఇసుకలో కూర్చుని తాగడం మొదలుపెట్టాడు..

సముద్రంలో...ప్రపంచాన్ని, తడిసి సొగసుల్ని మరింత బయటపడేలా చేస్తున్న దుస్తుల్ని, వయసుని అన్ని మరిచిపోయి చిన్నపిల్లల్లా ఆడుకుంటున్న ఆడపిల్లల్ని చూస్తే "పంజరం విడిచిన పావురం" అంటే ఏంటో అర్ధమయ్యింది పీటర్ కి...అక్కడున్న అమ్మాయిల్లో ఒక్కరిది కూడా వైజాగ్ కాదు...అందరూ చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే..ఇంట్లో ఉన్నప్పుడు గడప కూడా దాటనివ్వకుండా కట్టడి చేసి ఒకేసారి ఇంత స్వేచ్చ ఇస్తే ఏం చేస్తారు మరి ? సినిమాలో చూసి city లో ఇలానే ఉండాలనుకుంటారు వీళ్ళంతా...కాస్త తెలివున్న ఏ మగాడు ఆ weakness పసిగట్టినా ఇక అంతే....
ఇలా ఆలోచనల్లో ఉండగా సంతోష్(బీచ్ కొచ్చిన అబ్బాయిల్లో ఒకడు) వచ్చి పక్కన కూర్చొన్నాడు...
“ఏం పీటర్? ఎందుకు రాలేదు?”
నాకిష్టం లేదు...
“అది సరేగాని ఇలా సిగరెట్ కాల్చడం ఎందుకు?”
ఏం నీకు ఇష్టం లేదా స్మోకింగ్ అంటే?
“ఎందుకు లేదు చక్కగా కాలుస్తా...కానీ అమ్మాయిలున్నారు కదా వాళ్ళ ముందు ఎందుకని..”
ముందెక్కడ కాలుస్తున్నాం...దూరంగానే కూర్చున్నాగా...ఎదుటి వాళ్ళ హెల్త్ పాడు చెయ్యడం నాక్కూడా ఇష్టం ఉండదు..
“అది కాదు వాళ్ళ దృష్టిలో ఎందుకు బాడ్ అవ్వడమని...రేపు అనవసరంగా avoid చేస్తారు కదా..”
నాకు ఆ భయం లేదు...ఎందుకంటే నా అలవాట్లు నచ్చని వాళ్ళని ముందు నేనే avoid చేస్తాను...అయినా సంతోష్ ....నాకు వాళ్ళు పరిచయం అయ్యి 2 రోజులు కూడా కాలేదు..కానీ నేను 2 years నుంచి smoke చేస్తున్నా...ఇవాళ కాకపోయినా రేపో,మాపో వాళ్ళకి తెలుస్తుంది...అప్పుడు ఇంకా చిరాగ్గా ఉంటుంది...అయినా ఎవరికోసమో మన ఇష్టాల్ని వదులుకుంటూ పోతే మనకంటూ ఏమీ మిగలదు...చివరికి వాళ్ళు కూడా...లైట్ తీసుకో...
పీటర్ వంక అదోలా చూసి వెళ్ళిపోయాడు సంతోష్...
ఆడడం అయిపోయిన తర్వాత తిరిగి నడవడం మొదలు పెట్టారందరూ...సంతోష్ కాకుండా మిగిలిన ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకుంటూ వస్తున్నారు...సంతోష్ అమ్మాయిలతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు...పీటర్ ఒక్కడే కాస్త వాళ్ళకి దురంగా నడుస్తున్నాడు...ఇంతలో మహాలక్ష్మి దగ్గరకి వచ్చింది..
“మీరు smoke చేస్తారా?”
ఉ..చూసారుగా...మళ్ళి అదేం ప్రశ్న?
“నాకు మీ అబ్బాయిల్ని చూస్తే jealous గా ఉంటుంది...ఎంత స్వేచ్చ ఉంటుందో కదా మీకు..ఇంకో 30 సంవత్సరాల తర్వాత అయినా ఒక తెలుగు ఆడపిల్ల చూడిదార్ వేసుకుని బీచ్ లో కూర్చుని సిగరెట్ కాల్చగలదంటారా...అది సరే గాని మీరు సముద్రంలో ఎందుకు దిగలేదు....?”
తన లాజిక్ చెప్పాడు పీటర్....
“I agree with your logic....కానీ ఒక విషయం ఆలోచించండి...మన ఇంటి ముందు drainage లో ఒక రూపాయి బిళ్ళ పడితే తీద్దామా వద్దా అని వంద సార్లు ఆలోచించే మనం ఒక బంగారపు ఉంగరం పడితే మాత్రం ఆలోచించకుండా చెయ్యి పెట్టి తీస్తాం...సబ్బుతో కడుక్కుంటే పోతుందని సర్ది చెప్పుకుంటాం...ఇదీ అంతే పీటర్...ఇన్నాళ్ళు సముద్రాన్ని ఊహించుకోవడమే తప్ప చూసింది లేదు...ఆడుకుంటే తప్పేముంది...ఇంటికి వెళ్లి స్నానం చేస్తే పోతుందిగా.”.
పీటర్ నవ్వి...I agree with your logic అన్నాడు....మహాలక్ష్మి పీటర్ number save చేసుకుంది... తరవాత ఎవరింటికి వాళ్ళు, ఎవరి రూమ్స్ కి వాళ్ళు వెళ్ళిపోయారు...

పది రోజుల తర్వాత...
--------------------
“ఏంటి పీటర్ ఒక్క message కి కూడా reply చెయ్యవు నువ్వు?”
ఏం messages?
“అయ్యో అదేంటి రోజూ good morning, good evening messages, friendship messages పంపుతున్నాగా..”
అవా..అవసలు నేను చదవను...
“ఎందుకని?”
ప్రతీ అయిదు నిముషాలకొకసారి మొబైల్ వంక చూసి నవ్వుకుని గబగబా టైపు చేసి, మళ్ళి గాల్లోకి చూసి పిచ్చిపిచ్చిగా నవ్వుకునే వయసు నేను దాటిపోయనని నా అభిప్రాయం...లక్కీ గా ఆ పనులు చేసే వయసులో నా దగ్గర మొబైల్ లేదు...
--------------------
ప్రపంచంలో జరిగే కొన్ని విషయాలకి కారణాలుండవు...అందులో పీటర్, మహాలక్ష్మి పదేపదే మాట్లాడుకోవడం కూడా ఒకటి...సమయం దొరికినప్పుడల్లా ఏదొక టాపిక్ మాట్లాడుకోవడానికి try చేసేవారు...ఒక వేళ classes bore కొడితే sir కి కనపడకుండా మొబైల్ బెంచ్ కింద పెట్టి చాట్ చేసుకునేవారు...ముఖ్యంగా managerial economics, operation research classes...ఒక్క ముక్క కూడా అర్ధం కావు...
---------------------
నిప్పు లేకుండా పొగ రావడం భారతదేశంలో సహజం...పీటర్ తో పాటే రాజీవ్ అని ఒకబ్బాయి రూం లో ఉంటున్నాడు..అతను MBA classmate...ఓ రోజు అడిగాడు పీటర్ ని....

“ఏంటి మామా నీ గురించి, మహాలక్ష్మి గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయ్...?”
ఏమని?
“ఇంకేముంది ప్రేమని....జాగ్రత్త మామా...అసలే బ్రాహ్మల పిల్ల...పెద్దలు చెప్పారుగా ఏడేళ్ళు శని పట్టుకుంటుంది...”
ఒరేయ్...నాకు, మహాలక్ష్మి కి ఏమీ లేదు గాని అది తప్పురా...
“ఏది?”
ఏడేళ్ళ శని...బ్రాహ్మలు సంఘంలో ఎప్పుడూ వాళ్ళ ఆధిక్యం ప్రదర్శించడానికి అర్ధం పర్ధం లేని ఆచారాలు చాలా తీసుకొచ్చారు...కర్ణాటకలో ఓ గుడి ఉంది...అక్కడ సంవత్సరానికొకసారి ఓ పండగ జరుగుతుంది...మధ్యాహ్నం పంతుళ్ళు భోజనం చేసి లేచిన తర్వాత ఆ ఎంగిలి అరిటాకుల మీద మామూలు జనం పడుకుని దొర్లుతారు..అలా చేస్తే పాపాలు పోతాయట...బాధాకరమైన విషయం ఏంటంటే అది ఇప్పుడు కూడా జరుగుతుంది...అలా దొర్లే వాళ్ళందరూ దళితులే...ఇది కూడా అలాంటిదే.. వేరే కులం వాళ్ళు కనీసం తల ఎత్తయినా చూడకుండా ఈ ఏడేళ్ళ శని మూడనమ్మకాన్ని సృష్టించారు...
పడుకున్నాక పీటర్ ని ఆ మాట చాలా ఇబ్బంది పెట్టింది...ప్రేమ...రెండే రెండు అక్షరాల అమృతం...రెండే రెండు అక్షరాల విషం..కొన్ని వేల కధలకి,కొన్ని లక్షల కవితలకి, ఎన్నో మహా కావ్యాలకి మూలం ప్రేమ...ప్రేమ...ఆలోచిస్తూ నిద్రపోయాడు...
----------------------------
తరువాతి రోజు నుండి పీటర్ నెమ్మదిగా మహాలక్ష్మిని avoid చెయ్యడం మొదలుపెట్టాడు...messages reply చెయ్యడం, frequent గా మాట్లాడడం మానేశాడు....మొదట్లో మహాలక్ష్మి ఏదో personal problem అనుకుంది...కానీ అందరితోను బాగానే ఉంటూ తనతో మాత్రమే అంటిముట్టనట్టుగా ఉంటుంటే అనుమానం వచ్చింది...పదేపదే మాట్లాడించడానికి ప్రయత్నించేది...కానీ ముక్తసరిగా మాట్లాడి వెళిపోయేవాడు..ఇక ఉండబట్టలేక ఓ రోజు అడిగింది...
“ఎందుకు పీటర్ నన్నavoid చేస్తున్నావ్...??”
ఛ...అలాంటిదేమీ లేదు...బాగానే మాట్లాడుతున్నాగా..
“ఏది నా వంక చూసి చెప్పు...”
జీవితంలో అంత త్వరగా ఏ విషయానికీ భయపడని పీటర్ మొదటిసారి ఒక ఆడపిల్ల కళ్ళలోకి చూసి మాట్లాడడానికి భయపడ్డాడు...
ఏం లేదు మహాలక్ష్మి..మన మధ్య ఏం లేకుండా..ఎవరో మనల్ని అనే ఛాన్స్ ఎందుకు ఇవ్వడం.....అని వెళ్ళిపోయాడు...
-------------------------
తర్వాత చాలా రోజులు ఇద్దరు మాట్లాడుకోలేదు...మహాలక్ష్మి కూడా messages చేయడం మానేసింది...అసలు పీటర్ వైపు చూడడమే మానేసింది...అతని గురించి అలోచించకూడదనుకుంది...అలా వద్దనుకుంటూనే ఎక్కువ ఆలోచించింది...ఏదో తెలియని గుబులు..దానికి పేరు లేదు...పీటర్ తనతో మాట్లాడుతున్నంత సేపు గ్రహించలేదు..కానీ దూరమయ్యేసరికి అర్ధమవుతుంది...ఎన్నో సార్లు messages type చేసి delete చేసింది ఎన్నో సార్లు number dial చేసి cut చేసింది..అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని ఆలోచించింది...మేఘసందేశం, నారి నారి నడుమ మురారి, స్వర్ణకమలం, సాగరసంగమం, సిరిసిరిమువ్వ ఇలా పీటర్ కి ఇష్టమైన పాటలు పదే పదే వింది...అలా రెండు నెలలు గడిచిపోయాయి...ఇంతలో అక్టోబర్ 3rd వచ్చింది...పీటర్ birthday.....
-------------------------------
రాత్రి 11.50 కి పీటర్ mobile ring అయ్యింది...రెండు నెలల తర్వాత మహాలక్ష్మి...

లిఫ్ట్ చేసి ఆశ్చర్యం,ఆర్ద్రత,ఆత్రుత కలగలిసిన గొంతుతో మహాలక్ష్మీ అన్నాడు...
“హాయ్ పీటర్..How are you?..”
“హాయ్ పీటర్..How are you?..”
I am fine
“నాకొక help చేస్తావా...కాదనకూడదు...”
చెప్పు ఏంటి?
“రేపు evening 5.30 కి కాలేజీ అయిపోయాక నాతో ఋషికొండ వస్తావా..పది నిముషాలలో తిరిగి వెళిపోదు గాని...ఎందుకు? ఏమిటి? అని అడగకు ప్లీజ్..”
అలాగే మహాలక్ష్మి...
ఇంతలో 12 అయ్యింది...
“wish you a very happy birthday peter...”

Thank you..
--------------------
సాయంత్రం ఋషికొండ వెళ్లేసరికి ఓయ్ సినిమా కోసం వేసిన సెట్ దగ్గర మహాలక్ష్మి తన room mates తో కలిసి ఎదురు చూస్తుంది...ఒక చిన్న స్టూల్ మీద birth day cake ఉంది...దాని మీద magic candles వెలిగించి ఉన్నాయ్...
ఎందుకిదంతా మహాలక్ష్మి?
ఏం మాట్లాడకు పీటర్ ప్లీజ్...నా కోసం...
cake cut చేసాక మహాలక్ష్మి ఒక parcel పీటర్ కి ఇచ్చి...ఇంటికి వెళ్లి open చేసి చూడు అని చెప్పింది....
---------------------
రూం కి వెళ్లి స్నానం చేసి నెమ్మదిగా gift open చేసాడు...అందులో ఒక lighter, ఒక ash tray, ఒక white colour T-shirt, ఒక birthday greeting, దాని మధ్యలో ఒక letter ఉన్నాయ్...
మహాలక్ష్మి ఇచ్చిన lighter తో ఒక సిగరెట్ వెలిగించి ash tray పక్కన పెట్టుకుని లెటర్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు పీటర్..
once again I wish you a very happy birthday peter..నాకు నీ అంత బాగా మాట్లాడడం రాదు...నా మనసుకేమనిపిస్తే అది రాస్తున్నాను...నేనే పని చేసినా నాది childish behaviour అని prove చేయడానికి నీ దగ్గర 100 theories ఉంటాయ్...నేనే కాదు పీటర్..వందలో తొంభై మంది అమ్మాయిలు నాలానే ఉంటారు...వంద రూపాయలు పెట్టి temptation chocolate కొనుక్కున్నా...పదే పదే messages forward చేసినా, ఎవరో ముక్కు,మొహం తెలీని వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుని ముద్దు చేసినా, చిన్న పిల్లల్లా behave చేసినా, ఈ వయసులో కూడా అమ్మ,నాన్న ఫోన్ చేస్తే ఏడ్చినా దానికి ఒకటే కారణం..మేం అమ్మాయిలం..We were designed in that way...
పీటర్ రెండో సిగరెట్ వెలిగించాడు...

నిన్ను కలిసిన మొదటి రోజు నుండి నువ్వంటే నాకెందుకో ఒక చెప్పలేని అభిమానం..ఒక్క రోజు నువ్వు కాలేజీ కి రాకపోయినా వెర్రిదానిలా వెతుక్కునేదాన్ని.మన మధ్య ఏమీ లేకుండా ఏదో ఉందని అందరు ఎందుకనుకుంటారు పీటర్ ఉంది. కానీ అది మనం గ్రహించలేదంతే.నువ్వు మాట్లాడని ఈ రెండు నెలలు నరకంలా ఉంది...కారణం నాకు అర్ధమయ్యింది పీటర్...నేను నిన్ను force చేస్తున్నాను, నీ నుండి తిరిగి expect చేస్తున్నాను అనుకోకు..నా భారం తగ్గించుకుంటున్నాను అంతే..I love you, I want to marry you...
ఇట్లు
మహాలక్ష్మి
ఇట్లు
మహాలక్ష్మి
మూడవ సిగరెట్ వెలిగించి మళ్ళి మొదటి నుంచి చదివాడు పీటర్..అలా ఎన్ని సార్లు చదివాడో లెక్క లేదు...ఫుల్ బాక్స్ కింగ్స్ ఖాళీ అయిపోయాయ్..అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు...తెల్లవారు జాము నాలుగు అయిపోయింది...అప్పుడు మహాలక్ష్మి గుర్తొచ్చింది...ఈ సమయంలో తను ఏం చేస్తుంటుందో అనుకున్నాడు....
దూరంగా 93.5 FM లో శ్రుతిలయలు సినిమాలో song వస్తుంది...
దూరంగా 93.5 FM లో శ్రుతిలయలు సినిమాలో song వస్తుంది...
చెలువమునేలగ చెంగటలేవని
కలతకు నెలవై నిలిచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరువై
అలసిన దేవేరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామీ....నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకు...
పీటర్ మొబైల్ తీసి కాల్ చేసాడు...
----------------------
రెండు నెలల తర్వాత MVP Delicacies restaurant లో...

ఏం ఆర్డర్ చేద్దాం పీటర్?
నాకేం problem లేదు..Non-vegetarians కి బోలెడన్ని options..నీ సంగతే ఆలోచించుకో..అసలే సాయంత్రం పప్పు కూడా దొరకదు..
అబ్బ మాట్లాడితే పప్పు అని ఏడిపించకు నన్ను...మేమేమీ జీవితాంతం పప్పు తినం..కూరగాయలతో బోలెడన్ని varieties చేసుకోవచ్చు..
చూస్తాగా పెళ్ళయ్యాక ఎన్ని varieties చేసి పెడతావో నాకు..
ఇంతలో server వచ్చి order sir అన్నాడు..
ఒక mixed vegetable curry, ఒక chettinad chicken curry..నాలుగు పుల్కాలు...
“అబ్బ non-veg ఎలా తింటారు పీటర్ అసలు..అలా చంపెయ్యడం పాపం కదా..”
అంటే మేమందరం మనసు లేని క్రూరులం..మీరు మాత్రం సాత్వికులు అనా..
“అలా కాదు బట్ పాపం కదా..”
నీ మొహం..మన తిండి పాప,పుణ్యాల మీద ఆధారపడి ఉండదు..పుట్టి పెరిగిన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది..నీకు non-veg తినేవాడంటే చిరాకు..నాకు pork,beaf తినేవాడంటే చిరాకు..వాడికి కాకులు,ఉడుతలు తినేవాడంటే చిరాకు..వాడికి బల్లులు,పాములు తినేవాడంటే చిరాకు..మనం ఎవర్నీ ఏమనలేం..అమ్మ ఏది తినిపిస్తే అది తిన్నాం..అయినా ఒక వ్యక్తి nature వాడి తిండి మీద ఆధారపడి ఉండదు..John keats తెలుసుగా...The most romantic poet in the world...ఆయనకి అప్పుడే పుట్టిన పంది పిల్ల రోస్ట్ అంటే ఇష్టం..హిట్లర్ pure vegetarian..30 లక్షల మంది jews ని నిర్దాక్షిణ్యంగా చంపేసాడు..
“అబ్బ చాల్లే ఇంక ఆ టాపిక్ వదిలెయ్..అది సరేగాని పీటర్ నువ్వు మాట్లాడితే untouchbility అంటావ్ గానీ ఇంకా ఏ రోజుల్లో ఎవరున్నారు చెప్పు...మా ఇంటికి అందరు tuition కి వస్తారు...”
ఎందుకు లేదు..గది లోపల మడి కట్టుకుని లలిత సహస్ర నామాలు చదువుకుంటూ కూర్చుంటే ఇలాంటి విషయాలు తెలీవు...అంటరానితనం అంటే ప్రతీవాడు అంబేద్కర్ కాలానికి వెళిపోతాడు...ఇప్పుడు లేరనుకుంటున్నావా...కానూరు అగ్రహారం అనే ఉరు పేరు విన్నావా..మా అమ్మమ్మ వాళ్ళ ఊరు..ప్రతి వేసవి సెలవులకి అక్కడకి వెళ్ళేవాణి...అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఊరు చివర మాలపేటలో..ఒకసారి మా ఫ్రెండ్ చక్రవర్తి ఒక బ్రాహ్మల ఇంటికి తీసుకెళ్ళాడు ఏదో పని ఉండి...మా వాడు వాళ్లతో మాట్లాడుతుండగా నేను బయట వాకిట్లో నిలబడి ఉన్నాను...అక్కడొక నవ్వారు మంచం నిలబెట్టి ఉంది...దాని మీద చెయ్యి వాల్చుకుందామని ముందుకి జరిగాను..ఇంతలో ముసలావిడ గట్టిగా అరిచింది..చూడవయ్యా ముట్టుకుంటున్నాడు అని..అక్కడ కూర్చున్న ముసలాడు చేతి కర్రతో వెనక్కి నేట్టేసాడు నన్ను..ఒక కోమట్ల వాళ్ళ కొట్టుకెళ్ళి నిమ్మ సోడా తాగితే గ్లాసులు కడిగి వెళ్ళమన్నారు...అంతెందుకు డిగ్రీ లో ఉండగా నా ఫ్రెండ్, వాళ్ళ ఇంటికి తీసుకెళితే వాళ్ళమ్మ వాణ్ణి లోపలికి తీసుకెళ్ళి ఎవర్ని బడితే వాళ్ళని ఇంటికి తీసుకురాకు అని తిట్టింది...నువ్వేమో untouchability లేదంటున్నావ్...
“బాబోయ్ నిన్ననవసరంగా కదిపాను...ఆవేశపడకు తిను...”
తింటాలే గాని నువ్వు పెళ్ళయ్యాక కూడా only veg అంటే పిల్లలు పుట్టడం కష్టమేమో ఆలోచించు...
----------------------
కైలాసగిరి
విశాఖపట్నానికి తలమానికం...one of the beautiful tourist spots in India..పై నుంచి విశాఖ మొత్తం కనపడుతుంది..శివ,పార్వతుల విగ్రహాలు ఎంత అందంగా ఉంటాయో...హోరుమని శబ్దం చేస్తున్న మహాసముద్రం పక్కన మహానగరం చంటిపాపలా చప్పుడు చెయ్యకుండా నిద్రపోతుంటుంది...కింద నుండి చూస్తే కొండకి ఎవరో green paint వేసినట్టుంటుంది..కాస్త భావుకత ఉన్నఎవరికైనా అక్కడ కూర్చుంటే కవిత్వం తన్నుకొస్తుంది..కానీ ఇదంతా నాణానికి ఒక వైపు...

రెండోవైపు చూస్తే మనసు కకావికలమైపోతుంది..గుబురుగా పెరిగిన పొదల వెనక పగలు,రాత్రి తేడా లేకుండా వ్యభిచారం జరుగుతుంటుంది..కాలేజీ కి అని వచ్చిన స్టూడెంట్స్ అక్కడికొచ్చి కుదిరిన మేరకు కామం తీర్చుకుని వెళుతుంటారు..సాయంత్రం 8 దాటిన తర్వాత పైన ఎవరూ ఉండకూడదు...
కానీ వాచ్ మాన్ Visakha Urban Development Authority (VUDA) ఇచ్చే జీతం సరిపోక ఒక చెయ్యి చాపి, ఇంకో చేత్తో సలాం కొట్టి కొన్ని కార్లను మాత్రం లోపలికి విడిచి పెడుతుంటాడు..ఎక్కడో పల్లెటూల్ల నుంచి వచ్చి సిటీ అమ్మాయిల్ని చూసి వాతలు పెట్టుకుని కొత్త కొత్త fashions మోజులో పడిన అమ్మాయిలు ఇంట్లో వాళ్ళు పంపిన డబ్బులు సరిపోక, అలాగని కోర్కెలు చంపుకోలేక వాళ్ళ పవిత్రమైన శీలాన్ని అమ్ముకుని posh life కొనుక్కుంటారు..గీతం కాలేజీ లో చదివే ఇద్దరు ఇంజనీరింగ్ అమ్మాయిలు కలిసి సంవత్సరంలో కేవలం వ్యభిచారం చేసి ఒక SANTRO CAR కొన్నారన్నది వైజాగ్ కి తెలీని ఒక చేదు నిజం...
అసలు విశాఖ వాతావరణంలోనే ఏదో problem ఉంది....చల్లని గాలి,beach, pollution less atmosphere, ఎంత పద్దతిగా పెరిగిన అమ్మయినైనా ప్రేమలో పడేస్తుంది...రాతి హృదయాలు కూడా కరిగించి కోర్కెలు రగిలిస్తుంది...
పీటర్,మహాలక్ష్మి కైలాసగిరిలో ఒక చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు...అప్పుడే వాన కురిసి చెట్లకి లాల పోసి, నేలని చేత్తడి చేసి వెలిసింది. తేమ నిండిన చల్లని గాలి ఇద్దరి తనువుల్ని ఆగాగి తాకుతుంది. అప్పటి వరకూ ఇద్దరి మధ్యలో ఉన్న హ్యాండ్ బాగ్ తీసి ఒళ్ళో పెట్టుకుని పీటర్ పక్కగా జరిగింది మహాలక్ష్మి, పీటర్ ఎడమ చేతిని తన కుడిచేతిలోకి తీసుకుని తల భుజం మీద వాల్చింది..సూర్యుడు సిగ్గుపడి పడమటి కొండల వెనక్కి జారుకుంటున్నాడు..నగరం నెమ్మదిగా చీకటి కౌగిలిలోకి జారుకుంటుంది..దూరంగా పాట వినబడుతుంది..
చెదరని పాపిడి వయసుకే శాపము
అలిగిన పైటకి నలిగితే మోక్షము.
స్వర్గమంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో..
పీటర్ చేతితో మహాలక్ష్మి తల పైకెత్తి కళ్ళలో కళ్ళు పెట్టి చూసాడు.అతని చూపుల తీక్షణతకి తాళలేక కళ్ళు మూసుకుంది..మహాలక్ష్మి పెదవులు వణుకుతూ ఓదార్పు కోసం ఎదురు చూస్తున్నాయ్..ఇంతలో ఉన్నట్టుండి పీటర్ లేచి నిలబడి పద మహాలక్ష్మి వెళదాం అన్నాడు..
వంద సంవత్సరాల తపస్సు తర్వాత దేవుడు ప్రత్యక్షమై వరం అడిగేలోపు మాయమైపోయినట్టు అనిపించింది మహాలక్ష్మికి..
--------------
Feb 1st మహాలక్ష్మి పుట్టిన రోజు...January 31st సాయంత్రం 4 కి call చేసాడు పీటర్...
“చెప్పు పీటర్..”
నేను ఇంకో half an hour లో వచ్చి pick up చేసుకుంటాను..ఒక జత బట్టలు సర్దుకుని రెడీ గా ఉండు. Warden కి చుట్టాలింటికి వెళుతున్నా...రేపు వస్తానని చెప్పు...
“ఎందుకు ఎక్కడికి వెళుతున్నాం?”
అరకు
......................
అరకు...జీవితంలో ఒకసారైనా చూడాల్సిన ప్లేస్..సముద్ర మట్టానికి దాదాపు 2000 metres ఎత్తులో ఉంటుంది..వేసవికాలమే రాత్రిళ్ళు విపరీతమైన చలి ఉంటుంది.ఇక చలికాలం సంగతి చెప్పక్కర్లేదు..
ముందు రోజే అక్కడున్న ఒక cottage కి కాల్ చేసి రూం బుక్ చేసాడు పీటర్..పెళ్లి కాని జంటలు కొన్ని వందలు వచ్చి వెళుతుంటాయ్..సాయంత్రం 7 అయ్యేసరికి room కి చేరుకున్నారు..Blender’s pride whisky order చేసాడు పీటర్..తర్వాత ఇద్దరు స్నానం చేసి వచ్చి కూర్చున్నారు..పీటర్ బాటిల్ ఓపెన్ చేసి peg చేసుకుని మహాలక్ష్మికి cheers చెప్పి సిప్ చేసాడు..అదేదో ప్రపంచ వింత అన్నట్టు కళ్ళార్పకుండా చూస్తోంది మహాలక్ష్మి..
“ఎందుకు పీటర్ పనిగట్టుకుని తాగుతున్నావ్?”
ఇవాళ ఇది చాలా important..బహుశా నా ఒక్కడి శక్తి సరిపోకపోవచ్చు..అందుకే దీని help తీసుకుంటున్నాను...
“అర్ధం కాలేదు..”
తరువాత అర్ధం అవుతుందిలే...
కాసేపటికి 12 అయ్యింది..మహాలక్ష్మి cake cut చేసింది.పీటర్ తడబడుతున్న నాలుకతోనే birthday song పాడాడు..మహాలక్ష్మి కోసం కొన్న fastrack watch చేతికి తొడిగాడు..మహాలక్ష్మి పీటర్ ని ఉన్నట్టుండి అమాంతం కౌగిలించుకుంది..
తన మొబైల్ తీసి ప్రియే చారుశీలే song play చేసాడు పీటర్...
సపది మదనానలో దహతి మామ మానసం
దేహి ముఖ కమల మధుపానం...
అర్ధం చేసుకుంది మహాలక్ష్మి..
“మరి ఆ రోజు కైలాసగిరిలో ఎందుకు లేచి వెళ్లిపోయావ్ పీటర్..?”
పది మంది చూసేట్టుగా చెయ్యడం నాకిష్టం లేదు...అలా చేసిన ఎంతోమందిని నేనే తిట్టాను...మనల్ని అనే అవకాశం ఇంకెవరికీ....
పీటర్ మాటల ప్రవాహాన్ని మహాలక్ష్మి తన పెదవులతోనే ఆపింది..
How delicious is winning the first kiss in loves beginning....
తరువాత హోరాహోరీగా జరిగిన క్షీర సాగర మధనంలో అమృతం ఇద్దరికీ దొరికింది...
తెల్లవారుజామున మెలకువ వచ్చేసరికి, తను నగ్నంగా ఉన్న సంగతి పూర్తిగా మరిచిపోయి తన గుండెల మీద తలపెట్టుకు నిద్రపోతున్న మహాలక్ష్మిని గట్టిగా కౌగలించుకుని....ఇంతటి అద్వితీయమైన అనుభవాన్నిఅక్షరీకరించడం ఏ కవి తరం అనుకున్నాడు పీటర్...
..........................
వైజాగ్ రైల్వే స్టేషన్... 1st platform....ratnachal express కోసం ఎదురు చూస్తున్నారు పీటర్,మహాలక్ష్మి...
“రెండేళ్లు ఎంత వేగంగా గడిచిపోయాయ్ పీటర్..”
అవును..
“నాకు వెళ్లాలని లేదు...”
వెళ్ళకు...
పీటర్ భుజం మీద తలవాల్చి ఏడుస్తోంది మహాలక్ష్మి
“నేను ఇంటికి వెళ్లి నాన్న గారిని ఒప్పించి వెంటనే నీకు కాల్ చేస్తాను...”
ఒప్పుకుంటారంటావా?
“ఖచ్చితంగా...నేను ఒక్కగానొక్క కూతుర్ని...నా మాట కాదనరు..”
ఉ.
ఇంతలో ట్రైన్ వచ్చింది...మహాలక్ష్మి కనపడినంత సేపు చూస్తూ నిలబడింది పీటర్ ని...
ట్రైన్ వెళ్ళిపోయాక కూడా చాలా సేపు అక్కడే ఉన్నాడు పీటర్...
.................................
మహాలక్ష్మి ఎవర్నో ప్రేమించిందటండి..చెప్పింది లలితా సుబ్రహ్మణ్యానికి
“ఎంత మారిపోయాయే రోజులు పిల్లలు ధైర్యంగా చెప్పేస్తున్నారు తల్లిదండ్రులతో...ఏమి పేరంట..”
పీటర్ పాల్...
ఉన్నట్టుండి మంచం మీద నుంచి లేచాడు సుబ్రహ్మణ్యం...
“Christian...చిచి అంతకన్నా దరిద్రం లేదు...దానికేం పైత్యం పట్టిందే..ఇంకెవరు దొరకలేదా..?? నా బొందిలో ప్రాణం ఉండగా ఒక తురక వాడికి గాని, మాల వాడికి గాని నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయను..
ఇంతలో మహాలక్ష్మి తన గది నుండి బయటికి వచ్చింది...
ఎందుకు నాన్నా?
“ఎందుకా..??అసలు మాల వాడు అంటే ఏమిటో తెలుసేమిటే నేకు...ఛండాలుడు, దరిద్రుడు,నీచుడు ఇవన్నీ ఎవరికి పర్యాయ పదాలనుకున్నావ్...మాల వాడికి...పరమ చండాలం అంతా ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి...దరిద్రమైన స్థలాల్లో తిరుగుతుంటారు కాబట్టి...’నీచు తింటారు కాబట్టి ఆ పేర్లు వచ్చాయ్...”
అప్పుడు ఆ పనులు చేసే వాళ్ళందర్నీ అలాగే పిలవాలి కద నాన్నా...
“ఎవరున్నారు అలాగ..?”
నేను పీటర్ వాళ్ళ ఇల్లు చూసా నాన్నా...అమ్మ కన్నా వాళ్ళ అమ్మ గారు చాలా శుభ్రంగా వుంచుతారు ఇల్లు...నెలకి ఒక్కసారి తప్ప non veg తినరు వాళ్ళు..
“నువ్వు లక్ష చెప్పు నేను ఒప్పుకోను..”
అంటే ఇన్ని రోజులు మీరు పిల్లలకి చెబుతున్న పాఠాలు అంతా నాటకమే కద నాన్న...జీవితంలో మొదటిసారి మీ కూతురిగా పుట్టినందుకు బాధ వేస్తుంది నాకు...
ఇంతలో మహాలక్ష్మి చెంప చెల్లుమంది...తల్లి లేచి కొట్టింది...
...............................
10 రోజుల తర్వాత..
“పీటర్...నేను మహాలక్ష్మిని..”
ఏమైంది మహాలక్ష్మి నీ మొబైల్ కి చాలా సార్లు try చేశాను...పని చేయడం లేదు...స్విచ్ ఆఫ్ అని వస్తుంది...
“నాన్న గారు మన పెళ్ళికి ఒప్పుకోలేదు పీటర్..నన్నుHouse arrest చేసారు...నా మొబైల్ తీసేసుకున్నారు..ఇంట్లో నుంచి బయటకి రానివ్వడం లేదు...నేనిప్పుడు బయట PCO నుంచి చేస్తున్నాను..”
నన్ను రమ్మంటావా..
“వద్దు పీటర్...ఏదో విధంగా నేనే ఒప్పిస్తాను...నువ్వోస్తే అనవసరంగా గొడవలవుతాయ్..”
...............................
రెండు నెలల తర్వాత.....
“పీటర్ నేను మహాలక్ష్మిని...”
ఏమైపోయావ్ మహాలక్ష్మి......ఎక్కడో నూతిలోంచి వచ్చింది పీటర్ గొంతు..
ఏడుస్తుంది మహాలక్ష్మి..
నేను మీ ఊరు వచ్చాను..ఇల్లు ఖాళి చేసి వెళ్ళిపోయారు అని చెప్పారు...
“నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి మా మావయ్య వాళ్ళ ఇంట్లో పెట్టారు...ఇది ఏ ఏరియా నో కూడా నాకు తెలీదు...చాలా భయంగా ఉంది పీటర్..నాకు సంబంధాలు చూస్తున్నారు..”
...............................
6 నెలలు గడిచాయ్...సంవత్సరం గడిచింది...మహాలక్ష్మి దగ్గర నుంచి కాల్ లేదు..
మహాలక్ష్మి వాళ్ళ ఊరు మళ్ళి వెళ్ళాడు పీటర్...
అందర్ని వాకబు చేసాడు..సుబ్రహ్మణ్యం పని చేసే స్కూల్ దగ్గరికెళ్ళాడు...అక్కడ attender ని అడిగాడు...
ఆ అమ్మాయి వైజాగ్ లో ఎవర్నో ప్రేమించిందటండి..హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడే పెళ్లి చేసేసారు...పెళ్లి అయ్యి రెండు నెలలయ్యింది..అబ్బాయి అమెరికా లో ఏదో ఉద్యోగం అంట...
పీటర్ కి వెయ్యి పిడుగులు తల మీద ఒక్కసారి పడినట్టు అయ్యింది...కళ్ళు తిరుగుతున్నాయ్..పెరిగిన గడ్డం, మాసిన బట్టలతో పిచ్చి వాడిలా ఉన్నాడు...తిరిగి వైజాగ్ వెళ్ళిపోయాడు...ఒక రెండు నెలల పాటు గదిలోంచి బయటకి రాలేదు...పగలు, రాత్రి తేడా లేకుండా తాగాడు...మెలకువ వచ్చిన ప్రతిసారి తాగాడు...
నెమ్మదిగా అర్ధమయ్యింది...మహాలక్ష్మి కాదు.. తన కోసం ఎదురు చూసే, తన కోసం బాధపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు...నెమ్మదిగా కోలుకున్నాడు...కానీ 7 సంవత్సరాల వరకు సరైన ఉద్యోగం రాలేదు...తర్వాత...CMR shopping mall లో మేనేజర్ గా జాబ్ వచ్చింది...
Sir bagachepparu sit.ee kalam lo bedhalu ekkuvane
ReplyDeleteఈ కాలంలో నువ్వు చెప్పినంత వర్ణ వివక్ష నేనయితే చూడలేదు కానీ మోహన్ సంగీత ప్రియుడివి, మంచి గాయకుడివి, నీకు నేను చెప్తే తప్ప ప్రియే చారుశీలే పాట జయదేవునిదని తెలియదా ;)
ReplyDelete"పేరుని బట్టి religion ని, religion ని బట్టి tastes ని, tastes ని బట్టి character ని ఎప్పుడు అంచనా వెయ్యకూడదు" completely agree.
ప్రేమించిన ఆడపిల్ల దూరమైతే, ఎంత సున్నిత మనస్కుడైనా సరే,
ReplyDeleteఅలా భ్రష్టు పడతాడని నేననుకోను.
అందునా ఈతరం అబ్బాయి. .
అయినా ఈకధ ద్వారా మీరు చెప్పా దలుచుకున్నదేంటి.
కధా వస్తువు కన్నా, కధనం బాగుంది.
@Karna - Thank you karna..
ReplyDelete@Rasagna - నాకు అష్టపదులు గురించి చెప్పింది నువ్వు కాదు..అసలెవరు చెప్పారో కూడా నాకు గుర్తు లేదు...కానీ నా జీవితంలో చాలా ముఖ్య పాత్ర పోషించిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో నువ్వు కూడా ఒక దానివి...అందునా బ్రాహ్మల పిల్లవి...నీ ప్రస్థావన ఏ మాత్రం లేకుండా కధ ముగించిడం కరెక్ట్ కాదనిపించింది...అందుకే అలా చొప్పించా.....ఎంతైనా రసజ్ఞ నా స్నేహితురాలు అంటే నాకు గర్వకారణం కదా....
@Atreya - ఆత్రేయ గారూ ప్రేమలో విఫలమై ప్రాణాలే తీసుకుంటున్నప్పుడు, బ్రష్టు పట్టడం ఎంత సేపండి.....దాని కన్నా ఇదే సులువు కదా......ఒకమ్మాయి మోసం చేసిందని ఉన్మాది లా మారి, కనబడిన ప్రతీ అమ్మాయిని చంపిన కధలు మనం ఎన్ని వినలేదు. తరువాత.. నేనేదో చెప్పదలుచుకుని రాయలేదండి ...నా అనుభవాల్ని ఓ కధలా మార్చి రాసానంతే.....అందులో ఉన్న కొన్ని conversations నిజం...కధ కల్పితం....
I mean to say, nowadays it is not that serious.
DeleteLove, move,happy
if differed or divided more happy
a fresh life with a fresh person.
anyway I am an intruder in to this matter
Sorry Peter.
maro manchi katha.. mana rastram lo inka varna vivakstha undi ani nenu kooda angikaristhanu .. mukyamanga chadukunna valla lo kooda valla gnananni marichi ippatiki kulam kulam ani vemparladuta manam gamanisthunatam .. emito eppudu maruthundo mana samajam.. chuddam ...
ReplyDeletenenu kuda wait chestunna seenu garu.....kaanee ledu possibility ledu....ranu ranu yekkuvaipotundi...
ReplyDeleteకథా.. చెప్పే విధానం.. రెండూ బావున్నాయి. ఆలోచింపజేసేట్టుగా కూడా.
ReplyDeleteప్రత్యేకించి ముగింపు చాలా బావుంది. ఎప్పటిలాగానే, అన్ని కథల్లో లాగానే జీవితాన్ని నాశనం చేసుకోకుండా.. మనసులో ఉన్న బాధ తాలూకు ప్రభావం మిగిలిన జీవితం మీద పడకుండా... త్వరలోనే కోలుకోవటం అనేది చాలా ముఖ్యం... అదే చేశాడు పీటర్. ఒకవేళ ఈ కథ నిజంగా జరిగిందే అయితే... పీటర్ కి మిగిలిన జీవితం సంతోషం, సుఖమయం కావాలని కోరుకుంటున్నాను.
అంటరానితనం - నిజమే.. సమాజాన్ని చాలా భయంకరంగా పీడించింది ఒకప్పుడు. ఇప్పటికీ ఉంది. కానీ పాత రోజుల్లో ఉన్నంతగా ఇప్పుడు లేదు. సమాజం చాలానే మారిందని చెప్పచ్చు. మారని వాళ్ళ సంగతంటారా.. చెడు అనేది అప్పుడూ ఉంది.. ఇప్పుడూ ఉంది...ఎప్పుడూ ఉంటుంది. అంటరానితనం అనేది "చెడు" అయితే.. ఎప్పటిలాగానే దాన్ని పట్టించుకోకుండా.. కేవలం మంచిని గ్రహించి ముందుకి వెళ్ళిపోవటమే. ఎంతగా మార్చాలని ప్రయత్నించినా.. ఈ అమానుషాన్ని ప్రోత్సహించే నిక్రుష్టులు ఉంటూనే ఉంటారు. అలాంటప్పుడు, సమాజాన్ని ఈ విషయంలో మార్చాలని ప్రయత్నించే బదులు... వాళ్ళనే వెలివేసినట్టుగా ప్రవర్తించటం... వాళ్ళ మాటలని పట్టించుకోకుండా - అవసరమైన విషయాల మీద దృష్టి సారించటం ఉత్తమం.
sandilya garu...kadha nijamga jaragaledu....antaa kalpitame.....
Deletemi site songs lyrics kosam choostuu untaa eppati nunchooo....
ReplyDeletebut ee roje first time ee blog choodatam .. story narration bagundi ...
ye roujullo choosi ee story raasaaro gaani ee rojullo antaraani tanam choodaledu ... infact cities lo 10-15 yrs nunchi ayite nenu choodaledu mari :)
bujji garu, welcome to my blog....indulo nenu swayamga face chesina incidents ekkuva unnay..(prema kadha tappa)...ayite andulo chaalaa varaku na chinna nati anubhavaalu anukondi...ippudu antha darunamg evaru leru meerannatte....ayite cities ki villages ki polchalem.....entha champukunnaa, kadanukunnaa kontamandiki, vallu puttina kulam vallo, marinke karanam chetano manasulo aa bhaavaalu inkaa alaane unnayannadi matram vastavam....(nijamgane meerannattu kulam samasya samasi poyi unte, ee rojukee balakrishna cinema tickets kosam kottukune vallundaru)....
Deleteఅంటరానితనం పోయినా దాన్ని బ్రతికించుకోవడం, కొందరికి బ్రతుకుతెరువుగా మారింది. అది లేదంటే కోటాలు, తాయిలాలు పోతాయనే భయం. అర్థం చేసుకోదగ్గదే. అందుకే కదా ఈ మధ్య 'వెనకబాటు తనానికీ హోరాహోరీగా పోటీ పడుతున్నారు. :)
ReplyDeleterende rendu lines lo me abhiprayam chalaa adbhutamga chepparandi....avunu meerannadi nijame, nannu antaranivadiga gurinchatledenduku ani badhapadutunnaru chalaa mandi.......
Delete
ReplyDeletehope u get my point what I am saying..
appati antaraani tanam veru ippati kula samasya veru ani naa abhiprayam ..
kulaala reservatiosn lone telustundi kada .... kula samasya poledu ani
(nijamgane meerannattu kulam samasya samasi poyi unte, ee rojukee balakrishna cinema tickets kosam kottukune vallundaru)....
eee point oka 10 sarlu chadivaanu balakrishna mention entaa ani
anyway -
ee rojullo antagaa tickets kottukone chance ekkada istunnaaru no.of theaters penchesaaru kadaa ..first roje eegal tolingss :)
ee kadhanaanni Ambedkar gaari poemtho modalalupettadam chalabagudi. aa poem ante naaku chala ishtam.naa chinnappudu aa poemki naaku nacchina vidhanga tune kattukoni paadevaanni.ee poemtho aa gnaapakaalni gurthu chesinaduku thanks Mohan gaau.
ReplyDeleteoka.saari mee patanu mee suswaramtho paadi naaku mail cheyyandi annagaaru
Deletegood morning sir naa ku chinna korika gaa ee kshanam naa mumdhi oka asha undhi.sir adhentante nenu naa jeevitha kaalam mugise antha lopu mimmalni okkasari kalvalani sir
ReplyDeleteHi Sir,
ReplyDeleteNeenu mee blog ni ee madyane chusanu. The stories are excellent. Waiting for your more updates.
Satish
Thank you Satish.....
Deletejohar dr b r ambethker
ReplyDelete