Wednesday, 4 July 2012

ఇంకో రోజు

అలవాటుగా,
అర్ధరాత్రి
అమృత ఘడియలోనో అలసిపోయి, కన్నులు చిక్కని చీకటి దుప్పటిలో చొరబడినప్పుడు,
మనసు
ఊహల రెక్కలు తగిలించుకుని నిన్నువెతకడానికి బయలుదేరుతుంది..

నువ్వు
కనికరించవు, కాన రావు..
నక్షత్రాల మధ్యనో, అప్పుడే విరిసిన పూరేకుల మధ్యనో,
వెండి
వెన్నెలలో జలకమాడి, సొగసులకు సొభగులద్దుకున్న ఏకాంత దీవిలోనో...
కూర్చుని
నా పిచ్చి మనసును చూసి నవ్వుకుంటూ ఉంటావని తెలుసు...

నా
అవస్థ గమనించిన దినకరుడు కరుణించి..
తన
కల్మషం లేని కిరణాలు నా కన్నులపై కుమ్మరిస్తాడు..
చీకటిని
తరిమికొడతాడు..
దిక్కు
తోచక ఎక్కడో తిరుగుతున్న నా మనసుని ఈడ్చుకొచ్చి మళ్ళీ ప్రపంచంలో పడేస్తాడు....
"నాన్నా టైం అవుతుంది" అన్న అమ్మ కేక వినబడుతుంది..
తెల్లవారుతుంది
...మళ్లీ ఇంకో రోజొస్తుంది..